Gunde Ninda Gudi Gantalu Serial: బాలుకు అప్పు ఇచ్చిన మీనా -మౌనిక సీక్రెట్ బ‌య‌ట‌పెట్టిన ప్ర‌భావ‌తి -స‌త్యం తిట్ల దండ‌కం

Best Web Hosting Provider In India 2024

Gunde Ninda Gudi Gantalu Serial: బాలుకు అప్పు ఇచ్చిన మీనా -మౌనిక సీక్రెట్ బ‌య‌ట‌పెట్టిన ప్ర‌భావ‌తి -స‌త్యం తిట్ల దండ‌కం

Nelki Naresh HT Telugu
Published Mar 12, 2025 08:58 AM IST

Gunde Ninda Gudi Gantalu Serial: గుండె నిండా గుడి గంట‌లు మార్చి 12 ఎపిసోడ్‌లో మౌనిక‌కు పుట్టింట్లో ఫంక్ష‌న్ జ‌రిపించాల‌ని ప్ర‌భావ‌తి, స‌త్యం అనుకుంటారు. కానీ బాలు ఇంట్లో ఉంటే ఫంక్ష‌న్‌కు రామ‌ని సంజు అంటాడు. బాలు ఫంక్ష‌న్‌లో లేకుండా తాను చూస్తాన‌ని సంజుకు ప్ర‌భావ‌తి మాటి

గుండె నిండా గుడి గంట‌లు మార్చి 12 ఎపిసోడ్‌
గుండె నిండా గుడి గంట‌లు మార్చి 12 ఎపిసోడ్‌

Gunde Ninda Gudi Gantalu Serial: మౌనిక‌కు తాళిబొట్టు ఫంక్ష‌న్ జ‌రిపించాల‌ని ప్ర‌భావ‌తి నిర్ణ‌యిస్తుంది. ఆ ఫంక్ష‌న్ కోసం రెండున్న‌ర ల‌క్ష‌లు ఖ‌ర్చు అవుతుంద‌ని, డ‌బ్బు ఎలా స‌ర్ధుబాటు చేయాలో తెలియ‌డం లేద‌ని స‌త్యం అంటారు. ఆ ఫంక్ష‌న్ కోసం డ‌బ్బులు తాము ఇస్తామ‌ని శృతి, రోహిణి అంటారు. ఎవ‌రూ ఏం ఇవ్వాల్సిన ప‌నిలేద‌ని, ఫంక్ష‌న్ కోసం అవ‌స‌ర‌మ‌య్యే డ‌బ్బు తానే అరెంజ్ చేస్తాన‌ని బాలు అంటాడు.

స‌న్నాసుల‌ను అడ‌గొద్దు…

ఫంక్ష‌న్ కోసం నాన్న ఎవ‌రి ద‌గ్గ‌ర అప్పు చేయాల్సిన ప‌నిలేద‌ని, ఏ స‌న్నాసుల‌ను అడ‌గాల్సిన అవ‌స‌రం లేద‌ని అంటాడు బాలు. స‌న్నాసి అన‌గానే మ‌నోజ్ కోపంతో ర‌గిలిపోతాడు. స‌న్నాసి అంటే లోకంలో నువ్వు ఒక్క‌డివే ఉన్నావా అని బాలు సెటైర్లు వేస్తాడు.

ప‌రువు తీసుకున్న‌ట్లే…

బాలును న‌మ్ముకుంటే ప‌రువు తీసుకున్న‌ట్లే అవుతుంద‌ని ప్ర‌భావ‌తి అంటుంది. మౌనిక ఫంక్ష‌న్ కోసం తాము డ‌బ్బులు ఇస్తామ‌ని శృతి, రోహిణి ప‌ట్టుప‌డ‌తారు. మ‌రి ర‌వి, మ‌నోజ్ ఎందుకు డ‌బ్బులు ఇస్తామ‌ని అన‌డం లేద‌ని బాలు ప్ర‌శ్నిస్తాడు. నేను, మ‌నోజ్ వేర్వేరు కాదుగా…ఎవ‌రు ఇస్తే ఏం అని రోహిణి బ‌దులిస్తుంది. ఇంటి కోడ‌ళ్లు ఇస్తే ఆడ‌వాళ్ల క‌ష్టం నాన్న తీసుకున్న‌ట్లు ఉంటుంది. కొడుకులు ఇస్తే ఆయ‌న‌కు గౌర‌వంగా ఉంటుంద‌ని శృతి, రోహిణిల‌తో బాలు అంటాడు.స‌త్యం కూడా బాలు ద‌గ్గ‌రే డ‌బ్బు తీసుకుంటాన‌ని చెబుతాడు.

సంజు టార్చ‌ర్‌…

మౌనిక బుక్ చ‌దువుతూ ఉంటుంది. భార్య ఏం ప‌ని లేక ఖాళీగా కూర్చోవ‌డం సంజు స‌హించ‌లేక‌పోతాడు. కాఫీ కింద‌పార‌బోస్తాడు. నువ్వు ఇచ్చేప్పుడే కాఫీ కింద‌ప‌డింద‌ని, ఆ మాత్రం చూసుకోవా అంటూ ఫైర్ అవుతాడు. మౌనిక ఎదురు స‌మాధానం చెప్ప‌డంతో కోపం ప‌ట్ట‌లేక క‌ప్‌లోని కాఫీ మొత్తం పార‌బోస్తాడు. రెండు నిమిషాల్లో ఫ్లోర్ మొత్తం క్లీన్ చేయాల‌ని ఆర్డ‌ర్ వేస్తాడు.

ఫ్లోర్ క్లీన్‌…

మౌనిక ఫ్లోర్ క్లీన్ చేస్తుండ‌గా…అప్పుడే అక్క‌డికి స‌త్యం, ప్ర‌భావ‌తి వ‌స్తారు. ఫ్లోర్ తుడుస్తున్న కూతురిని చూసి షాక‌వుతారు. నువ్వేంటి ఈ ప‌నిచేస్తున్నావు. ప‌నివాళ్లు ఏం అయ్యార‌ని కూతురిని అడుగుతుంది ప్ర‌భావ‌తి. వాళ్లు స‌రిగ్గా క్లీన్ చేయ‌డం లేద‌ని, ఎలా తుడ‌వాలో తాను చూపిస్తున్నానంటూ మౌనిక అబ‌ద్ధం ఆడుతుంది. నేను ఇక్క‌డ బాగున్నాన‌ని అంటుంది.

సంజు డ్రామా…

స‌త్యం, ప్ర‌భావ‌తిల‌ను చూడ‌గానే ప్లేట్ ఫిరాయిస్తారు సంజు, నీలంక‌ఠం, వాళ్ల ముందు మంచివాళ్లుగా న‌టిస్తారు. ఈ రోజు ఉద‌య‌మే మీరు క‌ల‌లోకి వ‌చ్చార‌ని, మీ గురించి ఆలోచిస్తుంటే ఇంటికొచ్చార‌ని సంజు అంటాడు. మౌనిక ఫంక్ష‌న్ గురించి నీలకంఠానికి చెబుతుంది ప్ర‌భావ‌తి పుట్టింట్లో ఈ వేడుక చేయాల‌ని అనుకుంటున్నామ‌ని స‌త్యం అంటాడు.

బాలు ఉండ‌గా ఆ ఇంట్లో అడుగుపెట్ట‌మ‌ని నీల‌కంఠం, సంజు అంటారు. బాలు మూర్ఖుడు, ముక్కోపి అని ప్ర‌భావ‌తి కూడా కొడుకునే తిడుతుంది. స‌త్యం మాత్రం కొడుకును వెన‌కేసుకొస్తాడు.

బాలు మీరు అనుకున్నంత చెడ్డొడు కాద‌ని, మౌనిక మీద ప్రేమ‌తోనే పెళ్లిలో గొడ‌వ‌లు చేశాడ‌ని, అంద‌రూ బాగుండాల‌నే కోరుకుంటాడ‌ని స‌త్యం అంటాడు. మీరు ఎన్ని చెప్పిన బాలు ఉండ‌గా ఇంట్లో అడుగుపెట్టేది లేద‌ని సంజు అంటాడు. ఫంక్ష‌న్ జ‌రిగే రోజు బాలు మీ ఇంట్లో లేకుండా చూస్తే వ‌స్తామ‌ని కండీష‌న్ పెడ‌తాడు.

మాటిచ్చిన ప్ర‌భావ‌తి…

చెల్లెలి ఫంక్ష‌న్‌లో అన్న‌య్య ఉండ‌కూడ‌దు అంటే ఎలా అని స‌త్యం అంటాడు. మీరు ఫంక్ష‌న్ చేయాలా? బాలు ఇంట్లో ఉండాలా ఏదో ఒక‌టి మీరు నిర్ణ‌యించుకొండి అని సంజు అడుగుతాడు. దాంతో ఫంక్ష‌న్ జ‌రిగే రోజు బాలు ఇంట్లో ఉండ‌కుండా తాను చూసుకుంటాన‌ని, వాడి గురించి మ‌ర్చిపొమ్మ‌ని ప్ర‌భావ‌తి అంటుంది. ఆమె మాట‌ల‌తో నీల‌కంఠం, సంజు ఆనంద‌ప‌డ‌తారు.

బ‌య‌ట‌ప‌డ్డ సీక్రెట్‌…

మౌనిక‌తో పాటు మొన్న మీరు ఇంటికొస్తే బాగుండేద‌ని సంజుతో అంటుంది ప్ర‌భావ‌తి. త‌ల్లి మాట‌ల‌తో నిజం బ‌య‌ట‌ప‌డ‌టంతో మౌనిక‌ షాక‌వుతుంది. మౌనిక నాకు చెప్ప‌కుండా వ‌చ్చింద‌ని లోప‌ల కోపాన్ని అణుచుకుంటూ బ‌య‌ట‌కు మాత్రం న‌వ్వుతూ అంటాడు సంజు. ఆ రోజు నేను కొంచెం బిజీగా ఉన్నాన‌ని అంటాడు. మౌనిక‌కు జాగ్ర‌త్త‌లు చెబుతారు స‌త్యం, ప్ర‌భావ‌తి. మీరు జాగ్ర‌త్త‌లు చెప్పాల్సిన ప‌నిలేద‌ని, మౌనిక ముఖం ఎప్పుడు సంతోషంతో వెలిగిపోతుంద‌ని సంజు అంటాడు.

తిట్ల దండ‌కం…

మౌనిక ఇంటి నుంచి బ‌య‌ట‌కు రాగానే ప్ర‌భావ‌తిపై తిట్ల దండ‌కం మొద‌లుపెడ‌తాడు స‌త్యం. ఒకే క‌డుపున పుట్టిన బిడ్డ‌ల‌ను వేర్వేరుగా చూడాల‌ని నీకు ఎలా అనిపిస్తుంద‌ని అడుగుతాడు. వాడు నీకు న‌చ్చ‌లేద‌ని నీ చుట్టూ ఉన్న వాళ్ల ద‌గ్గ‌ర వాడిని ఎందుకు శ‌త్రువును చేస్తున్నావ‌ని నిల‌దీస్తాడు.

ఫంక్ష‌న్‌లో బాలు ఉండ‌కూడ‌ద‌ని అంటే అలా కుద‌ర‌ద‌ని చెప్పాల్సింది పోయింది…ఎందుకు ఒప్పుకున్నావ‌ని అడుగుతాడు. బాలు ఏం పాపం చేశాడ‌ని మౌనిక ఫంక్ష‌న్‌కు దూరంగా ఉండాల‌ని ప్ర‌భావ‌తిని ప్ర‌శ్నిస్తాడు స‌త్యం.

బాలు గొడ‌వ‌…

మౌనిక పెళ్లిలో బాలు చేసిన గొడ‌వను గుర్తుచేస్తుంది ప్ర‌భావ‌తి. మ‌న అదృష్టం బాగుండి మౌనిక న‌చ్చ‌డంతో బాలు ఎన్ని గొడ‌వ‌లు చేసిన కూతురిని సంజు బాగా చూసుకుంటున్నాడ‌ని ప్ర‌భావ‌తి త‌న త‌ప్పును స‌మ‌ర్ధిస్తుంది. బాలుకు ఎలా చెప్పాలో త‌న‌కు అర్థం కావ‌డం లేద‌ని స‌త్యం అంటాడు. స‌త్యాన్ని మాట‌ల‌తో ఒప్పిస్తుంది ప్ర‌భావ‌తి.

బాలు లెక్క‌లు…

మౌనిక ఫంక్ష‌న్ కోసం డ‌బ్బులు ఎలా అడ్జెస్ట్ చేయాలో బాలు లెక్క‌లు వేసుకుంటాడు. కానీ ఎన్ని సార్లు లె క్క‌లు వేసిన డ‌బ్బులు స‌రిపోవు. దాంతో త‌న‌ బంగారు న‌గ‌ల కోసం దాచిన డ‌బ్బులు బాలుకు ఇస్తుంది మీనా. ఆ డ‌బ్బు తీసుకోవ‌డానికి బాలు ఒప్పుకోడు. నీ మెడ‌లో తాళిబొట్టు లేక‌పోతే అమ్మ‌తో చేసిన ఛాలెంజ్‌లో ఓడిపోతామ‌ని బాలు అంటాడు. మావ‌య్య ప‌రువు కంటే ఇదేమి ఎక్కువ కాద‌ని తీసుకోమ‌ని బాలుకు ఇస్తుంది. ఎప్ప‌టికైనీ మీరు నాకు తాళిబొట్టు చేయిస్తార‌నే న‌మ్మ‌కం ఉంద‌ని అంటుంది.మీనా డ‌బ్బును అప్పుగానే తీసుకుంటాన‌ని కండీష‌న్ పెడ‌తాడు బాలు. అలాగేన‌ని మీనా చెబుతుంది.

పూల కొట్టు లాభాలు…

చివ‌ర‌కు త‌న‌ పూల‌కొట్టు నుంచి వ‌చ్చిన లాభాల‌ను కూడా బాలుకు ఇచ్చేస్తుంది మీనా.త‌న‌కు చెప్ప‌కుండా పుట్టింటికి వెళ్లింద‌నే నిజం బ‌య‌ట‌ప‌డ‌టంతో సంజు స‌హించ‌లేక‌పోతుంది. మొగుడిని క‌ళ్లు క‌ప్పి అన్న క‌ళ్ల‌ల్లో ఆనందం చూడ‌టానికి వెళ్లావా అని అడుగుతాడు. అత్తాకోడ‌ళ్లు క‌లిసి మ‌మ్మ‌ల్ని వెధ‌వ‌ల‌ను చేశారు క‌దా అని అంటాడు.

ప్ర‌భావ‌తి డ‌ల్‌…

సంజు ఇంటి నుంచి వ‌చ్చిన స‌త్యం, ప్ర‌భావ‌తి డ‌ల్‌గా ఉండ‌టం చూసి బాలు కంగారు ప‌డ‌తాడు. సంజు ఏమైనా అన్నాడా? మౌనిక బాగుందా అంటూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తాడు. ఫంక్ష‌న్‌లో బాలు ఉండ‌కూడ‌ద‌నే మాట ఎలా చెప్పాలో తెలియ‌క స‌త్యం ఇబ్బంది ప‌డ‌తాడు. అక్క‌డితో నేటి గుండె నిండా గుడి గంట‌లు సీరియ‌ల్ ముగిసింది.

Nelki Naresh

TwittereMail
నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024