




Best Web Hosting Provider In India 2024

IPS Officers Suspension : నటి జత్వానీ వేధింపుల కేసు, ముగ్గురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ పొడిగింపు
IPS Officers Suspension : ముంబయి నటి జత్వానీపై తప్పుడు కేసు పెట్టి, వేధించారన్న అభియోగాలతో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఏపీ ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ముగ్గురి సస్పెన్షన్ ను మరో 6 నెలలు పొడిగించింది.

IPS Officers Suspension : ఏపీ ప్రభుత్వం ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులపై సస్పెన్షన్ ను మరో 6 నెలలు పొడిగించింది. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్‌ఆర్ ఆంజనేయులు, విజయవాడ మాజీ సీపీ కాంతిరాణా టాటా, ఐపీఎస్ అధికారి విశాల్ గున్నిని ఏపీ సర్కార్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఆ గడువు ముగియడంతో సస్పెన్షన్‌ను సెప్టెంబరు 25 వరకు పొడిగించింది.
ముంబై నటి కాదంబరీ జత్వానీపై తప్పుడు కేసు పెట్టి వేధించినట్లు ఆరోపణలు రావడంతో ముగ్గురు ఐపీఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం సస్పెన్షన్ వేటు చేసింది. తప్పుడు కేసులో సినీ నటి కాదంబరీ జత్వానీని అరెస్టు చేసి, ఇబ్బందులకు గురిచేసిన వ్యవహారంలో ముగ్గురు ఐపీఎస్ లపై పలు అభియోగాలున్నాయి. ముగ్గురు అధికారులు అఖిల భారత సర్వీసు నిబంధనలు ఉల్లంఘించారన్న అభియోగాలపై రివ్యూ కమిటీ సిఫారసు మేరకు ఐపీఎస్‌ల సస్పెన్షన్ పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. 2025 సెప్టెంబర్ 25 వరకూ ఈ ముగ్గురి సస్పెన్షన్ పొడిగిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
సంబంధిత కథనం
టాపిక్