



Best Web Hosting Provider In India 2024

Telangana Congress : ఎమ్మెల్సీ అభ్యర్థిగా విజయశాంతి పేరు…! తెర వెనక ఏం జరిగింది…?
ఎమ్మెల్సీ అభ్యర్థిగా విజయశాంతి పేరు ఖరారైన సంగతి తెలిసిందే. అయితే ఆమె ఎంపికపై రాజకీయవర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. మొదట్నుంచి రేసులో లేని విజయశాంతి… ఫైనల్ గా ఎలా సీటు దక్కించుకున్నారనేది టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ గా మారింది. అయితే ఢిల్లీ పెద్దల ప్రమేయంతోనే లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ నడుస్తోంది. మొత్తం ఐదు స్థానాలు ఖాళీ కాగా… ఇందులో మూడు స్థానాలు కూడా హస్తం పార్టీ ఖాతాలోకి వెళ్లనున్నాయి. మరో సీటు సీపీఐ, ఇంకో సీటు బీఆర్ఎస్ ఖాతాలో పడనుంది. ఇప్పటికే అభ్యర్థులు ఖరారు కాగా… నామినేషన్లు కూడా దాఖలు చేశారు. అయితే ఇందులో ఒకరిగా విజయశాంతి కూడా ఉన్నారు. కాంగ్రెస్ నుంచి నామినేషన్ వేశారు. దీంతో ఆమె పేరు చుట్టూ విస్తృతంగా చర్చ జరుగుతోంది..! చివరల్లో సీటు విషయంలో ఆమెకు ఎలా లైన్ క్లియర్ అయింది..? ఈ విషయంలో ఎవరి సిఫార్సులు పని చేశాయన్న చర్చ జోరుగా జరుగుతోంది.
అనూహ్యంగా తెరపైకి…!
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు నాటి నుంచి చాలా మంది నేతలు అవకాశం కోసం ప్రయత్నాలు చేశారు. ఇందులో చాలా మంది సీనియర్ నేతలు ఉన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఎలాగైనా అవకాశం దక్కించుకోవాలని చూశారు. ఈ విషయంలో అనేక లెక్కలు వేసుకొని మరీ…. నమ్మకంగా ఉన్నారు. కట్ చేస్తే…. ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాలో అనుకొని పేరు వచ్చి చేరింది. విజయశాంతిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు చేస్తూ కాంగ్రెస్ అధియకత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ప్రకటన చూసిన చాలా మంది టీ కాంగ్రెస్ లీడర్లు… షాక్ అయ్యారని తెలిసింది. ఆశావాహుల జాబితాలో రేసులోని పేరు… ఎలా ఫైనల్ అందన్న పార్టీ వర్గాల్లో జోరుగా జరుగుతోందంట..! అసలు విజయశాంతికి సీటు ఖరారు విషయంలో ఏం జరిగిందన్న దానిపై ఆరా తీస్తున్నారంట..!
బీజేపీలో కొనసాగిన విజయశాంతి… అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ లో చేరారు. ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత… పెద్దగా కనిపించలేదు. పార్టీ కార్యక్రమాల్లో కూడా యాక్టివ్ గా లేరు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో… విజయశాంతి పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. ఏకంగా ఎమ్మెల్సీ సీటును కూడా కట్టబెడుతూ అధినాయకత్వం ప్రకటన విడుదల చేసింది. అయితే విజయశాంతికి ఎమ్మెల్సీ సీటు విషయంలో…. ఢిల్లీ పెద్దలు చొరవ తీసుకున్నట్లు తెలిసింది. ఆమె పార్టీలో చేరే సమయంలోనే ఎమ్మెల్సీ హామీ ఉందని… ఆ కోణంలోనే తాజాగా సీటును ఖరారు చేశారని తెలిసింది. ఇటీవల విజయశాంతి హస్తిన పర్యటనకు కూడా వెళ్లారంట..! పార్టీలోని అగ్రనేతలను కలవటంతో పాటు ఈ భేటీలోనే ఆమెకు ఎమ్మెల్సీ సీటు విషయంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది.
రాష్ట్ర నాయకత్వం సిఫార్సు చేసిన పేర్లను పరిశీలించిన హైకమాండ్….చివర్లో ముగ్గురిని పేర్లను ఖరారు చేసింది. మరో సీటును సీపీఐకి ఇస్తున్నట్లు తెలిపింది. అయితే ఇందులో విజయశాంతి పేరును ప్రకటించింది. ఇదే విషయాన్ని ముందుగానే సీఎంతో పాటు పీసీసీ చీఫ్ కు కూడా తెలిపినట్లు తెలిసింది.
మరోవైపు ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్లు ప్రక్రియ పూర్తి అయింది. ఎలాంటి పోటీ లేకపోవటంతో… వీరి ఎన్నిక ఏకగ్రీవంగానే సాగనుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు మార్చి 13వతేదీతో పూర్తి కానుంది. ఆ వెంటనే ఈసీ నుంచి ప్రకటన వెలువడనుంది. మొత్తంగా ఓసారి తన రాజకీయ జీవితంలో బీఆర్ఎస్ నుంచి ఎంపీగా పని చేసిన విజయశాంతి…. మరోసారి ఎమ్మెల్సీగా చట్టసభలోకి అడుగుపెట్టనుంది…!
సంబంధిత కథనం
టాపిక్