




Best Web Hosting Provider In India 2024

Samantha: అనుపమ పరమేశ్వరన్ సినిమాలో సమంత క్యామియో రోల్! వివరాలివే
Samantha Ruth Prabhu: అనుపమ పరమేశ్వర్ నుంచి రానున్న తదుపరి మూవీలో సమంత కనిపించనున్నారనే సమాచారం బయటికి వచ్చింది. క్యామియో రోల్ చేయనున్నారట. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

స్టార్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. గతేడాది టిల్లు స్క్వేర్ చిత్రంతో బ్లాక్‌బస్టర్ కొట్టిన ఈ భామ.. ఇటీవలే తమిళ మూవీ డ్రాగన్‌తో భారీ సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం తెలుగులో ‘పరదా’ మూవీ చేస్తున్నారు అనుపమ. ఈ చిత్రానికి సినిమాబండి ఫేమ్ డైరెక్టర్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహిస్తున్నారు. రస్టిక్ మిస్టరీ అడ్వెంచర్ మూవీగా ఈ చిత్రం రానుంది. ఇప్పటికే వచ్చిన టీజర్ ఆసక్తిని పెంచింది. పరదాగా గురించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ విషయంలో బయటికి వచ్చింది.
క్యామియో రోల్లో సమంత!
పరదా చిత్రంలో స్టార్ హీరోయిన్ సమంత క్యామియో రోల్లో కనిపించనున్నారని తాజాగా సమాచారం బయటికి వచ్చింది. క్లైమాక్స్‌లో సమంత రోల్ సర్ప్రైజింగ్గా ఉంటుందనే టాక్ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. సినిమా ముగింపులో కీలకమైన సమయంలో ఆ పాత్ర ఎంట్రీ ఉంటుందని తెలుస్తోంది. అయితే, సమంత క్యామియో రోల్‌పై మూవీ టీమ్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.
అనుపమ పరమేశ్వరన్ మూవీలో సమంత క్యామియో విషయయం అభిమానులు బాగా ఎగ్జైట్ చేస్తోంది. ఈ రస్టిక్ చిత్రంలో సామ్ క్యారెక్టర్ ఎలా ఉంటుందోననే క్యూరియాసిటీ పెరిగింది. గతంలో స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘అఆ’ చిత్రంలో సమంత, అనుపమ కలిసి నటించారు. పరదాలోనూ ఇద్దరూ కలిసి కనిపించనున్నారని టాక్ నడుస్తోంది.
పరదా చిత్రంలో అనుపమ పరమేశ్వరన్తో పాటు దర్శన్ రాజేంద్రన్, సంగీత ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని రస్టిక్ మిస్టరీ మూవీగా డైరెక్టర్ ప్రవీణ్ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. ఆనంద మీడియా పతాకంపై విజయ్ డొంకాడ, శ్రీనివాసులు, శ్రీధర్ మక్కవ ఈ మూవీని ప్రొడ్యూజ్ చేస్తున్నారు. తెలుగు, మలయాళంలో ఈ చిత్రం విడుదల కానుంది. రిలీడ్ డేట్ ఖరారు కావాల్సి ఉంది.
ఇంట్రెస్టింగ్గా టీజర్
పరదా చిత్రం నుంచి ఈ ఏడాది జనవరిలో టీజర్ వచ్చింది. ఈ మూవీపై అంచనాలను ఇది భారీగా పెంచేసింది. సుబ్బు పాత్రను ఈ చిత్రంలో చేశారు అనుపమ. ఆ గ్రామంలో కట్టుబాట్లు, మూఢనమ్మకాలను ఈ టీజర్లో మేకర్స్ చూపించారు. ముఖం కనిపించకుండా పరదా వేసుకొని ఉంటుంది సుబ్బు (అనుపమ). మరో ఇద్దరు మహిళలతో కలిసే ఆమె చేసే జర్నీ చుట్టే ఈ మూవీ సాగుతుంది. పరదా టీజర్ రస్టింగ్గా, థ్రిల్లింగ్ ఎలిమెంట్లతో, ఇంటెన్సిటీతో మెప్పించింది. ఈ చిత్రంపై క్యూరిసాయాసిటీ పెరిగేలా చేసింది. ప్రవీణ్ టేకింగ్, అనుపమ ఇంటెన్స్ లుక్ స్టాండౌట్‌గా నిలిచాయి.
సంబంధిత కథనం
టాపిక్