No Smoking Day 2025: సిగరెట్ మానలేకపోతున్నారా? ఇలా చేస్తే ధూమపానం చేయాలన్న ఆసక్తి పూర్తిగా పోతుంది

Best Web Hosting Provider In India 2024

No Smoking Day 2025: సిగరెట్ మానలేకపోతున్నారా? ఇలా చేస్తే ధూమపానం చేయాలన్న ఆసక్తి పూర్తిగా పోతుంది

Haritha Chappa HT Telugu
Published Mar 12, 2025 11:10 AM IST

No Smoking Day 2025: సిగరెట్లు ఆరోగ్యానికి ఎంతో హాని కలిగిస్తాయి. కొంతమంది ఆ అలవాటును వదిలేయానలనుకుంటారు కానీ అలా చేయలేరు. ధూమపానం వ్యసనాన్ని వదిలించుకోవడం కష్టమే అయినా అసాధ్యం మాత్రం కాదు. ఇక్కడ మేము కొన్ని చిట్కాలు ఇచ్చాము.

ధూమపానం మానేసేందుకు చిట్కాలు
ధూమపానం మానేసేందుకు చిట్కాలు

స్మోకింగ్‌కు బానిసలుగా మారుతున్నవారి సంఖ్య ప్రతి ఏటా పెరిగిపోతోంది. ధూమపానం వల్ల శారీరకంగా, మానసికంగా ఎన్నో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఈ అలవాటు ఊపిరితిత్తుల క్యాన్సర్ కు దారితీస్తుంది. దాని వల్ల కలిగే అనర్థాలు తెలిసినా కొందరు దాన్ని మానలేకపోతున్నారు. సిగరెట్లు మానేయడం లేదా తగ్గించడం అనేది కష్టమైన పనే కానీ అసాధ్యం మాత్రం కాదు.

ప్రతి సంవత్సరం మార్చి రెండవ బుధవారం నో స్మోకింగ్ డే నిర్వహించుకుంటాం. ధూమపానం మానేయాలనుకునేవారికి సహాయపడటానికి ఈ రోజును ఆరోగ్య అవగాహన దినోత్సవంగా చేస్తారు. ధూమపానం మానేయడానికి మీకు సహాయపడే కొన్ని మార్గాలు ఇక్కడ ఉన్నాయి.

మీరు ధూమపానం మానేయాలనుకుంటే, ఎందుకో మానేయాలనుకుంటున్నారో ముందుగా మనసులో గట్టిగా అనుకోండి. బలమైన కారణం ఉన్నప్పుడు, మిమ్మల్ని మీరు అదుపులో ఉంచుకునే అవకాశం ఉంటుంది.

కుటుంబంతో
ధూమపానం మానేయాలనుకుంటే ఒంటరిగా నివసించకండి. మీ కుటుంబం, స్నేహితులతో ఎక్కువసేపు మాట్లాడుతూ ఉండండి. వారి సహాయాన్ని అడగండి. మీ కుటుంబం కూడా మీరు సిగరెట్లు వదిలేయడంలో ఎంతో సహాయపడతారు.

శారీరక శ్రమ వల్ల
శారీరక శ్రమ ఎక్కువగా చేస్తే ధూమపానం చేయాలనే కోరిక చాలా వరకు తగ్గిపోతుంది. వ్యాయామం, ఆటలు, యోగా, చురుకైన నడక, లోతైన శ్వాస వ్యాయామాలు, డ్యాన్సు వంటి పనులు ధూమపానం పట్ల కోరికను చాలా వరకు తగ్గిస్తాయి.

హైడ్రేషన్ గా ఉండాలి
తగినంత మొత్తంలో నీరు శరీరంలో ఉంటే ధూమపానం మీద ఆసక్తి తగ్గిపోతుంది. నీరు శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. తగినంత నీరు త్రాగటం మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. మీకు పొట్ట నిండిన అనుభూతిని కలిగిస్తుంది. కాబట్టి మీకు ధూమపానం చేయాలన్న కోరిక కూడా తగ్గిపోతుంది.

మీరు ధూమపానం మానేయాలనుకుంటే, క్వినోవా, బ్రౌన్ రైస్, వోట్స్ వంటి తృణధాన్యాలను ఆహారంలో అధికంగా తినండి. వీటిని తినడం వల్ల శక్తి పెరుగుతుంది. ఇది గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ధూమపానం మానేయడానికి ఇది సహాయపడుతుంది.

నట్స్
అల్పాహారం కోసం బాదం, పొద్దుతిరుగుడు విత్తనాలు, గుమ్మడికాయ విత్తనాలు వంటివి అధికంగా తినండి. వీటిలో విటమిన్ ఇ ఉంటుంది. ధూమపానం వల్ల ప్రభావితమైన చర్మ ఆరోగ్యాన్ని కూడా ఇవి మెరుగుపరుస్తుంది.

సిగరెట్ తాగే కోరికను తగ్గించడానికి , మీరు చక్కెర లేని స్వీట్లు, సోంపు లేదా ముడి క్యారెట్లు, డ్రై ఫ్రూట్స్, పొద్దుతిరుగుడు విత్తనాలను తింటే మంచిది.

(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)

Haritha Chappa

TwittereMail
హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.
Whats_app_banner

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024