Hero Nithiin: రాబిన్‌హుడ్‌లో ఒక్క బూతు డైలాగ్ కూడా ఉండ‌దు – నాపై ప‌డ్డ ఫ్లాప్ ముద్ర పోతుంది -నితిన్ కామెంట్స్‌

Best Web Hosting Provider In India 2024

Hero Nithiin: రాబిన్‌హుడ్‌లో ఒక్క బూతు డైలాగ్ కూడా ఉండ‌దు – నాపై ప‌డ్డ ఫ్లాప్ ముద్ర పోతుంది -నితిన్ కామెంట్స్‌

Nelki Naresh HT Telugu
Published Mar 12, 2025 06:14 AM IST

Hero Nithiin: రాబిన్‌హుడ్ మూవీలో అస‌భ్య‌క‌ర‌మైన డైలాగ్ ఒక్క‌టి కూడా ఉండ‌ద‌ని నితిన్ అన్నాడు. ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మ్యాన్ మూవీతో నాతో పాటు శ్రీలీల‌పై ప‌డ్డ ఫ్లాప్ ముద్ర రాబిన్‌హుడ్‌తో పోతుంద‌నే న‌మ్మ‌క‌ముంద‌ని పేర్కొన్నారు. మార్చి 28న రిలీజ్ కాబోతున్న ఈ మూవీకి వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

నితిన్, రాజేంద్రప్రసాద్, శ్రీలీల
నితిన్, రాజేంద్రప్రసాద్, శ్రీలీల

నితిన్‌, శ్రీలీల జంట‌గా న‌టిస్తోన్న రాబిన్‌హుడ్ మూవీ మార్చి 28న రిలీజ్ కాబోతోంది. ఈ యాక్ష‌న్ కామెడీ మూవీకి వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. రాబిన్‌హుడ్ మూవీలో సీనియ‌ర్ న‌టుడు రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషించారు.

దిల్ రాజు వ‌ల్ల పాపుల‌ర్‌..

మంగ‌ళ‌వారం యూనిట్ ఏర్పాటుచేసిన ప్రెస్‌మీట్‌లో రాబిన్‌హుడ్‌ను ఉద్దేశించి నితిన్ మాట్లాడుతూ “అది దా సర్ప్రైజ్ పాట కూడా చాలా పెద్ద హిట్ అయింది. దిల్ రాజు వల్ల ఆ వర్డ్ పాపులర్ అయింది కాబట్టి ఆయనకి థాంక్స్ చెప్తున్నాను. డైరెక్టర్ వెంకీ, నేను నిన్న రాత్రి సినిమా చూసుకున్నాం. ఓ గంట సేపు ప్రేమించుకొని…కౌగిలించుకొని…ఆల్‌మోస్ట్ కామించుకోబోయి ఆపుకున్నాం. ఈ సినిమా మా కెరీర్ హ్యుజ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కాబోతుందని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పగలను.

నా బర్త్ డే మార్చ్ 30. ఈ సినిమా వచ్చేది మార్చి 28. డైరెక్టర్ ఈ సినిమాతో నాకు బిగ్గెస్ట్ బర్త్ డే గిఫ్ట్ డైరెక్ట‌ర్ వెంకీ ఇవ్వబోతున్నాడు. ఛ‌లో, భీష్మ కి డబుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఈ సినిమాలో ఉంటుంది. నాతో పాటు శ్రీలీల, రాజేంద్రప్రసాద్ వెన్నెల కిషోర్ మా సీన్స్ చాలా అద్భుతంగా వ‌చ్చాయి. ఈ సినిమాకు రాజేంద్ర‌ప్ర‌సాద్‌, వెన్నెల‌కిషోర్ కూడా హీరోలే” అని నితిన్ పేర్కొన్నాడు.

క్లీన్ కామెడీ…

“రాబిన్‌హుడ్ మూవీలో చాలా క్లీన్ కామెడీ ఉంటుంది. ఎక్కడ ఒక్క అసభ్యకరమైన మాట ఉండదు. ఇంత ఆర్గానిక్ కామెడీ ఈ మధ్యకాలంలో నేనెక్కడ చూడలేదు. మార్చి 28న వెంకీ కుడుముల విశ్వరూపం చూడబోతున్నారు. వెంకీకి ఇది 3.ఓ. ఎంట‌ర్‌టైన్‌మెంట్ పీక్స్‌లో ఉంటూ కథ ఎమోషన్ స్క్రీన్ ప్లే అద్భుతంగా రాశాడు. క్లైమాక్స్ చూసిన తర్వాత ఆడియన్స్ వావ్ అంటారు.గ‌త ఏడాది నేను, శ్రీలీల క‌లిసి ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మ్యాన్ సినిమా చేశాం. ఆ సినిమాతో మాపై ప‌డ్డ ఫ్లాప్ ముద్ర రాబిన్‌హుడ్‌తో చెరిగిపోయి హిట్ క‌పుల్‌గా మ‌మ్మ‌ల్ని నిల‌బెడుతుంద‌నే న‌మ్మ‌క‌ముంద‌ని” నితిన్ చెప్పాడు.

వంద శాతం క‌ష్ట‌ప‌డ్డా…

హీరోయిన్ శ్రీలీల మాట్లాడుతూ “రాబిన్‌హుడ్‌లో మీరా అనే పాత్ర‌లో క‌నిపిస్తాను. ఈ సినిమా కోసం నా వంతుగా వంద శాతం క‌ష్ట‌ప‌డ్డాను. నితిన్‌తో వర్క్ చేయడం ఇది సెకండ్ టైమ్. నా క్యారెక్టర్ గురించి కూడా చాలా కేర్ తీసుకున్నారు, శ్రీలీలకు ఇలాంటి డైలాగ్ ప‌డాలి, సీన్ ప‌డాలి అని ఎప్పుడు ఆలోచించేవారు”అని చెప్పింది.

డేవిడ్ వార్న‌ర్‌…

“రాబిన్‌హుడ్‌తో తప్పకుండా బ్లాక్ బస్టర్ హిట్‌ కొడుతున్నాం. నా బెస్ట్ వర్క్ ఇదే. షూటింగ్ మొద‌లుకావ‌డానికి ముందే చాలా టైమ్‌ దొరికింది. ఆ టైం ని చాలా అద్భుతంగా వాడుకున్నాం. ఈ సినిమాకు బ్యాక్ బోన్ నితిన్‌. క‌థ‌ నచ్చి శ్రీలీల ఈ సినిమా చేసింది. రాబిన్‌హుడ్‌లో మంచి ఫన్ వుంది. మీరు సర్ప్రైజ్ అయ్యే ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. ఈ సినిమాలో గెస్ట్ రోల్‌లో క్రికెట‌ర్ డేవిడ్ వార్నర్ క‌నిపిస్తారు. త్వరలో ఆయన కూడా తెలుగు ఆడియెన్స్ ముందుకు వ‌స్తారు” అని వెంకీ కుడుముల అన్నాడు.

పాత రోజులు గుర్తొచ్చాయి…

“రాబిన్ వుడ్ సినిమాలో నటించిన తర్వాత మళ్లీ నాకు నా పాత‌ రోజులు గుర్తొచ్చాయి నేను హీరోగా చేసిన సినిమాలన్నీ గుర్తుకొచ్చాయి. రాబిన్‌హుడ్‌లో ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది” అని రాజేంద్ర ర‌ప్ర‌సాద్ అన్నారు.

Nelki Naresh

TwittereMail
నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024