




Best Web Hosting Provider In India 2024

Chittoor Robbery Attempt: అప్పులు తీర్చడానికి స్నేహితుడి ఇంట్లో దోపిడీ యత్నం, చిత్తూరులో కలకలం, ఏడుగురి అరెస్ట్
Chittoor Robbery Attempt: వ్యాపారంలో నష్టాలను తీర్చుకోడానికి స్నేహితుడి ఇంట్లోనే దోపిడీకి ప్లాన్ చేసి దొరికిపోయిన ఘటన చిత్తూరులో జరిగింది. డమ్మీ తుపాకులతో బెదిరించినా భయపడకుండా ఇంట్లో నుంచి బయటపడి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కొన్ని గంటల పాటు ఉత్కంఠ రేగింది.

Chittoor Robbery Attempt: చిత్తూరులో కాల్పుల కలకలం రేపాయి. ఓ ప్రముఖ వ్యాపారి ఇంట్లో మరో ప్రముఖ వ్యాపారి దోపిడీకి పన్నాగం పన్నినట్లు పోలీసులు గుర్తించారు.
చిత్తూరులోని గాంధీరోడ్డులో బుధవారం ఉదయం కాల్పులు కలకలం సృష్టించాయి. లక్ష్మీ సినిమా హాల్ సమీపంలో ఉన్న పుష్ప కిడ్స్ వరల్డ్ యజమాని చంద్రశేఖర్ ఇంట్లోకి ఆరుగురు దొంగల ముఠా చొరబడింది. రెండు తుపాకులతో వారు గాల్లోకి కాల్పులు జరిపారు.
దోపిడీ ముఠాలో ఒకరు తెలిసిన వ్యక్తి ఉండటంతో ఇంటి యజమాని అప్రమత్తమై వారిని నెట్టుకుంటూ బయటకు పారిపోయాడు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈక్రమంలో దొంగల ముఠా ఇంట్లోనే చిక్కుకుపోయింది. నిందితుల వద్ద తుపాకులు ఉన్నాయనే సమాచారంతో పోలీసులు ఆందోళనకు గురయ్యారు. డ్రోన్ల సాయంతో వారిని గుర్తించారు
దోపిడీకి వచ్చి ఇంట్లో చిక్కుబడిన దొంగల్ని స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు. కర్నూలుకు చెందిన దొంగల ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి డమ్మీ తుపాకులు, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో యజమాని చంద్రశేఖర్‌కు గాయాలయ్యాయి.
ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. చంద్రశేఖర్ ఇంట్లో దోపిడీకి ఎస్‌ఎల్‌వీ ఫర్నీచర్ యజమాని సుబ్రహ్మణ్యం ముఠాను ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. కర్ణాటక, కర్నూలుకు చెందిన దుండగులు ఈ ముఠాలో సభ్యులుగా ఉన్నారు. రబ్బర్ బుల్లెట్లు వినియోగించే తుపాకులతో ఇంట్లో దోపిడీకి యత్నించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. రెండున్నర గంటల పాటు శ్రమించి వారిని అదుపులోకి తీసుకున్నారు.
చిత్తూరు పట్టణంలోని గాంధీ రోడ్డులో పుష్ప కిడ్స్ వరల్డ్ పేరుతో చంద్రశేఖర్ వస్త్ర వ్యాపారం చేస్తున్నాడు. భవనం కింద భాగంలో ఐడిబిఐ బ్యాంకు శాఖ ఉంది. తెల్ల వారు జామున అంతా నిద్రలో ఉండగా తెల్లవారుజామున ఏడుగురు దుండగులు తుపాకులతో చొరబడ్డారు. అంతా నిద్రలో ఉండగానే వాళ్లు లోపలికి వెళ్లి ఇంటి యజమానిపై రాడ్‌తో దాడి చేశారు. అయితే యజమాని అప్రమత్తంగా వ్యవహరించి అక్కడినుంచి తప్పించుకున్నాడు.
బయటకు వచ్చి కేకలు వేయడంతో న్న స్థానికులు వెంటనే స్పందించారు. అందరూ ఒక్కసారిగా ఆ ఇంటి చుట్టూ గుమికూడి, నలుుగురు దుండగులను పట్టుకున్నారు. మిగతా ఇద్దరు లోపలే ఉండిపోవడంతో, స్థానికులు తాళం వేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వ్యూహాత్మకంగా రంగంలోకి దిగారు. పట్టుబడిన దుండగుల వద్ద ఉన్న తుపాకులను పరిశీలించిన తర్వాత కేవలం డమ్మీ తుపాకులేనని గుర్తించారు.
చంద్రశేఖర్, సుబ్రహ్మణ్యం స్నేహితులేనని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో సుబ్రహ్మణ్యం అప్పుల పాలవడంతో దోపిడీకి పథక రచన చేసినట్టు గుర్తించారు.
సంబంధిత కథనం
టాపిక్