Telugu OTT: ఓటీటీలోకి సందీప్‌కిషన్‌ లేటెస్ట్ రొమాంటిక్ ల‌వ్ డ్రామా మూవీ – స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?

Best Web Hosting Provider In India 2024

Telugu OTT: ఓటీటీలోకి సందీప్‌కిషన్‌ లేటెస్ట్ రొమాంటిక్ ల‌వ్ డ్రామా మూవీ – స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?

Nelki Naresh HT Telugu
Published Mar 12, 2025 10:29 AM IST

Telugu OTT: సందీప్‌కిష‌న్ మ‌జాకా మూవీ థియేట‌ర్ల‌లో మిక్స్‌డ్ టాక్‌తో డిస‌పాయింట్ చేసింది. ఈ రొమాంటిక్ ల‌వ్ డ్రామా మూవీ 14 రోజుల్లో ఆరున్న‌ర కోట్ల వ‌ర‌కు క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన‌ట్లు స‌మాచారం. కాగా మ‌జాకా మూవీ మార్చి నెలాఖ‌రు నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

తెలుగు ఓటీటీ
తెలుగు ఓటీటీ

మ‌జాకా మూవీ సందీప్‌కిష‌న్‌కు హిట్టు ఇవ్వ‌లేక‌పోతుంది. థియ‌ట‌ర్ల‌లో మిక్స్‌డ్ టాక్‌తో డిస‌పాయింట్ చేసింది. త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీ ఫిబ్ర‌వ‌రి 26న ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ప‌ధ్నాలుగు రోజుల్లో ఈ మూవీ 13 కోట్ల వ‌ర‌కు గ్రాస్‌, ఆరున్న‌ర కోట్ల షేర్ క‌లెక్ష‌న్స్‌ను రాబ‌ట్టిన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతోన్నాయి. దాదాపు 11 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో మ‌జాకా రిలీజైంది. ఈ సినిమా లాభాల్లోకి అడుగుపెట్టాలంటే ఇంకా ఐదు కోట్ల‌కుపైనే క‌లెక్ష‌న్స్ రావాల్సివుంది. ఇప్ప‌టికే క‌లెక్ష‌న్స్ భారీగా డ్రాప‌వుట్ అయిన నేప‌థ్యంలో మ‌జాకా బ్రేక్ ఈవెన్ కావ‌డం అనుమాన‌మేన‌ని చెబుతోన్నారు.

ఓటీటీలోకి ఎప్పుడంటే?

కాగా మ‌జాకా మూవీ మార్చి నెలాఖ‌రున ఓటీటీలోకి వ‌స్తున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ సినిమా డిజిట‌ల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను జీ5 ఓటీటీ సొంతం చేసుకున్న‌ది. మార్చి 27న మ‌జాకా ఓటీటీలో రిలీజ్ కానున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

రీతూ వ‌ర్మ‌…

మ‌జాకా మూవీలో రీతూవ‌ర్మ హీరోయిన్‌గా న‌టించింది. రావుర‌మేష్, అన్షు (మ‌న్మ‌థుడు ఫేమ్‌) కీల‌క పాత్ర‌లు పోషించారు. మ‌జాకాతోనే లాంగ్ గ్యాప్ త‌ర్వాత టాలీవుడ్‌లోకి అన్షు రీఎంట్రీ ఇచ్చింది. టీజ‌ర్‌, ట్రైల‌ర్స్‌లో పంచ్ డైలాగ్స్ పేల‌డం, వెరైటీ ప్ర‌మోష‌న్స్‌తో మ‌జాకా మూవీ తెలుగు ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిని రేకెత్తించింది. కానీ క‌థ‌తో కాకుండా కామెడీతోనే గ‌ట్టెక్కాల‌నే ద‌ర్శ‌క‌ర‌చ‌యిత‌ల ప్ర‌య‌త్నం బెడిసికొట్టింది. కాన్సెప్ట్‌లో కొత్త‌ద‌నం లేక‌పోవ‌డం సినిమాకు మైన‌స్‌గా మారింది. త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీకి ప్ర‌స‌న్న‌కుమార్ బెజ‌వాడ క‌థ‌ను అందించారు. లియోన్ జేమ్స్ మ్యూజిక్ స‌మ‌కూర్చారు.

మ‌జాకా క‌థ ఇదే…

వెంక‌ట‌ర‌మ‌ణ (రావుర‌మేష్‌) భార్య చ‌నిపోతుంది. కొడుకు కృష్ణ‌(సందీప్‌కిష‌న్‌) కోసం రెండో పెళ్లి చేసుకోడు. కృష్ణ‌కు పెళ్లి జ‌రిపించి ఫ్యామిలీ ఫొటోను ఇంట్లో పెట్టుకోవాల‌న్న‌ది వెంక‌ట ర‌మ‌ణ క‌ల‌. కానీ కృష్ణ‌కు ఒక్క పెళ్లి సంబంధం సెట్ కాదు. ఆడ‌దిక్కు లేకుండా ఇద్ద‌రు మ‌గాళ్లు ఉన్న ఇంట్లోకి అమ్మాయిని పంపించేలేమంటూ కృష్ణ‌ను రిజెక్ట్ చేస్తుంటారు.

మీరా (రీతూ వ‌ర్మ‌) తో తొలిచూపులోనే ప్రేమ‌లో ప‌డ‌తాడు కృష్ణ‌. మ‌రోవైపు మిడిల్ ఏజ్‌లో వెంక‌ట‌ర‌మ‌ణ య‌శోద (అన్షు) అనే మ‌హిళ‌ను ఇష్ట‌ప‌డ‌తాడు. అనుకోకుండా వీసా వ‌ర్క్ కోసం త‌న ఆఫీస్‌కే వ‌చ్చిన య‌శోద‌తో ప‌రిచ‌యం పెంచుకుంటాడు.

తండ్రి ప్రేమ క‌థ తెలిసి కృష్ణ ఏం చేశాడు? మీరాకు కృష్ణ‌…య‌శోద‌కు ర‌మ‌ణ త‌మ ప్రేమ‌ను వ్య‌క్తం చేసేందుకు ఎలాంటి పాట్లు ప‌డ్డారు? మీరా,య‌శోద‌ ఒకే ఇంట్లో ఎందుకు ఉన్నారు? వాళ్ల మ‌ధ్య ఉన్న సంబంధం ఏమిటి? అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

పాన్ ఇండియ‌న్ మూవీ…

మ‌జాకా త‌ర్వాత ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌న‌యుడు జేస‌న్ విజ‌య్ ద‌ర్శక‌త్వంలో ఓ పాన్ ఇండియ‌న్ మూవీ చేస్తోన్నాడు సందీప్‌కిష‌న్‌. లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ ఈ మూవీని నిర్మిస్తోంది.

Nelki Naresh

TwittereMail
నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024