




Best Web Hosting Provider In India 2024

Sreeleela Dating: ఆ బాలీవుడ్ హీరోతో శ్రీలీల డేటింగ్.. కన్ఫమ్ చేసిన అతని తల్లి!
Sreeleela Dating: శ్రీలీల డేటింగ్ వార్తలు కొన్నాళ్లుగా వస్తున్న విషయం తెలుసు కదా. ఇప్పుడామె డేటింగ్ చేస్తున్న హీరో తల్లే వాటిని దాదాపుగా కన్ఫమ్ చేసినట్లు కనిపిస్తోంది. ఇంతకీ ఆమె ఏం చెప్పిందంటే..

Sreeleela Dating: టాలీవుడ్ బ్యూటీ శ్రీలీల బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ తో డేటింగ్ చేస్తోందని కొన్నాళ్లుగా వస్తున్న వార్తలు ఎంతో ఆసక్తి రేపుతున్నాయి. ఈ ఇద్దరూ కలిసి ఆశిఖీ 3 మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చినప్పటి నుంచీ డేటింగ్ పుకార్లు మొదలయ్యాయి. అయితే వాటిని పరోక్షంగా కార్తీక్ ఆర్యన్ తల్లి కన్ఫమ్ చేసినట్లు అనిపిస్తోంది.
కార్తీక్ ఆర్యన్ తల్లి కన్ఫమ్ చేసినట్లేనా?
శ్రీలీల తన తొలి బాలీవుడ్ మూవీ చేస్తోంది. కార్తీక్ ఆర్యన్ తో కలిసి ఆశిఖీ 3లో నటిస్తోంది. అయితే అప్పుడే అతనితో డేటింగ్ అనే వార్తలు తెరపైకి వచ్చాయి. ఈ మధ్యే కార్తీక్ ఇంట్లో జరిగిన వేడుకకు ఆమె వెళ్లడం కూడా వీటికి మరింత బలాన్నిచ్చాయి. ఇక తాజాగా కార్తీక్ ఆర్యన్ తల్లి మాలా కూడా పరోక్షంగా వీళ్ల డేటింగ్ వార్తలను కన్ఫమ్ చేసేలా మాట్లాడింది. ఈ మధ్య జరిగిన ఐఫా 2025లో ఆమె కరణ్ జోహార్ తో మాట్లాడింది.
తనకు ఎలాంటి కోడలు కావాలని ఈ సందర్భంగా కరణ్ ఆమెను అడిగాడు. దీనిపై ఆమె స్పందిస్తూ.. “ఇంట్లో వాళ్ల డిమాండ్ అయితే ఓ డాక్టర్ కావాలని” అని అనడం విశేషం. మీరు ఇప్పటికే ఓ డాక్టర్ తో కలిసి పని చేస్తున్నట్లున్నారు అని పక్కనే ఉన్న కార్తీక్ తో కరణ్ అనడంతో అతడు మాట మార్చే ప్రయత్నం చేశాడు. ఆమె ఓ నిజమైన డాక్టర్ గురించే మాట్లాడుతోంది అని కార్తీక్ అన్నాడు.
యాక్టర్‌గా మారిన డాక్టర్
నిజానికి శ్రీలీల కూడా ఓ డాక్టరే అన్న విషయం తెలుసు కదా. నటనలోకి వచ్చే ముందు ఆమె ఎంబీబీఎస్ చేసింది. సినిమాల్లో నటించడం మొదలు పెట్టిన తర్వాత తన ఫైనల్ ఎగ్జామ్స్ కూడా రాసింది. ఇప్పుడు కార్తీక్ ఆర్యన్ తో ఆమె డేటింగ్ పుకార్లు.. ఇదే సమయంలో ఓ డాక్టర్ కావాలని అతని తల్లి చేసిన కామెంట్స్ చూస్తుంటే.. వీళ్లిద్దరి రిలేషన్షిప్ నిజమే అనిపిస్తోంది.
అయితే బాలీవుడ్ లో క్రమంలో స్టార్ హీరోగా ఎదుగుతున్న కార్తీక్ ఆర్యన్ పై గతంలోనూ ఇలాంటి పుకార్లు చాలానే వచ్చాయి. అతడు కలిసి నటించిన సారా అలీ ఖాన్, అనన్య పాండే, కృతి సనన్ లాంటి వాళ్లతో కార్తీక్ కు లింకు పెట్టారు. కానీ వీటిపై అతడు ఎప్పుడూ నోరు మెదపలేదు. ఇప్పుడు శ్రీలీలతో డేటింగ్ పైనా కార్తీక్ స్పందించడం లేదు.
ఇక శ్రీలీల విషయానికి వస్తే.. టాలీవుడ్ లో ఇప్పటికే తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఆమెపై ఎప్పుడూ ఇలాంటి డేటింగ్ పుకార్లు రాలేదు. బాలీవుడ్ లో అడుగుపెట్టగానే, అది కూడా అక్కడ తన తొలి కోస్టార్ తోనే డేటింగ్ రూమర్లు రావడం విశేషం. మరి దీనిపై ఆమె ఎలా స్పందిస్తుందో చూడాలి.
సంబంధిత కథనం