Karthika Deepam Today Episode March 12: పేపర్ చించిన కార్తీక్.. సుమిత్ర మాటతో పెళ్లికి జ్యోత్స్న ఓకే.. గౌతమ్‍తో దీప గొడవ

Best Web Hosting Provider In India 2024

Karthika Deepam Today Episode March 12: పేపర్ చించిన కార్తీక్.. సుమిత్ర మాటతో పెళ్లికి జ్యోత్స్న ఓకే.. గౌతమ్‍తో దీప గొడవ

Chatakonda Krishna Prakash HT Telugu
Published Mar 12, 2025 07:30 AM IST

Karthika Deepam 2 Today Episode March 12: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. తాత శివన్నారాయణపై కేసు పెట్టేందుకు కార్తీక్ ససేమిరా అంటాడు. సుమిత్ర చెప్పిన మాటలతో గౌతమ్‍ను పెళ్లి చేసుకునేందుకు జ్యోత్స్న ఓకే అంటుంది. దాసును టపాసు అడ్డుకుంటుంది. పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.

Karthika Deepam Today Episode March 12: పేపర్ చించిన కార్తీక్.. సుమిత్ర మాటతో పెళ్లికి జ్యోత్స్న ఓకే.. గౌతమ్‍తో దీప గొడవ
Karthika Deepam Today Episode March 12: పేపర్ చించిన కార్తీక్.. సుమిత్ర మాటతో పెళ్లికి జ్యోత్స్న ఓకే.. గౌతమ్‍తో దీప గొడవ

కార్తీక దీపం 2 నేటి (మార్చి 12) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. ఇప్పుడు మీ తాత శివన్నారాయణపై కేసు పెట్టకపోతే కోట్ల ఆస్తి చేజారిపోతుందని కొడుకు కార్తీక్‍తో అంటాడు శ్రీధర్. మా అమ్మే ఆస్తి వద్దనుకుందని, నాదీ అదే మాట అని కార్తీక్ చెబుతాడు. ఆస్తి కోసం తాతపై కేసు వేయబోనని అంటాడు. పేపర్లపై ఒక్క సంతకం పెడితే అంతా తాను చూసుకుంటానని శ్రీధర్ అంటాడు. మనకు రాసిపెట్టి లేని దాని గురించి ఆలోచించకూడదని కార్తీక్ అంటాడు. మనవడిగా నీకు హక్కు ఉందిరా అని శ్రీధర్ అంటే.. అది నువ్వు గుర్తు చేయాల్సిన అవసరం లేదంటాడు కార్తీక్.

దీపా.. నువ్వైనా చెప్పు

“దీప మీ ఆయనకు నువ్వైనా చెప్పమ్మా.. వచ్చే డబ్బుతో రెస్టారెంట్ పెట్టుకోవచ్చు. మంచి ఇల్లు కొనొచ్చు. నా అప్పు తీర్చొచ్చు. శివన్నారాయణ మీద మీ ఆయన చేసి శపథం గెలవొచ్చు. ఇవన్నీ ఒక్క సంతకంతో జరుగుతున్నాయంటే అద్భుతంగా కదా” అని శ్రీధర్ అంటాడు. దీప ఆలోచిస్తున్నట్టుగా చూస్తుంది. ఆ అద్బుతాన్ని నేను చేస్తా.. మీ బతును మారుస్తా.. శివన్నారాయణ మీద పగ తీర్చుకునే అవకాశం వదులుకోకూడదని శ్రీధర్ అంటాడు. ఒకే ఒక్క సంతకం పెట్టించు దీప అని అడుగుతాడు.

పేపర్లను ముక్కలు చేసిన కార్తీక్

సంతకం పెట్టించాలంటూ కేసు పేపర్లను దీప చేతికి ఇస్తాడు శ్రీధర్. మీ నాన్న అడిగిన దాంట్లో న్యాయం ఉందని దీప అంటే.. నా బాధ నీకు అర్థమైంది దీప అని శ్రీధర్ అంటాడు. మీ పద్ధతిలో చెబితేనే ఆయనకు అర్థమవుతుందని దీప అంటే.. కన్‍ఫ్యూజన్ లుక్‍ ఇస్తాడు శ్రీధర్. ఆ తర్వాత పేపర్లను చించేస్తాడు కార్తీక్. ముక్కలు.. ముక్కలు చేస్తాడు. ఇదా నువ్వు నా కొడుకుకు ఇచ్చే సలహా అని దీపతో శ్రీధర్ అంటాడు.

తాత మీద పగతో వచ్చావ్

నాది, నా భార్యది ఒకే మాట అంటాడు కార్తీక్. దీప కోసం అప్పుడు ఇల్లు వదిలావ్, ఇప్పుడు ఆస్తిని వదిలేస్తున్నావ్.. ఒక్కసారి ఆలోచించు.. నీ మీద ప్రేమతో వచ్చా అని శ్రీధర్ అంటాడు. నువ్వు తాత మీద పగతో వచ్చావని కార్తీక్ చెబుతాడు. చేసిన తప్పుకు గెంటేశారనే కోపం నీకు అలాగే ఉంది, అందుకే నన్ను అడ్డం పెట్టుకొని కోర్టుకు లాగాలని అనుకుంటున్నావని కార్తీక్ కనిపెట్టేస్తాడు. వాళ్ల ఆస్తిలో వాటా రాయకపోయినా మాకు బంధువులే అని కార్తీక్ అంటాడు. ఆ ఇంటి మీద ప్రేమ ఉందని, ఎప్పటికీ అది అలాగే ఉంటుందని చెబుతాడు. బయలుదేరండి అంటూ కార్తీక్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

శివ మామ పరువును రోడ్డుకు ఈడ్చేవరకు..

నా కొడుకు జీవితాన్ని నాశనం చేసేందుకే వచ్చావని దీపను దూషిస్తాడు శ్రీధర్. అవసరాల కోసం మనుషులను ప్రేమించే మీలాంటి వారి కోసం బంధాల విలువ తెలియదు, మీరు బయలుదేరవచ్చని దీప అంటుంది. తల్లి, పెళ్లాం మాట విని ఆస్తి వద్దని అంటే.. నేను వదలిపెడతానని అనుకుంటున్నావా.. నేను వదిలిపెట్టను అని శ్రీధర్ అనుకుంటాడు. శివ మామ పరువు రోడ్డుకు ఈడ్చేదాక ఈ అల్లుడు శ్రీధర్ ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడని మాట్లాడుకుంటాడు.

దాసును అడ్డుకున్న టపాసు

అత్త కాంచనకు ఆస్తి రాయకపోవడం సరికాదంటూ స్వప్నతో కాశీ మాట్లాడుతుంటాడు. పక్కనే భోజనం చేస్తుంటాడు దాసు. అసలైన అన్యాయం జరిగింది మా అన్నయ్య కార్తీక్‍కు అంటుంది స్వప్న. ఆ యావదాస్తికి జ్యోత్స్న ఇప్పుడు వారసురాలు అయిందని చెబుతుంది. స్వప్న నోటి నుంచి జ్యోత్స్న పేరు రాగానే దాసు కంగారు పడతాడు. జ్యోత్స్న తనను తలపై కర్రతో కొట్టి విషయం గుర్తొస్తుంది.

దీంతో సడెన్‍గా లేస్తాడు దాసు. వారసురాలు కాదు.. ఇప్పుడే నేను వెళ్లి అన్యాయం జరగకుండా ఆపుతానని అంటాడు. వారసురాలికి అన్యాయం జరుగుతోంది.. నేను జరగనివ్వనని దాసు అంటాడు. ఎవరు ఆ వారసురాలు అని కాశీ అడుగుతాడు. ఇంకెవరు కార్తీక్.. అని దాసు ఏదో చెప్పబోయే లోపు ఓ టపాసు పేలుతుంది. దీంతో శబ్దం రావడంతో మళ్లీ చెప్పాలనుకున్న విషయం మర్చిపోతాడు దాసు. దీపే అసలు వారసురాలు అని చెప్పలేకపోతాడు. భోజనం చేస్తుంటే మధ్యలో తీసుకొచ్చావ్.. రండి భోజనం చేస్తానంటాడు.

బయట పిల్లలు టపాసులు కాలుస్తున్నారని, ఆ సౌండ్‍కు మామయ్య డిస్ట్రబ్ అయ్యారని స్వప్న అంటుంది. వారసురాలు అంటే.. కాంచన ఏమోనని, మామయ్య దాసు అన్నాడని స్వప్న లాజిక్ చెబుతుంది స్వప్న. ఇక. కార్తీక్‍ బావకు అన్యాయం జరుగుతోందని కాశీ అంటే.. మా అన్నయ్య తప్పకుండా గెలుస్తాడని స్వప్న అంటుంది. బావకు దీప వెన్నంటి ఉంటుందని, గెలుస్తారని కాశీ అంటాడు.

డాడీకి ఏదో అనుమానం ఉంది

నా పరిస్థితి ఏంటి ఇలా అయిపోయిందని జ్యోత్స్న ఆలోచిస్తూ ఉంటుంది. “బావను ఎలా పెళ్లి చేసుకోవాలా అని ఆలోచిస్తుంటే.. దీపే వారసురాలు అని తెలిసింది. దీపను ఎలా అడ్డుతొలగించుకోవాలా అనుకుంటుంటే మధ్యలో దాసు వచ్చాడు. దాసుతో ఇప్పుడు సమస్య లేదనుకుంటే తాత ఆస్తి మొత్తం మమ్మీ, డాడీకి రాసేశాడు. వాళ్ల వారసురాలు దీప. అది తెలిస్తే నాకు ఈ ప్లేస్ ఉండదు. నాకు ఆస్తి రాయానని ఆడగలేదు. తన కూతురిని చంపాలనుకున్నానని దీప చెప్పింది. డాడీకి ఏదో అనుమానం ఉంది. ఇప్పుడు ఏం చేయాలి. ఎక్కడి నుంచి మొదలుపెట్టాలి” అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న

ఆస్తి మాటతో పెళ్లికి ఓకే చెప్పిన జ్యోత్స్న

జ్యోత్స్న దగ్గరికి సుమిత్ర వస్తుంది. ఆఫీస్‍కు వెళ్లవా అంటుంది. చిన్నప్పుడు వద్దన్నా పిల్లలను స్కూల్‍కు పంపుతామని సుమిత్ర అంటుంది. అలాగే పిల్లలు వద్దన్నా తల్లిదండ్రులు పెళ్లి చేస్తామని, ఎందుకు అని దశరథ్ అంటాడు. అది కూడా పిల్లల భవిష్యత్తు కోసమేనని శివన్నారాయణ ఎంట్రీ ఇస్తాడు. మేం ఒక పెళ్లి సంబంధం చూశామని, ఫ్రెండ్ గౌతమేనని సుమిత్ర అంటుంది. ఒకే అంటే ముహూర్తం పెట్టించేస్తామని అంటారు. కలెక్టర్ గారి అబ్బాయే అని పారిజాతం అంటుంది.

తనకు ఇష్టం లేదని జ్యోత్స్న అంటుంది. కార్తీక్‍ను వదిలేసి, నువ్వంటే ఇష్టపడే అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని సుమిత్ర చెబుతుంది. జ్యోత్స్న వద్దంటుంది. “మాకు మాత్రం ఎవరు ఉన్నారు ఒక్కగానొక్క కూతురివి. ఆస్తి అంతా నీ పేరు మీద రాస్తాం. నువ్వు నీ భర్త మా రెస్టారెంట్ చూసుకోండి” అని సుమిత్ర అంటుంది. “పెళ్లి చేసుకుంటే ఆస్తి మొత్తం రాస్తారా” అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. గౌతమ్ ఇల్లరికం కూడా వస్తానని చెప్పాడని శివన్నారాయణ అంటాడు. పెళ్లి అంగీకరించాలని సుమిత్ర మరోసారి అడుగుతుంది.

దీంతో.. గౌతమ్‍తో పెళ్లికి సరేనంటుంది జ్యోత్స్న. మన అమ్మాయి మన మాట కాదనదండి అంటూ సుమిత్ర సంతోషిస్తుంది. కానీ గౌతమ్‍తో ఓసారి మాట్లాడాలని చెబుతుంది జ్యోత్స్న. మాట్లాడి వచ్చిన తర్వాత నా నిర్ణయం చెబుతానని అంటుంది. ఇప్పుడే వెళతానని చెబుతుంది. “వేరే ఆప్షనే లేకుండా చేశారు. చెప్తా మ అందరి సంగతి” అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న.

దాసు నయమైతే..

అలా అంటుంది కానీ జ్యోత్స్న గుడ్‍న్యూస్ చెబుతుందని సుమిత్ర అంటుంది. “ఏమో సుమిత్ర.. జ్యోత్స్న ఒక్కోసారి ఒక్కోలా కనిపిస్తోంది. జ్యోత్స్న పెళ్లి జరిగేలోపు దాసుకు నయమైపోతే ఆ నిజం ఏంటో తెలుస్తుంది. అసలు వారసురాలు ఎందుకు రాశాడో ఇప్పటికీ అర్థం కావడం లేదు” అని మనసులో అనుకుంటాడు దశరథ్.

అమ్మాయిని మోసం చేసిన గౌతమ్

జ్యోత్స్నను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్న గౌతమ్.. ఓ అమ్మాయిని మోసం చేసి ఉంటాడు. ఆ అమ్మాయి, వాళ్ల తల్లిదండ్రులు వచ్చి గౌతమ్‍ను ఏడుస్తూ అడుగుతుంటారు. ఇంతలో ఫుడ్ డెలివరీ ఇచ్చేందుకు అక్కడికి వచ్చిన దీప.. గుమ్మం దగ్గరి నుంచి చూస్తుంటుంది. పనికి వచ్చిన మా అమ్మాయితో మీరు ప్రేమ అన్నారట.. ఇప్పుడు మా కూతురికి మూడో నెల అని ఆ అమ్మాయి తండ్రి అంటాడు. ఇంతలో దీపను చూస్తాడు గౌతమ్. పుడ్ డెలివరీ ఇచ్చేందుకు వచ్చానని దీప అనడంతో కాలింగ్ బెల్ కొట్టాలి కదా అని గౌతమ్ అరుస్తాడు. ఇక వెళ్లండి అని అంటాడు.

గౌతమ్‍తో గొడవపడిన దీప

ఇదేదో అమ్మాయిని మోసం చేసిన కేసులా ఉందే అని దీప అనుకుంటుంది. అవసరం తీరిందని మాట మార్చకు అని గౌతమ్‍తో ఆ అమ్మాయి అంటుంది. కలిసి తిరిగాం కడుపొచ్చింది.. డబ్బు ఇస్తా తీయించుకో అని పొగరుగా డబ్బు కట్టలు వేసిరేస్తాడు గౌతమ్. నోరు విప్పితే ఏం జరుగుతుందో తెలుసు కదా అని బెదిరిస్తాడు. ఇదంతా విన్న దీప మళ్లీ అక్కడికి వస్తుంది. “ఏం చంపేస్తావా” అని దీప అంటుంది. మళ్లీ ఎందుకొచ్చావని గౌతమ్ అంటాడు. గౌతమ్‍తో దీప గొడవ పడుతుంది.

చెప్పు తీసుకొని చెంపలు పగలకొట్టాలి

మళ్లీ ఎందుకొచ్చావని గౌతమ్ అంటే.. నీలాంటి వెధవలకు బుద్ధి చెప్పడానికి వచ్చానని దీప అంటుంది. కూతురికి అన్యాయం చేసిన వాడితో ఇలాగేనా మాట్లాడేది.. చెప్పు తీసుకొని రెండు చెంపలు పగలగొట్టాలని దీప అంటుంది. పోతావా లేదా అని గౌతమ్ అరిస్తే.. బుద్ధి చెప్పే పోతానంటుంది దీప. కేసు పెడదామని ఆ అమ్మాయితో దీప చెబుతుంది. అలాంటివి ఏమీ వద్దని, బయటికి ఈ విషయం తెలుస్తుందని ఆ అమ్మాయి తల్లిదండ్రులు అంటారు. మీ కూతురికి అన్యాయం చేస్తున్నాడని దీప అంటే.. అందరికీ తెలిస్తే బతకలేమని ఆ అమ్మాయి తల్లి అంటుంది. కాళ్లు పట్టుకుంటా వెళ్లిపో అని అమ్మాయి తండ్రి అంటాడు. అర్థమైంది కదా.. వెళ్లు అని పొగరుగా అంటాడు గౌతమ్. దీంతో కార్తీక దీపం 2 నేటి (మార్చి 12) ఎపిసోడ్ ముగిసింది.

Chatakonda Krishna Prakash

TwittereMail
చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024