



Best Web Hosting Provider In India 2024

Holi and Kajjikayalu: హోలీ రోజు కజ్జికాయలు కచ్చితంగా తింటారు, టర్కీ నుంచి మన దేశానికి ఈ స్వీట్ ఎలా వచ్చింది?
Holi and Kajjikayalu: హోలీ రోజు గుజియా అని పిలిచే స్వీటును ఉత్తర భారత దేశంలో అధికంగా తింటారు. దీన్నే మనం కజ్జికాయలు అని పిలుచుకుంటాం. ఈ కజ్జికాయలు టర్కీ నుంచి మన దేశానికి వచ్చాయని చెప్పుకుంటారు.

హోలీ అంటే చాలు, ఎన్నో ప్రాంతాల్లో గుజియా స్వీట్లు విపరీతంగా అమ్ముడుపోతాయి. గుజియాను మనం కజ్జికాయలు అని పిలుచుకుంటాం. లోపల కోవా లేదా కొబ్బరి కోరును పెట్టి ఈ స్వీట్‌ను తయారు చేస్తారు. హోలీ సమీపిస్తున్న కొద్ది నెయ్యిలో వేయించిన గుజియాల వాసన ప్రతి ఇంట్లో ఘుమఘుమలాడిపోతుంది. ఈ రంగుల పండుగకు ప్రత్యేకమైన స్వీటు కజ్జికాయలు. డ్రైఫ్రూట్స్, కోవా, కొబ్బరి తో నిండి ఉండే ఈ కజ్జికాయ వెనక ఎంతో చరిత్ర కూడా ఉంది.
మౌర్య కాలంలో కజ్జికాయలు
పురాతన సంస్కృత గ్రంథాల ప్రకారం కరణిక అని పిలిచే తీపి పదార్థం ఒకప్పుడు ఉండేది. దీనిని అప్పట్లో ఎండిన పండ్లు, తేనెతో చేసే వారిని చెప్పుకుంటారు. మౌర్య సామ్రాజ్యం కాలంలో కూడా కజ్జికాయ వంటి స్వీట్లు ఉన్నట్టు పురావస్తు ఆధారాలు చెబుతున్నాయి. ఇది భిన్నమైన చంద్రవంక ఆకారంలో ఉండేవని శిల్పాల ద్వారా తెలుస్తున్నాయి.
టర్కీ నుంచి
అయితే గుజియాకు టర్కీకి కూడా సంబంధం ఉందని చరిత్రకారుల వాదన. టర్కీలో బక్లావా అనే పిలిచే కజ్జికాయ లాంటి స్వీటు ఉండేవి. దాన్ని పిండితోనే తయారు చేసేవారు. దీనిలో తేనె, చక్కెర, వెన్న వంటివి వాడేవారు. అలాంటి ఆ స్వీట్ ప్రేరణతోనే కజ్జికాయలు మన దేశానికి వచ్చాయని చెప్పుకుంటారు. అప్పట్లో టర్కీ నుంచి ఉత్తరప్రదేశ్ కు ఎంతో మంది వ్యాపారులు ప్రయాణాలు చేసేవారు. ఆ సమయంలో తమతో పాటు బక్లావా అని పిలిచే స్వీటును కూడా తీసుకొచ్చారని ఇక్కడ ప్రజలకు నేర్పించారని చెప్పుకుంటారు. అలా గుజియా అనేది ఉత్తరప్రదేశ్లో తొలిసారిగా పరిచయమైందని అంటారు. ఇక్కడ ఈ స్థానిక అభిరుచులకు తగ్గట్టు స్థానికులు ఈ గుజియాలను తయారు చేయడం మొదలు పెట్టారని అంటారు.
మొఘల్ యుగంలో కూడా గుజియాలు ఉండేవి. కాలం మారుతున్న కొద్ది కజ్జికాయ కూడా ఎన్నో రకాలుగా తయారవడం మొదలైంది. కోవాతో, కొబ్బరి కోరుతో, డ్రైఫ్రూట్స్ తో ఇలా లోపల నచ్చిన పదార్థాన్ని పెట్టి వండడం మొదలుపెట్టారు. మొఘల్ చక్రవర్తులు, రాజపుత్రుల కూతుళ్ల మధ్య వివాహాలకు ఈ గుజియాలను ఎక్కువగా వడ్డించేవారని చెప్పుకుంటారు.
బృందావనంలో కజ్జికాయలు ఇప్పటికీ ప్రముఖ పాత్రను వహిస్తాయి. ఇక్కడ వీటిని అధికంగా తింటారు. హోలీ రోజు బృందావనంలో ఎక్కడ చూసినా కజ్జికాయలను పంచుకుంటారు.
ఉత్తరప్రదేశ్లో దీన్ని గుజియా అని పిలిస్తే, బీహార్లో పెడకియా అని పిలుస్తారు. మహారాష్ట్రలో కరంజి అని అంటారు. తమిళనాడులో సోమాలు, కర్ణాటకలో కర్జీకాయలు అని పిలుస్తారు.
హోలీ వేడుకను తీపిగా మార్చేది ఈ కజ్జికాయలే. వీటి రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు కజ్జికాయ లోపల చాక్లెట్లను పెట్టి కూడా విభిన్నంగా తయారు చేస్తున్నారు.
సంబంధిత కథనం