






Best Web Hosting Provider In India 2024

OTT Biopic: ఓటీటీలోకి ఆరు నెలల తర్వాత వచ్చిన తెలుగు బయోపిక్ మూవీ.. ఎక్కడ చూడాలంటే?
OTT Biopic: ఓటీటీలోకి ఆరు నెలల తర్వాత ఓ బయోపిక్ మూవీ వచ్చింది. స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది. థియేటర్లలో పెద్దగా రెస్పాన్స్ రాని ఈ సినిమా.. ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెట్టింది.

OTT Biopic: ఓటీటీలోకి ఇప్పుడో తెలుగు బయోపిక్ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చింది. గతేడాది సెప్టెంబర్ 20న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. ఆరు నెలల తర్వాత ఓటీటీలోకి అడుగుపెట్టినా.. ఇప్పుడు కూడా రెంట్ విధానంలోనే ఈ మూవీని చూసే అవకాశం కల్పించడం గమనార్హం. అల్లూరి సీతారామరాజు జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది.
మన్యం ధీరుడు ఓటీటీ స్ట్రీమింగ్
అల్లూరి సీతారామరాజు జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా పేరు మన్యం ధీరుడు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చింది. అయితే సబ్‌స్క్రైబర్లందరికీ కాకుండా రూ.99 రెంట్ చెల్లించిన వారికి మాత్రమే ఈ సినిమా చూసే అవకాశం కల్పించారు.
ఇది కాస్త ఆశ్చర్యం కలిగించే విషయమే. థియేటర్లలో రిలీజైన ఆరు నెలలకు ఓటీటీలోకి వచ్చినా, అది కూడా పెద్దగా సక్సెస్ కాని మూవీకి ఓటీటీలో రెంట్ విధానంలో అందుబాటులోకి తేవడం చాలా అరుదు.
మన్యం ధీరుడు మూవీ గురించి..
మన్యం ధీరుడు మూవీని నరేష్ డెక్కెల డైరెక్ట్ చేశాడు. ఇందులో ఆర్వీవీ సత్యనారాయణ, ఆర్ పార్వతీదేవి లీడ్ రోల్స్ లో నటించారు. జబర్దస్త్ అప్పారావు ఓ ముఖ్యమైన పాత్ర పోషించాడు. ఆర్వీవీ మూవీస్ బ్యానర్లో ఈ మూవీలో నటించిన ఆర్వీవీ సత్యనారాయణే సినిమాని నిర్మించాడు.
స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా గతేడాది సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే బాక్సాఫీస్ దగ్గర ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఈ సినిమాకు వచ్చిన రివ్యూలు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. అలాంటి సినిమాను ఇప్పుడు ప్రైమ్ వీడియో రెంట్ విధానంలో తీసుకొచ్చింది. మరి ఓటీటీలో ఏమాత్రం రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
ప్రైమ్ వీడియో తెలుగు మూవీస్
అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మధ్యే కొన్ని తెలుగు సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చాయి. అందులో విశ్వక్సేన్ డిజాస్టర్ మూవీ లైలా కూడా ఉంది. ఇదే కాకుండా శర్వానంద్ మనమే కూడా చాలా రోజుల తర్వాత ఈ ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఇక అర్జున ఫాల్గుణ, భూతద్దం భాస్కర్, శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్, హత్య, గేమ్ ఛేంజర్ లాంటి సినిమాలు కూడా ప్రైమ్ వీడియోలో ఈ మధ్యే స్ట్రీమింగ్ కు వచ్చాయి.
సంబంధిత కథనం