






Best Web Hosting Provider In India 2024

OTT Family Drama: ఓటీటీలో సత్తాచాటుతున్న తెలుగు ఫ్యామిలీ డ్రామా మూవీ.. ట్రెండింగ్‍లో టాప్
OTT Family Comedy drama Movie: బాపు చిత్రం ఓటీటీలో మంచి వ్యూస్ దక్కించుకుంటోంది. థియేటర్లలో రిలీజైన మూడు వారాలకే స్ట్రీమింగ్‍కు వచ్చిన ఈ మూవీ సత్తాచాటుతోంది. ఆ వివరాలివే..

తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ‘బాపు’ చిత్రం మంచి అంచనాలతో వచ్చింది. బలగం చిత్రంతోనూ ఈ మూవీకి పోలికలు వచ్చాయి. బాపు మూవీ గత నెల ఫిబ్రవరి 21వ తేదీన థియేటర్లలో రిలీజైంది. బ్రహ్మాజీ, ఆమని, సుధాకర్ రెడ్డి ఈ రూరల్ ఫ్యామిలీ కామెడీ డ్రామా మూవీలో ప్రధాన పాత్రలు పోషించారు. అయితే, ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద అనుకున్న రిజల్ట్ రాలేదు. బాపు మూవీ ఇటీవలే ఓటీటీలో స్ట్రీమింగ్‍కు కూడా వచ్చింది.
ట్రెండింగ్‍లో దూసుకొచ్చిన బాపు
బాపు చిత్రం గత శుక్రవారం (మార్చి 7) జియోహాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ బాపు చిత్రానికి మంచి వ్యూస్ దక్కుతున్నాయి. దీంతో ఈ చిత్రం హాట్‍స్టార్ ఓటీటీ ట్రెండింగ్‍లో టాప్ ప్లేస్‍కు వచ్చేసింది.
బాపు చిత్రం ప్రస్తుతం (మార్చి 12) జియోహాట్‍స్టార్ ఓటీటీలో టాప్‍లో ట్రెండ్ అవుతోంది. మంచి వ్యూస్ సాధిస్తూ సత్తాచాటుతోంది. థియేటర్లలో రిలీజైన మూడు వారాల్లోనే ఈ మూవీ జియోహాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. అందులోనూ ఐదు భాషల్లో ఉండటం కూడా ఎక్కువ వ్యూస్ వచ్చేందుకు తోడ్పడుతోంది.
బాపు మూవీకి కే దయాకర్ రావు దర్శకత్వం వహించారు. తెలంగాణలోని ఓ గ్రామంలో ఈ మూవీ స్టోరీ సాగుతుంది. వ్యవసాయం, అప్పులు, సవాళ్ల చుట్టూ ఈ ఫ్యామిలీ డ్రామా మూవీ సాగుతుంది. ఎమోషనల్ సీన్లు కూడా ఉన్నాయి. అయితే, ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ రావటంతో అనుకున్న రేంజ్‍లో బాపు హిట్ కాలేకపోయింది.
బాపు మూవీలో బ్రహ్మాజీ, ఆమని, సుధాకర్ రెడ్డి పాటు ధన్య బాలకృష్ణ, అవసరాల శ్రీనివాస్, రచ్చ రవి, మణి ఎగుర్ల కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని భాను ప్రసాద్ రెడ్డి, రాజు నిర్మించగా.. ఆర్ఆర్ ధృవన్ సంగీతం అందించారు.
బాపు స్టోరీలైన్
తెలంగాణలోని ఓ గ్రామంలో మల్లన్న (బ్రహ్మాజీ) వ్యవసాయం చేస్తుంటాడు. భారీ వాన వల్ల పత్తి పంటకు నష్టం జరుగుతుంది. అప్పులు ఇచ్చిన వారు తీర్చాలని మల్లన్నపై ఒత్తిడి తెస్తారు. అప్పులు తీర్చే మార్గం లేక ఆత్మహత్య చేసుకోవాలని మల్లన్న నిర్ణయించుకుంటాడు. ఆత్మహత్య చేసుకోవద్దని, నీ తండ్రి రాజయ్య (సుధాకర్ రెడ్డి)ని చంపేసి సహజ మరణంగా చిత్రీకరిస్తే రూ.5లక్షల ఇన్సూరెన్స్ వస్తుందని మల్లన్నతో భార్య సరోజ (అమని) చెబుతుంది. మరోవైపు జేసీబీ ఆపరేటర్‌గా పని చేసే చంటి (రచ్చ రవి)కి ఓ విగ్రహం తవ్వకాల్లో దొరుకుతుంది. అప్పులు చీర్చేందుకు మల్లన్న ఏ నిర్ణయం తీసుకున్నాడు? తండ్రిని చంపేందుకు మల్లన్న ప్రయత్నించాడా? ఆ విగ్రహం కథేంటి? అనే విషయాల చుట్టూ బాపు మూవీ స్టోరీ సాగుతుంది. ఈ చిత్రంలో నటీనటుల పర్ఫార్మెన్స్ మెప్పించినా.. ఎమోషనల్‍గా ప్రేక్షకులను ఈ చిత్రం కనెక్ట్ చేయలేకపోయింది. దీంతో బాక్సాఫీస్ పెద్దగా రాణించలేకపోయింది.
మలయాళ డార్క్ కామెడీ చిత్రం ‘పొన్మన్’ చిత్రం మార్చి 14న జియోహాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. బాసిల్ జోసెఫ్ హీరోగా నటించిన ఈ చిత్రం థియేటర్లలో మంచి హిట్ అయింది. ఈ చిత్రం తెలుగులోనూ ఓటీటీలో అందుబాటులోకి రానుంది.
సంబంధిత కథనం