






Best Web Hosting Provider In India 2024

Brahmamudi March 12th Episode: యామిని ట్రాప్‌లో పడ్డ రాజ్ – విధవరాలిగా కావ్య – రుద్రాణి చెంప పగలగొట్టిన ఇందిరాదేవి
Brahmamudi March 12th Episode: బ్రహ్మముడి మార్చి 12 ఎపిసోడ్‌లో రాజ్‌ను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి తన ఇంటికి తీసుకెళుతుంది యామిని. రాజ్‌తో కలిసి దిగిన ఫొటోలను ఇంటి నిండా నింపుతుంది. ఆ ఫొటోలను చూపిస్తూ మనకు ఎంగేజ్‌మెంట్ కూడా జరిగిందని అంటుంది. యామిని మాటలను నిజమని రాజ్ నమ్ముతాడు.

Brahmamudi March 12th Episode: గతం మర్చిపోయిన రాజ్‌ను తన సొంతం చేసుకోవడానికి కన్నింగ్ ప్లాన్ వేస్తుంది యామిని. రాజ్‌ను రామ్‌గా మార్చేస్తుంది. మరోవైపు రాజ్ చనిపోయాడంటే కావ్య నమ్మదు.షర్ట్ మాత్రమే దొరికిందంటే ఆయన ఉన్నారనే అర్థమని కుటుంబసభ్యులతో వాదిస్తుంది. అందరం కలిసి వెతికితే రాజ్ తప్పకుండా దొరకుతాడని అంటుంది.
అడవిలో దారి తెలియక రాజ్ తప్పిపోయి ఉంటాడని, మనం వెళ్లి వెంటనే కాపాడుదామని గోలగోల చేస్తుంది. రాజ్‌ను వదిలి ఉండలేనని అంటుంది. మీరు వచ్చిన రాకపోయినా రాజ్‌నే తానే తీసుకొస్తానని బయలుదేరబోతుంది. కావ్య మాటలతో అందరూ కన్నీళ్లు పెట్టుకుంటారు.
కావ్య ఆనందం…
అప్పుడే డాక్టర్ అక్కడికి వస్తాడు. కావ్య స్పృహలోకి వస్తే ఎవరి మాట వినడం లేదని, హాస్పిటల్ నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తుందని అంటాడు. కావ్యను వెంటనే డిశ్చార్జ్ చేస్తామనిన చెబుతాడు. డాక్టర్ మాటలతో కావ్య సంబరపడుతుంది. నన్ను డిశ్చార్జ్ చేస్తే రాజ్‌ను వెతకడానికి వెళ్లొచ్చని అంటుంది. రాజ్ ఎక్కడున్న తాను తీసుకొస్తానని అంటుంది.
యామిని ఫొటోలు…
రాజ్ హాస్పిటల్‌లో ఉంటే అతడి కుటుంబసభ్యుల కంటపడే ప్రమాదం ఉందని గ్రహించిన యామిని అతడిని తన ఇంటికి తీసుకెళుతుంది. అదే టైమ్‌లో కావ్యను డాక్టర్లు డిశ్చార్జ్ చేస్తారు. కానీ రాజ్‌ను కావ్య చూడలేకపోతుంది. రాజ్‌ను తన బావ అని నమ్మించడానికి ఇంటి నిండా రాజ్‌తో తాను కలిసి దిగిన ఫొటోలను నింపుతుంది యామిని. ఇదే మన ఇళ్లు అని, చిన్నప్పటి నుంచి ఇక్కడే మనం ఇద్దరం కలిసి పెరిగామని, చదువుకున్నామని, ఆడుకున్నామని అంటుంది. ఈ ఇంట్లోనే కలిసి బతకాలని అనుకున్నామని చెబుతుంది.
ఎంగేజ్‌మెంట్…
మనకు ఎంగేజ్‌మెంట్ కూడా జరిగిందని, అది నీకు గుర్తురావడం లేదా అని రాజ్‌ను అడుగుతుంది యామిని. కానీ రాజ్ సమాధానం ఇవ్వకుండా సైలెంట్‌గా ఉంటాడు. యామిని కోసం రాజ్‌ను తమ మేనల్లుడే అంటూ ఆమె తల్లిదండ్రులు నాటకం ఆడుతారు. చిన్నప్పటి నుంచి నిన్నే భర్తగా యామిని కోరుకుందని అంటారు.
ఫొటో ఆల్బమ్…
రాజ్‌ను తన బావ అని నమ్మించడానికి అతడి రూమ్‌లో తామిద్దరం కలిసి దిగిన ఓ ఫొటో ఆల్బమ్‌ను పెడుతుంది. అవన్నీ చూస్తాడు రాజ్. యామినినే తన మరదలు అని ఫిక్సైపోతాడు.
కావ్య ఇంట్లో అడుగుపెట్టగానే ఎదురుగా రాజ్ ఫొటో కనిపిస్తుంది. ఆ ఫొటో చూసి కావ్య ఎమోషనల్ అవుతుంది. కన్నీళ్లు పెట్టుకుంటుంది. చిన్న వయసులోనే దేవుడు నీకు అన్యాయం చేస్తాడని, ఇంత భారాన్ని నువ్వు మోయాల్సివస్తుందని అనుకోలేదని ఇందిరాదేవి అంటుంది. కోట్ల ఆస్తి ఉన్న నీ బాధను దూరం చేయలేని నిరుపేదలమని కావ్యను ఓదార్చుతుంది. ఈ కుటుంబం అంతా నీకు తోడుగా ఉంటామని చెబుతుంది.
రాజ్ క్షేమంగా ఉన్నాడు…
నాకు ఏం కాలేదని, రాజ్ ఎక్కడ ఉన్నాడో తెలియక బాధపడుతున్నానని ఇందిరాదేవికి బదులిస్తుంది కావ్య. లోయలో పడ్డ రాజ్ గాయపడి ఉంటాడని, అంతకుమించి ఆయనకు ఏం కాదని కావ్య చెబుతుంది.
రాజ్ చనిపోయాడని పోలీసులు చెప్పిన మాటలు మీరు నమ్మి ఏడుస్తూ కూర్చోవడం బాగాలేదని అపర్ణతో అంటుంది కావ్య. రాజ్ ఎక్కడో ఓ చోట క్షేమంగా ఉన్నాడని నా మనసు చెబుతుందని అంటుంది. రాజ్ ఏదో ఒక రోజు తప్పకుండా ఇంటికొస్తాడని అంటుంది. కావ్యకు సర్ధిచెప్పబోతుంది అప్పు. రాజ్ చనిపోయాడని ఎవరూ అనడానికి వీలులేదని అందరికి కావ్య వార్నింగ్ ఇస్తుంది.
పిచ్చిదైపోతుంది…
కావ్యను ఇలాగే వదిలేస్తే తన ఆరోగ్యం ఏమైపోతుందోనని స్వప్న ఎమోషనల్ అవుతుంది. ఏమవుతుంది పూర్తిగా పిచ్చిదైపోతుందని రుద్రాణి అంటుంది. రాజ్ చచ్చిపోయాడు. ఇక ఎప్పటికీ తిరిగిరాడని చెబుతుంది. ఆమె మాటలతో దుగ్గిరాల కుటుంబసభ్యులు కోపం పట్టలేకపోతారు. రుద్రాణి చెంపపై గట్టిగా ఒక్కటి కొడుతుంది. నోరూమూయమని హెచ్చరిస్తుంది.
తాళిబొట్టు తీసేస్తే…
రాజ్ చనిపోయాడనే విషయం కావ్యకు వెంటనే అర్థమయ్యేలా చెప్పాలని, లేదంటే మనం నలుగురిలో నవ్వుల పాలవుతామని రుద్రాణి అంటుంది. రాజ్ బతికే ఉన్నాడని కావ్య ప్రపంచమంతా చెప్పుకుంటూ తిరుగుతుంది. అప్పుడు కొడుకు చనిపోగానే కోడలిని గాలికి వదిలేశారని అందరూ మనలను తిడుతారని రుద్రాణి అంటుంది. మన సంప్రదాయాల ప్రకారం కావ్య తాళిబొట్టు , పసుపు కుంకుమలు తీసేస్తే పిచ్చి మాటలు మానేసి నిజం తెలుసుకుంటుందని రుద్రాణి వాదిస్తుంది.
కల నిజం అవుతుందా?
నువ్వు అసలు మనిషివేనా…ఇలా మాట్లాడటానికి సిగ్గుగా అనిపించడం లేదా అని రుద్రాణికి క్లాస్ ఇస్తుంది ఇందిరాదేవి. ఎదుటివాళ్ల కళ్లల్లో కన్నీళ్లు చూసైనా నీకు కొంచెం కూడా జాలి కలగడం లేదా అని రుద్రాణిని నిలదీస్తుంది. నువ్వు నన్ను కొట్టినంత మాత్రానా కావ్య కంటున్న కల నిజమవుతుందా? రాజ్ తిరిగి వస్తాడా? అని రుద్రాణి అంటుంది. రాజ్ మనకు ఇక లేడు…రాడు అని అంటుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగిసింది.
సంబంధిత కథనం