




Best Web Hosting Provider In India 2024

OTT Movie: ఓటీటీలోకి మహేశ్ బాబు డబ్బింగ్ చెప్పిన హాలీవుడ్ మూవీ.. రెంట్ లేకుండా స్ట్రీమింగ్.. ఎప్పుడంటే!
Mufasa: The Lion King OTT Release date: ముఫాసా: ది లయన్ కింగ్ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. రెంట్ లేకుండా స్ట్రీమింగ్‍కు వచ్చేనుంది. స్ట్రీమింగ్ డేట్ అధికారికంగా ఖరారైంది.

సింహాలే ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన ‘ముఫాసా: ది లయన్ కింగ్’ సినిమా భారీ బ్లాక్‍బస్టర్ అయింది. గతేడాది డిసెంబర్ 20వ తేదీన థియేటర్లలో రిలీజైన ఈ హాలీవుడ్ డ్రామా మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. 2019లో వచ్చి ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన ‘ది లయన్ కింగ్’ చిత్రానికి ప్రీక్వెల్‍గా ఇది రూపొందింది. ‘ముఫాసా: ది లయన్ కింగ్’ చిత్రం తెలుగు వెర్షన్‍లో ముఫాసా పాత్రకు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు డబ్బింగ్ చెప్పారు. ఈ మూవీలో తెలుగులోనూ మంచి కలెక్షన్లు దక్కించుకుంది. ‘ముఫాసా: ది లయన్ కింగ్’ చిత్రం ఇప్పుడు రెంట్ లేకుండా రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు వచ్చేయనుంది.
స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడ!
‘ముఫాసా: ది లయన్ కింగ్’ చిత్రం ఈనెల మార్చి 26వ తేదీన డియోహాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఇంగ్లిష్, తెలుగు, తమిళం, హిందీ బాషల్లో స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇవ్వనుంది. “లెజెంట్ ముఫాసాను చూసేందుకు టైమ్ వచ్చేసింది. ముఫాసా: ది లయన్ కింగ్ మార్చి 26న జియోహాట్‍స్టార్‌లోకి వచ్చేస్తోంది” అని ఆ ప్లాట్‍ఫామ్ నేడు (మార్చి 12) అధికారికంగా వెల్లడించింది.
రెంట్ లేకుండా..
ముఫాసా: ది లయన్ కింగ్ మూవీ ఇప్పటికే రెంట్ విధానంలో అమెజాన్ ప్రైమ్ వీడియో, యాపిల్ టీవీ లాంటి ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లో స్ట్రీమింగ్‍కు ఉంది. అయితే, మార్చి 26న జియో హాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. అంటే ఎలాంటి రెంట్ లేకుండా హాట్‍స్టార్ సబ్‍స్కిప్షన్ ఉన్న యూజర్లందరూ ఈ చిత్రాన్ని చూసేయవచ్చు.
ముఫాసా: ది లయన్ కింగ్ చిత్రాన్ని లైవ్ మ్యూజికల్ లైవ్ యాక్షన్ మూవీగా తెరకెక్కించారు దర్శకుడు బెర్రీ జెన్కిన్స్. మరోసారి మేజిక్ రిపీట్ చేశారు. తన మార్క్ టేకింగ్‍తో అడవిలోకి తీసుకెళ్లి ముఫాసాతో జర్నీ చేసే ఫీలింగ్‍ను ప్రేక్షకులకు కలిగించారు. సింబా తండ్రి ముఫాసా చుట్టూ ఈ మూవీ సాగుతుంది. ముఫాసా సింహాలకు రారాజు ఎలా అయ్యాడనే జర్నీ ఈ చిత్రంలో ఉంటుంది. అద్బుతమైన విజువల్స్, ఎమోషన్లు, సరదా సన్నివేశాలు, మ్యూజిక్ ముఫాసా: ది లయన్ కింగ్ మూవీ ప్రేక్షకులను మెప్పించింది.
భారీ బ్లాక్‍బస్టర్
ముఫాసా: ది లయన్ కింగ్ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చినా ప్రపంచవ్యాప్తంగా భారీ బ్లాక్‍బస్టర్ అయింది. ఈ మూవీ దాదాపు 200 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.1,740 కోట్లు) బడ్జెట్‍తో రూపొందిందని అంచనా. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు 712 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.6,210 కోట్లు) కలెక్షన్లు దక్కించుకొని భారీ హిట్ కొట్టింది. ఈ చిత్రాన్ని వాల్ట్ డిస్నీ స్టూడియోస్ ప్రొడ్యూజ్ చేసింది.
ప్రధాన పాత్ర అయిన ముఫాసాకు తెలుగులో సూపర్ స్టార్ మహేశ్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఇది చాలా బాగా వర్కౌట్ అయింది. ఈ చిత్రం తెలుగు వెర్షన్‍కు మంచి కలెక్షన్లు వచ్చాయి. ఓవర్సీస్‍లోనూ తెలుగు వెర్షన్ మంచి వసూళ్లు రాబట్టింది. ఈ మూవీలో టాకా పాత్రకు సత్యదేవ్ డబ్బింగ్ చెప్పారు. పంబా క్యారెక్టర్‌కు బ్రహ్మానందం, టిమోన్‍కు అలీ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఈ ముఫాసా: ది లయన్ కింగ్ చిత్రాన్ని మార్చి 26 నుంచి జియోహాట్‍స్టార్ ఓటీటీలోకి వచ్చేసింది.
సంబంధిత కథనం