




Best Web Hosting Provider In India 2024

Khoa without milk: పాలు లేకుండా అప్పటికప్పుడు కోవాను ఇలా తయారుచేసేయండి
మార్కెట్లో కల్తీ కోవాకు బదులుగా ఇంట్లో తయారుచేసిన ఖోయాను వాడితేనే మంచిది. పాలు లేకుండా కూడా ఇంట్లోనే ఇన్ స్టెంట్ గా కోవాను తయారు చేయవచ్చు. కోవా రెసిపీ ఇక్కడ ఇచ్చాము.

స్వీట్లు తయారుచేయడానికి కోవా అవసరం. ముఖ్యంగా కజ్జి కాయలు, కోవా బిళ్లలు వంటివి తయారుచేసేందుకు ఈ కోవా కావాల్సిందే. ఉత్తరప్రదేశ్‌లో హోలీ రోజు గుజియా కచ్చితంగా తయారుచేస్తారు. అందులోకి కోవా ఉండాలి. మార్కెట్లో దొరికే కోవా కల్తీది కావచ్చు. అలాగే పాలతోనే కోవాను తయారుచేయాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే ఇన్ స్టెంట్‌గా పాలు లేకుండా కోవాను చేయవచ్చు. ఇక్కడ మేము రెసిపీ ఇచ్చాము. పాలు లేకుండా ఖోవా తయారు చేయడానికి చిన్న చిట్కాలు ఉన్నాయి దీని సహాయంతో టేస్టీ ప్యూర్ ఖోవా కొన్ని నిమిషాల్లో రెడీ అవుతుంది.
పాలు లేకుండా కోవా ముద్ద
పాలతో కోవా తయారు చేయడానికి చాలా సమయం పడుతుంది. అంత సమయం లేనప్పుడు పాలపొడి సాయంతో కూడా కోవాను అప్పటికప్పుడు తయారు చేసేయచ్చు. కోవా తయారీకి మూడు వస్తువులు అవసరం అవుతాయి. ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి వేయాలి. ఆ నెయ్యి మార్కెట్లో దొరికే ఫ్రెష్ క్రీమ్ ఒక కప్పు వేయాలి. దీన్ని చిన్న మంట మీదే వండాలి. అందులో పాల పొడిని వేసి గరిటెతో కలుపుతూ ఉండాలి. ఇది దగ్గరగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఖోవా చల్లారిన వెంటనే గడ్డకడుతుంది. అంటే టేస్టీ కోవా రెడీ అయినట్టే. దీంతో మీరు నచ్చిన ఆహారాలను తయారు చేసుకోవచ్చు.
కప్పు పాలతో
నెయ్యి వేడెక్కాక ఒక కప్పు పాలు అందులో వేయాలి. పాలు మరిగిన తరువాత కప్పు పాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. పాలపొడి గడ్డలు ఏర్పడకుండా కలుపుతూనే ఉండాలి. మంట చిన్నగా పెట్టాలి. ఇది చిక్కగా అయ్యేవరకు అలా కలుపుతూనే ఉండాలి. ఈ మొత్తం దగ్గరగా అయ్యేవరకు అలా ఉడికిస్తూనే ఉండాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసేయాలి.
ఇన్ స్టంట్ కోవాలో ఈ విషయాలు గుర్తుంచుకోండి
– పాలపొడితో ఖోవా తయారు చేస్తున్నప్పుడల్లా, గ్యాస్ మంటను తగ్గించడం మర్చిపోవద్దు. లేకపోతే పాలపొడి సరిగా ఉడకదు. దీని వల్ల కోవా కూడా రుచి బాగుండదు.
– కోవా దగ్గర అయ్యాక వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి. కోవా దగ్గరగా గట్టిగా అయ్యాక వెంటనే ఆపకపోతే చల్లారిన తర్వాత అది ఎండిపోయినట్టు అవుతుంది.
– గ్యాస్ ఎక్కువ కాలం పాటూ ఉడికించడం వల్ల క్రీమీ ఆకృతి, రుచి కోవాకు వస్తుంది.
పాలకు బదులు క్రీమ్ లేదా ఫ్రెష్ క్రీమ్ కూడా ఉపయోగించవచ్చు. ఇది తక్షణ ఖోవాను కూడా చేస్తుంది.
సంబంధిత కథనం