




Best Web Hosting Provider In India 2024

Mohan Lal Thriller Movies on OTT: ఓటీటీలో ఉన్న మోహన్ లాల్ నటించిన థ్రిల్లర్ మూవీస్ ఇవే.. ఎక్కడ చూడాలంటే?
Mohan Lal Thriller Movies on OTT: మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటించిన కొన్ని థ్రిల్లర్ మూవీస్ ఓటీటీలో అందుబాటులో ఉన్నాయి. ఈ మలయాళం సినిమాలన్నీ తెలుగులోనూ అందుబాటులో ఉండటం విశేషం.

Mohan Lal Thriller Movies on OTT: మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ ఇండియన్ సినిమాకి, ముఖ్యంగా మలయాళం సినిమాకి చేసిన సేవలు అన్నీఇన్నీ కావు. ఎన్నో లెక్కలేనన్ని గొప్ప సినిమాలు చేశాడు. అవి ఎప్పటికీ అభిమానుల గుండెల్లో నిలిచిపోతాయి. అతడు త్వరలోనే ఎల్2:ఎంపురాన్ సినిమాలో కనిపించబోతున్నాడు. అయితే ఇప్పటికే ఓటీటీలో అందుబాటులో ఉన్న మోహన్ లాల్ థ్రిల్లర్ మూవీస్ ఏవో ఒకసారి చూడండి.
దృశ్యం – జియోహాట్‌స్టార్
దృశ్యం 2013లో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ సినిమా. ఇందులో మోహన్ లాల్, మీనా నటించారు. ఇందులో జార్జ్ కుట్టి (మోహన్ లాల్) అనే ఒక వ్యక్తి తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి చేసే ప్రయత్నాలు చూడొచ్చు. ఒక పోలీస్ ఆఫీసర్ కొడుకు కనిపించకుండా పోవడం, దానికి జార్జ్ కుట్టి ఫ్యామిలీయే కారణమన్న అనుమానం పోలీసులకు కలుగుతుంది.
అనుకోకుండా ఓ వ్యక్తిని హత్య చేసిన తన భార్య, కూతురిని కాపాడుకోవడానికి అతడు ఎన్ని రకాల ప్రయత్నాలు చేశాడన్నది మంచి థ్రిల్, ట్విస్టులు జోడించి ఇందులో చూపించారు. తెలుగులోనూ వెంకటేశ్, మీనా కలిసి ఇదే పేరుతో రీమేక్ చేసిన విషయం తెలిసిందే.
ఒప్పం – జియోహాట్‌స్టార్
ఒప్పం అనేది 2016 లో వచ్చిన మలయాళం థ్రిల్లర్. ఇందులో జయరామన్ (మోహన్ లాల్) అనే ఒక గుడ్డివాడు హత్య కేసులో ఇరుక్కుంటాడు. తను నిర్దోషి అని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తాడు.
ఒక సైకో కిల్లర్ నుంచి ఒక అమ్మాయిని కాపాడటానికి తనకున్న మిగతా సెన్సులతోపాటు ఒక మాజీ జడ్జికి చేసిన సహాయం, అది తనకు ఉపయోగపడుతున్న ధీమాతో ప్రయత్నిస్తాడు. ఈ సినిమాని ప్రియదర్శన్ డైరెక్ట్ చేశాడు. ఇందులో సముద్రఖని, విమల రామన్, అనుశ్రీ లాంటి వాళ్లు కూడా నటించారు.
పులిమురుగన్ – జియోహాట్‌స్టార్
పులిమురుగన్ 2016లో మోహన్ లాల్ నటించిన మలయాళం యాక్షన్ సినిమా. ఇందులో అతడు మురుగన్ గా నటించాడు. అడవిలో మనుషుల్ని తినే పులులతో పోరాడతాడు. డాడీ గిరిజ (జగపతి బాబు) అనే అతను గంజాయి స్మగ్లింగ్ కోసం మురుగన్ ని వాడుకుంటాడు.
ఇదే కాకుండా మురుగన్ భార్య మైనా (కమలినీ ముఖర్జీ) గురించి, ఫారెస్ట్ రేంజర్ ఆర్కే (కిషోర్)తో గొడవ గురించి కూడా సినిమాలో చూపిస్తారు. ఈ సినిమా మోహన్ లాల్ కెరీర్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమా కావడం విశేషం.
భ్రమరం – జియోహాట్‌స్టార్
భ్రమరం మోహన్ లాల్ నటించిన మలయాళం క్రైమ్ డ్రామా థ్రిల్లర్. ఇందులో అతడు శివన్‌కుట్టిగా నటించాడు. చిన్నప్పుడు తన క్లాస్‌మేట్స్ ఉన్ని, అలెక్స్ లు చేసిన హత్యకి శివన్‌కుట్టిని ఇరికిస్తారు. అయితే ఆ హత్య నుంచి తాను బయటపడటానికి శివన్ కుట్టి ప్రయత్నిస్తాడు.
ఉన్ని ఒక షేర్ బ్రోకర్, తన భార్య, కూతురితో హాయిగా ఉంటాడు. జోస్ అనే ఒక కొత్త వ్యక్తి వచ్చి వాళ్ల పాత స్కూల్ మేట్ అని చెప్తాడు. అయితే అతను మరెవరో కాడు.. ఉన్ని, అలెక్స్ లు చిన్నప్పుడు చేసిన హత్యలో ఇరుక్కన్న శివన్ కుట్టి అని తెలుసుకుంటారు. తర్వాత ఏం జరిగిందన్నది మూవీలో చూడాలి.
లూసిఫర్ – ప్రైమ్ వీడియో
లూసిఫర్ 2019 లో పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్ట్ చేసిన మలయాళం పొలిటికల్ థ్రిల్లర్. ఇందులో మోహన్ లాల్ నటించాడు. ఒక పెద్ద పొలిటీషియన్ చనిపోయిన తర్వాత ఆ పదవి కోసం చాలా మంది గొడవ పడతారు. రాజకీయాల్లోని చీకటి కోణాలు, డ్రగ్ మాఫియా గురించి సినిమాలో చూపిస్తారు. ఈ మూవీని తెలుగులో చిరంజీవి గాడ్ ఫాదర్ పేరుతో తీసిన విషయం తెలిసిందే.
సంబంధిత కథనం