




Best Web Hosting Provider In India 2024
Hardik Pandya Record: కోహ్లి రికార్డు బ్రేక్ చేసిన హార్దిక్.. 6 నిమిషాల్లోనే.. ఆ స్పెషల్ ఫీట్ ఇదే
Hardik Pandya Record: ఛాంపియన్స్ ట్రోఫీ విజయంలో హార్దిక్ పాండ్య కీ రోల్ ప్లే చేశాడు. ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. తాజాగా విరాట్ కోహ్లి రికార్డును హార్దిక్ బ్రేక్ చేశాడు. ఇన్స్టాగ్రామ్లో హార్దిక్ పోస్టు చేసిన ఓ ఫోటో లైక్స్ లతో దూసుకెళ్తోంది.

ఛాంపియన్స్ ట్రోఫీలో ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్య రికార్డుల వేట కొనసాగిస్తున్నాడు. కానీ ఈ సారి రికార్డు బ్రేక్ చేసింది గ్రౌండ్ లో కాదు సోషల్ మీడియాలో. ఇన్ స్టాగ్రామ్ లో హార్దిక్ పోస్టు చేసిన ఓ ఫొటో లైక్స్ లతో దూసుకెళ్తోంది. ఇన్ స్టాగ్రామ్ లో అత్యంత త్వరగా 1 మిలియన్ (10 లక్షలు) లైక్స్ సాధించిన ఫొటోగా రికార్డు నమోదైంది.
ఇదే ఆ ఫొటో
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ ను ఓడించి భారత్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ ట్రోఫీ ప్రెజెంటేషన్ తర్వాత టీమిండియా ఆటగాళ్లు కప్ తో ఫొటోలు దిగారు. హార్దిక్ కూడా ట్రోఫీ తీసుకుని పిచ్ పైకి వెళ్లారు. పిచ్ పై ట్రోఫీ పెట్టి ఐకానిక్ స్టైల్లో ఫొటోకు ఫోజు ఇచ్చాడు. ఈ ఫొటోనే అతను ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేయగా లైక్స్ ల మీద లైక్స్ వస్తున్నాయి.
కోహ్లీని దాటి
ఇన్ స్టాగ్రామ్ లో హార్దిక్ పోస్టు చేసిన ఫొటో రికార్డులు బ్రేక్ చేస్తోంది. టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి రికార్డును హార్దిక్ బద్దలు కొట్టాడు. ఇన్ స్టాగ్రామ్ లో 6 నిమిషాల్లోనే హార్దిక్ ఫొటోకు 1 మిలియన్ లైక్స్ వచ్చాయి. విరాట్ కోహ్లి (7 నిమిషాల్లో) రికార్డును హార్దిక్ తిరగరాశాడు. 2024 టీ20 ప్రపంచకప్ తో కోహ్లి దిగిన ఫొటోకు 7 నిమిషాల్లో 1 మిలియన్ లైక్స్ వచ్చాయి.
అప్పుడు కూడా
టీ20 ప్రపంచకప్ తో కూడా హార్దిక్ ఇలాంటి ఫోజే పెట్టాడు. అప్పుడూ ఆ ఫొటో వైరల్ గా మారింది. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీతో దిగిన ఫొటో అంతకుమించి రికార్డుల వేటలో దూసుకెళ్తోంది. అటు ఆటతో మైదానంలో అదరగొట్టిన హార్దిక్.. ఇటు ఫొటోలతో సోషల్ మీడియాలోనూ క్రేజీగా మారాడు.
ఛాంపియన్స్ ట్రోఫీలో
ఛాంపియన్స్ ట్రోఫీ విజయంలో హార్దిక తనవంతు పాత్ర పోషించాడు. 4 ఇన్నింగ్స్ ల్లో 99 పరుగులు చేయడంతో పాటు 4 వికెట్లు పడగొట్టాడు. కీలక సమయాల్లో భారీ షాట్లతో జట్టుపై ఒత్తిడి తగ్గించి, గెలుపు దిశగా నడిపించాడు. ఇక కొత్త బంతితో బ్యాటర్లను కట్టడి చేశాడు. షమితో కలిసి హార్దిక్ బౌలింగ్ దాడిన ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇన్ స్టాగ్రామ్ లో హార్దిక్ కు 38.8 మిలియన్ ఫాలోవర్లున్నారు.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link