






Best Web Hosting Provider In India 2024

SRM AP CMU Collaboration : అమరావతి ఎస్ఆర్ఎమ్ వర్సిటీ కీలక అడుగు, ఏఐ పరిశోధనలో యూఎస్ఏ కార్నెగీ మెల్లన్ వర్సిటీ తోడ్పాటు
SRM AP CMU USA Collaboration : అమరావతి ఎస్ఆర్ఎమ్ యూనివర్సిటీ మరో కీలక అడుగు వేసింది. ఏఐ పరిశోధన, ఎడ్యుకేషన్ కోసం యూఎస్ఏలోని కార్నెగీ మెల్లన్ విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ సహకారం పొందనుంది. ఏఐ పరిశోధనలో ఈ సహకారం కీలక మైలురాయి అవుతుందని ఎస్ఆర్ఎమ్ వర్సిటీ ప్రకటించింది.

SRM AP CMU USA Collaboration : అమరావతిలోని ఎస్ఆర్ఎమ్ యూనివర్సిటీ మరో మైలు రాయిని అందుకుంది. కృత్రిమ మేధస్సు, అత్యాధునిక పరిశోధనలో భాగంగా ప్రపంచంలోని అగ్రగామి సంస్థలలో ఒకటైన కార్నెగీ మెల్లన్ విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఐదు ఏళ్ల సహకారం పొందనుంది. ఈ వ్యూహాత్మక సహకారంతో మెషిన్ లెర్నింగ్, నాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, కంప్యూటర్ విజన్, మౌలిక సదుపాయాలు, ఏఐ ఎథిక్స్ అండ్ ప్రాసెస్ తో సహా ఏఐ సంబంధిత విభాగాలలో నాలెడ్జ్, నూతన ఆవిష్కరణలను ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యమని ఎస్ఆర్ఎమ్ ప్రకటించింది.
ఈ వ్యూహాత్మక సహకారంతో సంచలనాత్మక పరిశోధన… ఏఐ ఆధారిత సాంకేతికతలలో పురోగతిని వేగవంతం చేసే వ్యవస్థను పెంపొదిస్తుందని వెల్లడించింది.
ఏఐ ఎక్సలెన్స్
“సీఎంయూ స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్, పరిశోధనను ముందుకు తీసుకెళ్లడానికి, ఏఐ విద్యను బలోపేతం చేయడానికి… ఎస్ఆర్ఎస్ అమరావతితో కలిసి పనిచేయడానికి ఉత్సాహంగా ఉన్నాము. మేము ఏఐ పరిశోధనలతో.. తదుపరి తరం పరిశోధకులు, విద్యావేత్తలు, పారిశ్రామిక నాయకులను సాంకేతికత పరిజ్ఞానంతో ముందుకు నడిపించడానికి కలిసి పనిచేస్తాము” అని సీఎంయూ స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ డీన్ ప్రొఫెసర్ మార్షల్ హెబర్ట్ అన్నారు.
ఈ ఒప్పందంలో భాగంగా ఎస్ఆర్ఎమ్, అమరావతి పరిశోధనా అధ్యాపకులు, పరిశోధకులు సీఎంయూ స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్‌లోని అధ్యాపకులు పరిశోధకులతో నేరుగా సహకారాన్ని పొందుతారు. సీఎంయూ ఎస్సీఎస్ ఏఐ ల్యాబ్‌లలో కీలక పరిశోధన డొమైన్‌లలో ప్రపంచ నిపుణులతో కలిసి పనిచేస్తారు. ఈ పరిశోధన, నాలెడ్జ్ పార్టనర్షిప్ ప్రపంచ సవాళ్లను పరిష్కరించే అత్యాధునిక ఏఐ ఆవిష్కరణల అభివృద్ధిని సులభతరం చేస్తుందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
అమరావతి ఎస్ఆర్ఎమ్ వర్సిటీ ప్రో ఛాన్సలర్ డాక్టర్ పి.సత్యనారాయణన్ మాట్లాడుతూ, “పరిశోధన సామర్థ్యాలను మరింత బలోపేతం చేయడానికి, ఎస్ఆర్ఎమ్ విశ్వవిద్యాలయంలో అధునాతన AI ల్యాబ్‌లను స్థాపించడానికి ఈ సహకారం మార్గం సుగమం చేస్తుంది” అని అన్నారు. ఈ ల్యాబ్ లు ఏఐ పరిశోధనకు ఇంక్యుబేటర్లుగా ఉంటాయి, విద్యాపరమైన, అంతర్-విభాగ సహకారం, సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహించే వాతావరణాన్ని పెంపొందిస్తాయని ప్రో ఛాన్సలర్ తెలిపారు.
ప్రపంచ స్థాయి అవకాశాలతో ఏఐ ఎడ్యుకేషన్ అభివృద్ధి
“పరిశోధనకు మించి ఈ సహకారం ఏపీ ఎస్ఆర్ఎమ్ బోధనా అధ్యాపకులు, పరిశోధనా స్కాలర్ల విద్యా అనుభవాన్ని మెరుగుపరచడానికి రూపొందించారు. ఎంపిక చేసిన అధ్యాపక సభ్యులు, స్కాలర్లు సీఎంయూ స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్‌లోని అత్యాధునిక ఏఐ కోర్సుల గురించి అధ్యయనం చేస్తారు. ఈ ఎక్స్‌పోజర్ సీఎంయూ ఎస్సీఎస్ అధ్యాపకులతో చర్చించడానికి, అమరావతి ఎస్ఆర్ఎమ్ లో ఏఐ పాఠ్యాంశాలను అభివృద్ధి చేయడానికి దోహదపడుతుంది. ఏఐ సమస్య పరిష్కార దృశ్యాలను ప్రతిబింబించే అసైన్‌మెంట్‌లు, వర్క్‌షీట్‌లు, పరీక్షలను రూపొందించడంలో ఆచరణాత్మక అనుభవాన్ని పొందుతారు. ఎస్ఆర్ఎమ్ అమరావతిలో ఏఐ విద్య నాణ్యతను పెంచుతారు” అని ఎస్ఆర్ఎమ్ ప్రకటించింది.
విద్యార్థులకు అసమానమైన పరిశోధన ఇంటర్న్‌షిప్‌లు
‘అమరావతిలోని ఎస్ఆర్ఎమ్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మనోజ్ కె అరోరా మాట్లాడుతూ… “భవిష్యత్ ఏఐ నాయకులను తీర్చిదిద్దడంలో, ఏఐ ఆవశ్యకతను తెలియజేసే చర్యలో భాగంగా ఈ సహకారం ఎస్ఆర్ఎమ్ విద్యార్థులు, సీఎంయూ స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్‌లో పరిశోధన ఇంటర్న్‌షిప్‌లను చేపట్టే అవకాశాన్ని అందిస్తుంది” అని అన్నారు. ఎంపికైన విద్యార్థులు ప్రతి వేసవిలో ప్రపంచ స్థాయి పరిశోధనలలో సుమారు ఆరు వారాలు గడుపుతారు. ఈ రంగంలోని వారితో సంక్లిష్టమైన ఏఐ సవాళ్లను ఎదుర్కోవడంలో ప్రత్యక్ష అనుభవాన్ని పొందుతారు. ఈ అనుభవం విద్యార్థులకు ఎంతో గానో ఉపయోగపడుతుంది. పోటీతత్వ ఏఐ ల్యాండ్‌స్కేప్‌లో ఓ ప్రత్యేకతను చాటుతుంది’ అని ఎస్ఆర్ఎమ్ పేర్కొంది.
టాపిక్