




Best Web Hosting Provider In India 2024

OTT Crime Thriller Web Series: ఓటీటీలో కచ్చితంగా చూడాల్సిన 7 తెలుగు క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇవే..
OTT Crime Thriller Web Series: ఓటీటీలో మిస్ కాకుండా చూడాల్సిన 7 తెలుగు క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఏవో మీకు తెలుసా? జీ5, సోనీలివ్, జియోహాట్‌స్టార్ లాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో వీటిని చూడొచ్చు.

OTT Crime Thriller Web Series: క్రైమ్ థ్రిల్లర్ జానర్ కు ఓటీటీలో ఉన్న డిమాండ్ మేరకు తరచూ ఈ జానర్లో సినిమాలు, వెబ్ సిరీస్ వస్తుంటాయి. అలా తెలుగులోనూ ఎన్నో వెబ్ సిరీస్ తెరకెక్కాయి. వీటిలో చాలా వరకు మంచి టాక్ సొంతం చేసుకున్నాయి. మరి ఆ వెబ్ సిరీస్ ఏవి? ఎక్కడ చూడాలో తెలుసుకోండి.
బృందా – సోనీ లివ్ ఓటీటీ
ఒకప్పుడు టాలీవుడ్ ను ఏలిన నటి త్రిష నటించిన వెబ్ సిరీస్ బృందా. ఇదో మంచి క్రైమ్ థ్రిల్లర్ సిరీస్. ఇందులో ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో త్రిష నటించింది. తన గతాన్ని గుర్తుకు తెస్తూ సాగే మర్డర్ కేసులను ఆమె ఎలా పరిష్కరించిందన్నది ఇందులో చూడొచ్చు. హత్యలు చేసేది ఎవరు? చేయించేది ఎవరు? అసలు ఆ హంతకుడిని ఎలా పట్టుకుంటారన్నది చివరి వరకూ ట్విస్టులతో సాగించిన తీరు బాగుంటుంది.
వికటకవి – జీ5 ఓటీటీ
నరేష్ అగస్త్య లీడ్ రోల్లో నటించిన వెబ్ సిరీస్ వికటకవి. ఓ ఊళ్లోని చీకటి రహస్యాలను ఓ డిటెక్టివ్ ఎలా వెలికితీస్తాడన్నది ఈ పీరియడ్ డ్రామాలో చూడొచ్చు. ప్రదీప్ మద్దాలి డైరెక్ట్ చేసిన ఈ వెబ్ సిరీస్ ను జీ5 ఓటీటీలో చూడొచ్చు.
గాలివాన – జీ5 ఓటీటీ
గాలివాన కూడా ఓ మర్డర్ చుట్టూ తిరిగే క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీసే. సాయి కుమార్, రాధిక శరత్ కుమార్ లాంటి సీనియర్ నటీనటులు నటించిన ఈ సిరీస్.. ఓ కుటుంబంలో జరిగే హత్య, ఆ హత్య ఎవరు చేశారన్న సస్పెన్స్ చుట్టూ సాగుతుంది. శరణ్ కోపిశెట్టి ఈ సిరీస్ ను డైరెక్ట్ చేశాడు. జీ5 ఓటీటీలో ఈ సిరీస్ అందుబాటులో ఉంది.
దయా – జియోహాట్‌స్టార్ ఓటీటీ
జియోహాట్‌స్టార్ ఓటీటీలో ఉన్న ఈ దయా వెబ్ సిరీస్ ను అస్సలు మిస్ కావద్దు. సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి లీడ్ రోల్లో నటించిన సిరీస్ ఇది. ఓ డ్రైవర్ తన వ్యానులో అనుకోకుండా ఓ శవాన్ని గుర్తిస్తాడు. ఆ శవం ఎవరిది? దాని నుంచి అతడు ఎలా బయటపడతాడు? ఆ డ్రైవర్ గతం ఏంటి అన్న సస్పెన్స్ ఈ సిరీస్ చూస్తున్నంతపు సేపు ఉంటుంది. పవన్ సాదినేని డైరెక్ట్ చేశాడు. రెండో సీజన్ కూడా రానుంది.
సైతాన్ – జియోహాట్‌స్టార్
మహి వి రాఘవ్ డైరెక్ట్ చేసిన సైతాన్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ ప్రారంభానికి ముందు నుంచే వార్తల్లో నిలిచింది. మితిమీరిన వయోలెన్స్, బూతులు, బోల్డ్ కంటెంట్ తో ఆకర్షించింది. ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ హోంమంత్రిని చంపాలని చూసే బాలి అనే వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. జియోహాట్‌స్టార్ లో ఈ సిరీస్ చూడొచ్చు.
బహిష్కరణ – జీ5 ఓటీటీ
నటి అంజలి ఓ వేశ్యగా కనిపించిన వెబ్ సిరీస్ బహిష్కరణ. ఇదొక పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే రివేంజ్ డ్రామా థ్రిల్లర్ సిరీస్. తన ప్రియుడికి జరిగిన అన్యాయంపై ఓ వేశ్య ఏ విధంగా ప్రతీకారం తీర్చుకుందనే పాయింట్‌తో దర్శకుడు ముఖేష్ ప్రజాపతి ఈ వెబ్‌సిరీస్ కథను రాసుకున్నాడు.
పరువు – జీ5 ఓటీటీ
సీనియర్ నటుడు నాగబాబు నటించిన వెబ్ సిరీస్ పరువు. గతేడాది వచ్చిన సూపర్ హిట్ వెబ్ సిరీస్ లలో ఇదీ ఒకటి. పరువు హత్యలు అన్నది చాలా సెన్సిటివ్ పాయింట్. ఈ కాన్సెప్ట్‌తో గతంలో తెలుగు తెరపై కొన్ని సినిమాలొచ్చాయి. కానీ సిరీస్‌లు అంతగా రాలేదు. పరువు వెబ్‌సిరీస్‌తో ఫస్ట్ టైమ్ ఈ కాన్సెప్ట్‌ను టచ్ చేశారు దర్శకద్వయం సిద్ధార్థ్‌నాయుడు, రాజశేఖర్ వడ్లపాటి. ఓ పరువు హత్య చుట్టూ జరిగే మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా ఈ సిరీస్‌ను తెరకెక్కించారు.
సంబంధిత కథనం