






Best Web Hosting Provider In India 2024

NNS 12th March Episode: మళ్లీ ఎఫ్ఎంలో చేరిన భాగీ.. ఆమెను చెల్లి అని పిలిచిన అనామిక.. అమర్, పిల్లలు షాక్
NNS 12th March Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ బుధవారం (మార్చి 12) ఎపిసోడ్లో భాగీ మళ్లీ ఎఫ్ఎంలో చేరుతుంది. ఆమె వాయిస్ రేడియోలో విని అనామికలోని అరుంధతికి గతం గుర్తుకు వస్తుంది. ఆమెకు ఫోన్ చేసి చెల్లి అని పిలుస్తుంది.

NNS 12th March Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం ఈరోజు (మార్చి 12) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఆర్జే రేణుకను కలవడానికి ఎఫ్ఎం రేడియోకి వెళ్లిన భాగీని.. ఆమె మాజీ మేనేజర్ మరోసారి అవమానిస్తాడు. అమర్ గురించి దారుణంగా మాట్లాడుతూ.. తన దగ్గరికి రావాలని అనడంతో భాగీ అతని చెంప పగలగొడుతుంది.
మనోహరిని నిలదీసిన మంగళ
కాళీని చంపడానికి హాస్పిటల్ కు వెళ్తుంది మనోహరి. అక్కడ పోలీసులు ఉండటంతో ఆమె భయపడుతుంది. అప్పుడే మంగళ లోపల నుంచి రావడం చూస్తుంది. ఆమెను చూసిన మరింత కంగారుపడుతున్న మనోహరిని మంగళ కూడా చూస్తుంది. వెంటనే ఆమె దగ్గరికి వెళ్లి నిలదీస్తుంది. కాళీని పొడిచింది నువ్వే కదా అని అడుతుంది.
తాను రణ్‌వీర్ ను చంపడానికి అలా చేసినా.. పొరపాటున కాళీ అడ్డొచ్చాడని చెబుతుంది. అయినా మంగళ మాత్రం ఆమెను నమ్మదు. కాళీకి స్పృహ వచ్చిన తర్వాత ఫోన్ చేయించాలని తానే అతనికి జరిగింది చెబుతానని అంటుంది. అలా చేయాలన్నా డబ్బు కావాలని ఆమె డిమాండ్ చేస్తుంది. చేసేది లేక మనోహరి సరే అంటుంది.
భాగీకి అమర్ గోరుముద్దలు
ఎఫ్ఎం రేడియోలో తన మాజీ మేనేజర్ అవమానించడంతో భాగీ బాధపడుతూ కూర్చొంటుంది. అప్పుడే అమర్ ఇంటికి వస్తాడు. భోజనం వడ్డించాలా అని నిర్మల అడిగితే.. భాగీ ఎక్కడ అని అడుగుతాడు. ఎఫ్ఎంకు వెళ్లి వచ్చినప్పటి నుంచీ ఏడుస్తూ కూర్చొందని, ఏం జరిగిందో చెప్పడం లేదని నిర్మల చెబుతుంది. దీంతో అమర్ ఆమె దగ్గరకు వెళ్లి ఏం జరిగిందని అడుగుతాడు.
ఆమె జరిగింది చెప్పలేక.. తన మాజీ కొలీగ్స్ ను చూసి కాస్త ఎమోషనల్ అయ్యానని అంటుంది. ఆమె జరిగింది చెప్పడం లేదని గుర్తించిన అమర్.. నీకు ఏం కావాలన్నా ఈ కుటుంబం అండగా ఉంటుందని గుర్తుంచుకో అని ఆమెకు చెబుతాడు. భోజనం చేయమని అనడంతో భాగీ తనకు ఆకలిగా లేదని అంటుంది.
దీంతో అమర్ ఆమె కోసం స్వయంగా భోజనం తీసుకెళ్తాడు. నువ్వు తింటేగానీ నేను తినను అంటూ భాగీకి గోరు ముద్దలు తినిపిస్తాడు. దీంతో ఆమె ఎమోషనల్ అవుతుంది. అటు ఈ విషయం తెలిసిన మనోహరి.. ఎలాగైనా అనామిక ద్వారా అమర్, భాగీ మధ్య దూరం పెంచాలని అనుకుంటుంది.
భాగీని చెల్లి అని పిలిచిన అనామిక
భాగీ బాధను అర్థం చేసుకున్న అమర్ ఆమెను స్వయంగా ఎఫ్ఎంకు తీసుకెళ్తాడు. అక్కడ ఆమె షోను ప్రత్యక్ష్యంగా చూడటానికి అమర్ అక్కడే ఉంటాడు. ఎఫ్ఎంలో భాగీ వాయిస్ వినగానే ఇటు ఇంట్లో ఉన్న అనామికలోని అరుంధతికి గతం గుర్తుకు వస్తుంది. రేడియోలో గతంలో ఆమెను చెల్లి అని పిలవడం కూడా ఆమె గుర్తుకు తెచ్చుకుంటుంది.
దీంతో వెంటనే భాగీకి కాల్ చేస్తుంది. అటు తనకు మొదటి కాల్ వచ్చిందంటూ భాగీ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఎవరు మాట్లాడుతున్నారని అనగానే.. అనామిక ఆమెను చెల్లి అని పిలుస్తుంది. దీంతో ఆ పక్కనే ఉన్న అమర్, ఇంట్లో రేడియో వింటున్న పిల్లలు అందరూ షాకవుతారు. ఆ తర్వాత ఏం జరగబోతోంది? అనామికలో అరుంధతి ఉన్న విషయం అమర్ కు తెలుస్తుందా అనే విషయాలు తెలియాలంటే బుధవారం (మార్చి 12) ప్రసారమయ్యే నిండు నూరేళ్ల సావాసం ఎపిసోడ్లో చూడండి.
సంబంధిత కథనం