

Best Web Hosting Provider In India 2024
AP Finance Corporation Jobs 2025 : ఏపీ ఫైనాన్స్ కార్పొరేషన్ లో 30 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ – ముఖ్య వివరాలివే
AP Finance Corporation Recruitment 2025 : ఏపీ ఫైనాన్స్ కార్పొరేషన్‌లో ఉద్యోగాల భర్తీకి ప్రకటన జారీ అయింది. ఇందులో భాగంగా 30 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 11వ తేదీలోపు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్‌లో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు దాఖలకు ఏప్రిల్ 11వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. మొత్తం 30 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తారు. ఆసక్తి, అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
పోస్టుల వివరాలు…
అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు 30 కాగా… ఇందులో ఫైనాన్స్ విభాగంలో 15, టెక్నికల్ విభాగంలో 8, లీగల్ విభాగంలో 7 పోస్టులను భర్తీ చేస్తున్నారు. అయితే అభ్యర్థి కేవలం ఒక విభాగంలోని పోస్టులకు మాత్రమే దరఖాస్తు దాఖలు చేసుకోవల్సి ఉంటుంది. నెల వారీ జీతం 35,000 ఉంటుంది. మూడేళ్ల కాంట్రాక్ట్ కాల వ్యవధి ఉంటుంది. ఆ తరువాత పని ఆధారంగా కొనసాగిస్తారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయో పరిమితి 2025 జనవరి 31 నాటికి 21 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, బీసీ అభ్యర్థులకు మూడేళ్లు, దివ్యాంగు అభ్యర్థులకు పదేళ్లు వయస్సు సడలింపు ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు…
- ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం – 12 మార్చి 2025.
- దరఖాస్తు దాఖలకు ఆఖరు తేదీ – 11 ఏప్రిల్ 2025.
- అప్లికేషన్ ఫీజు చెల్లింపునకు ఆఖరు తేదీ – 11 ఏప్రిల్ 2025.
- ఎగ్జామ్ తేదీ – మే నెలలో ఉంటుంది (తేదీని త్వరలో ప్రకటిస్తారు).
అర్హతలు…
1. అసిస్టెంట్ మేనేజర్ (ఫైనాన్స్): సీఏ, సీఎంఏ, ఎంబీఏ (ఫైనాన్స్), పీజీడీఎం (ఫైనాన్స్) కోర్సుల్లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎంఎస్ ఆఫీస్, ఫైనాన్సియల్ మోడ్‌లింగ్ వంటి కంప్యూటర్ స్కిల్స్ ఉండాలి. అలాగే బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, పరిశ్రమల్లో ఏడాది పాటు ఫుల్ టైం ప్రాజెక్టు చేసి ఉండాలి.
2. అసిస్టెంట్ మేనేజర్ (టెక్నికల్): బీటెక్ (మెకానికల్ ఇంజనీరింగ్) 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ఎంఎస్ ఆఫీస్, ఫైనాన్సియల్ మోడ్‌లింగ్ వంటి కంప్యూటర్ స్కిల్స్ ఉండాలి. అలాగే బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, పరిశ్రమల్లో ఏడాది పాటు ఫుల్ టైం ప్రాజెక్టు చేసి ఉండాలి.
3. అసిస్టెంట్ మేనేజర్ (టెక్నికల్): 50 శాతం మార్కులతో లా గ్రాడ్యుషన్, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ లా కోర్స్ పూర్తి చేసి ఉండాలి. అలాగే పీజీ అర్హత ఉంటే అది అదనంగా యాడ్ అవుతుంది. ఎంఎస్ ఆఫీస్ వచ్చి ఉండాలి. బార్ కౌన్సిల్‌లో ఎన్‌రోల్ అయినవారు… కిందస్థాయి కోర్టులు, జిల్లా కోర్టులు, హైకోర్టుల్లో రెండేళ్ల పాటు ప్రాక్టీస్ చేసి ఉండాలి. వాణిజ్య బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో లా ఆఫీసర్‌గా పని చేసి ఉండాలి. తెలుగు పరిజ్ఞానం తప్పని సరి.
దరఖాస్తు ఫీజు, ఎంపిక విధానం…
అప్లికేషన్ ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు రూ.354, జనరల్, బీసీ కేటగిరీ అభ్యర్థులకు రూ.590 ఉంటుంది. అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు అభ్యర్థులను ఆన్‌లైన్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.
మొత్తం 200 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. ప్రొఫెషనల్ నాలెడ్జ్ (ఫైనాన్స్, టెక్నికల్, లా) (140 మార్కులు), రీజనింగ్ (15 మార్కులు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (15 మార్కులు), ఇంగ్లీష్ (15 మార్కెలు), జనరల్ అండ్ ఫైనాన్సియల్ అవెర్నెస్ (15 మార్కులు) ఉంటాయి. ఎగ్జామ్ రెండు గంటల పాటు ఉంటుంది. విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, కర్నూలు, తిరుపతి, హైదరాబాద్ ను పరీక్షా కేంద్రాలుగా ఉంటాయి.
అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అప్లికేషన్‌ను రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తరువాత నిర్ణయించిన ఫీజును చెల్లించాలి. డాక్యుమెంట్లను స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. చివరగా సబ్మిట్ నొక్కితే ప్రాసెస్ పూర్తవుతుంది.
ఈ లింక్ పై క్లిక్ చేసి అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవచ్చు…
ఈ లింక్ పై క్లిక్ చేసి పూర్తి స్థాయి నోటిఫికేషన్ వివరాలను పొందవచ్చు…
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.
టాపిక్