Akhil Akkineni: ఎట్ట‌కేల‌కు సెట్స్‌పైకి రానున్న అఖిల్ అక్కినేని నెక్స్ట్ మూవీ – లాంఛింగ్ ఎప్పుడంటే?

Best Web Hosting Provider In India 2024

Akhil Akkineni: ఎట్ట‌కేల‌కు సెట్స్‌పైకి రానున్న అఖిల్ అక్కినేని నెక్స్ట్ మూవీ – లాంఛింగ్ ఎప్పుడంటే?

Nelki Naresh HT Telugu
Published Mar 12, 2025 11:25 AM IST

Akhil Akkineni: ఏజెంట్ డిజాస్ట‌ర్‌తో రెండేళ్ల పాటు సినిమాల‌కు గ్యాప్ ఇచ్చాడు అఖిల్‌. తాజాగా అత‌డి నెక్స్ట్ మూవీ షూటింగ్ మార్చి 14 నుంచి హైద‌రాబాద్‌లో మొద‌లుకానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. లెనిన్ అనే టైటిల్‌తో తెర‌కెక్క‌నున్న ఈ మూవీని నాగార్జున ప్రొడ్యూస్ చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

అఖిల్ అక్కినేని
అఖిల్ అక్కినేని

Akhil Akkineni: అఖిల్ ఏజెంట్ విడుద‌లై దాదాపు రెండేళ్లు కావ‌స్తోంది. అయినా ఇప్ప‌టివ‌ర‌కు అఖిల్ కొత్త సినిమా మొద‌లుపెట్ట‌లేదు. ఏజెంట్ డిజాస్ట‌ర్ కావ‌డంతో నెక్స్ట్ మూవీపై ఆచితూచి అడుగులు వేస్తోన్నారు. అఖిల్ నెక్స్ట్ మూవీకి విన‌రో భాగ్య‌ము విష్ణు క‌థ ఫేమ్ ముర‌ళీకృష్ణ అబ్బూరు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

హైద‌రాబాద్‌లో షూటింగ్‌…

ఎట్ట‌కేల‌కు ఈ మూవీ సెట్స్‌పైకిరానున్న‌ట్లు స‌మాచారం. మార్చి 14 నుంచి హైద‌రాబాద్‌లో ఈ మూవీ షూటింగ్ మొద‌లుకానున్న‌ట్లు తెలిసింది. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో రూరల్ ఫ్యామిలీ డ్రామా మూవీగా అఖిల్ మూవీ తెర‌కెక్కుతోన్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ మూవీతోనే ఫ‌స్ట్ టైమ్ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌ను అఖిల్ ట‌చ్ చేయ‌బోతున్నాడు. చిత్తూరు నేప‌థ్యంలో ఈ మూవీ క‌థ సాగుతుంద‌ని అంటున్నారు. ఈ సినిమాలోని కీల‌క‌మైన ఎపిసోడ్స్‌ను చిత్తూరు ప్రాంతంలోనే షూట్ చేయ‌నున్న‌ట్లు చెబుతోన్నారు.

అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్‌లో…

అఖిల్ హీరోగా న‌టిస్తోన్న ఆరో మూవీ ఇది. ఈ సినిమాను అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై నాగార్జున స్వ‌యంగా ప్రొడ్యూస్ చేయ‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. అఖిల్ మూవీకి లెనిన్ అనే పేరును ప‌రిశీలిస్తోన్న‌ట్లు స‌మాచారం. త్వ‌ర‌లోనే టైటిల్‌పై అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రానున్న‌ట్లు తెలిసింది.

ఈ విలేజ్ ఫ్యామిలీ డ్రామా మూవీలో అఖిల్‌కు జోడీగా శ్రీలీల పేరు వినిపిస్తోంది. ప్ర‌స్తుతం తెలుగు, త‌మిళంతో పాటు బాలీవుడ్‌లో వ‌రుస‌గా సినిమాలు చేస్తూ శ్రీలీల బిజీగా ఉంది. దాంతో అఖిల్ సినిమాను అంగీక‌రిస్తుందా? లేదా? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

జైనాబ్ ర‌వ్జీతో ఎంగేజ్‌మెంట్‌…

అఖిల్ అక్కినేని ఈ ఏడాది పెళ్లిపీట‌లు ఎక్క‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది, గ‌త ఏడాది న‌వంబ‌ర్‌లో జైనాబ్ ర‌వ్జీతో అఖిల్ ఎంగేజ్‌మెంట్ జ‌రిగింది.జైనాబ్ ఓ ఆర్టిస్ట్. హైద‌రాబాద్‌లో పుట్టి పెరిగిన ఆమె ముంబాయిలో స్థిర‌ప‌డింది. జైనాబ్‌తో అఖిల్‌కు మొద‌లైన ప‌రిచ‌యం ప్రేమ‌తో మారిన‌ట్లు స‌మాచారం. గ‌త మూడేళ్లుగా ఈ జంట ప్రేమ‌లో ఉన్న‌ట్లు తెలిసింది. నాగార్జున ఇంట్లోనే అఖిల్‌, జైనాబ్‌ నిశ్చితార్థం జరిగిందిపెళ్లి డేట్ మాత్రం ఇంకా ఫిక్స్ చేయ‌లేదు.

హిట్టు కోసం వెయిటింగ్‌…

అఖిల్ మూవీతో హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు అఖిల్‌. హ‌లో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌, మ‌జ్నుతో పాటు ఏజెంట్ సినిమాలు చేశాడు. అవేవీ అత‌డికి విజ‌యాల‌ను తెచ్చిపెట్ట‌లేక‌పోయాయి. క‌మ‌ర్షియ‌ల్ హిట్టు కోసం చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నాడు.

ఏజెంట్ ఓటీటీ రిలీజ్‌…

అఖిల్ ఏజెంట్ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైన రెండేళ్ల త‌ర్వాత ఓటీటీలోకి వ‌స్తోంది. మార్చి 14 నుంచి సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. సురేంద‌ర్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీలో మ‌ల‌యాళ అగ్ర హీరో మ‌మ్ముట్టి కీల‌క పాత్ర పోషించారు. సాక్షి వైద్య హీరోయిన్‌గా న‌టించింది. దాదాపు 80 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ ఎనిమిది కోట్ల‌లోపే వ‌సూళ్ల‌ను రాబ‌ట్టి డిజాస్ట‌ర్‌గా నిలిచింది.

Nelki Naresh

TwittereMail
నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024