




Best Web Hosting Provider In India 2024

OTT Hollywood Emotional Movies: గుండెల్ని బరువెక్కించే 5 ఎమోషనల్ హాలీవుడ్ చిత్రాలు.. ఎక్కడ చూడొచ్చంటే..
OTT Hollywood Emotional Movies: హాలీవుడ్‍లో చాలా ఎమోషనల్ చిత్రాలు వచ్చాయి. గుండెలను పిండేసే భావోద్వేగాలతో కదిలించేశాయి. వాటిలో ఐదు ఎమోషనల్ చిత్రాలను ఇక్కడ తెలుసుకోండి.

హాలీవుడ్‍లో భారీ వీఎఫ్‍ఎక్స్, సూపర్ హీరో, యాక్షన్ చిత్రాలే కాకుండా చాలా ఎమోషనల్ చిత్రాలు కూడా వచ్చాయి. భావోద్వేగాలతో కన్నీరు తెప్పేంచే రేంజ్ సినిమాలు రూపొందాయి. కొన్ని ఎమోషనల్ చిత్రాలు ప్రశంసలను దక్కించుకోవడంతో పాటు భారీ రేంజ్‍లో కమర్షియల్ హిట్స్ అయ్యాయి. వాటిలో ఓ ఐదు హాలీవుడ్ ఎమోషనల్ చిత్రాల గురించి ఇక్కడ చూడండి. ఏ ఓటీటీల్లో చూడొచ్చో తెలుసుకోండి.
ది షషాంక్ రెడెంప్షన్
టిమ్ రాబిన్స్ ప్రధాన పాత్ర పోషించిన ది షషాంక్ రెడెంప్షన్ (1994) ఎమోషనల్ ప్రిజన్ డ్రామాగా తెరకెక్కింది. తన భార్య, అతడి ప్రియుడిని చంపాడన్న అభియోగంతో జీవితకాలం జైలు శిక్ష పడే బ్యాంకర్ యాండీ డుఫ్రెస్నే (టిమ్ రాబిన్స్) చుట్టూ ఈ మూవీ సాగుతుంది. చేయని నేరానికి జైలులో కష్టాలు అభవిస్తున్నా జీవితంపై ఆశతో అతడు ముందుకు సాగుతుంటాడు. ఇలా భావోద్వేగంగా అతడి జర్నీ సాగుతుంది. ఈ చిత్రం గుండెను బరువెక్కిస్తుంది. ఈ మూవీకి ఫ్రాంక్ డరాబోంట్ దర్శకత్వం వహించారు. ది షషాంక్ రెడెంప్షన్ చిత్రం హాలీవుడ్‍లో క్లాసిక్ చిత్రంగా నిలిచిపోయింది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో రెంటల్ విధానంలో స్ట్రీమింగ్‍కు అందుబాటులో ఉంది.
ది నోట్‍బుక్
ర్యాన్ గోస్లింగ్, రేచల్ మెక్‍ఆడమ్స్ లీడ్ రోల్స్ పోషించిన ది నోట్‍బుక్ కూడా భావోద్వేగాలతో సాగే లవ్ స్టోరీ. యుద్ధం, సామాజిక అసమానతల వల్ల విడిపోయి వేదన అనుభవించే ఓ ప్రేమ జంట కథతో ఈ మూవీ తెరకెక్కింది. 2004లో వచ్చిన ఈ చిత్రం భారీ హిట్ సాధించింది. ఈ మూవీకి నిక్ కాసావెటెస్ దర్శకత్వం వహించారు. ది నోట్‍బుక్ చిత్రాన్ని నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో రెగ్యులర్ స్ట్రీమింగ్ చూడొచ్చు.
ది పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్
హాలీవుడ్ బయోగ్రాఫికల్ డ్రామా చిత్రం ది పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్ (2006) కన్నీళ్లు తెప్పించే రేంజ్‍లో ఎమోషనల్‍గా ఉంటుంది. ఈ మూవీలో విల్ స్మిత్, జాడెన్ స్మిత్ ప్రధాన పాత్రలు పోషించారు. నిజజీవితంలో తండ్రీకొడుకులైన వీరు.. ఈ చిత్రంలోనూ అవే పాత్రలు పోషించారు. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను క్రిస్ గార్డెన్ (విల్ స్మిత్) ఎదుర్కొంటూ ఉంటాడు. భార్య కూడా వదిలేయగా.. తన ఐదేళ్ల కుమారుడిని జాగ్రత్తగా చూసుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. తన కష్టాలను కొడుక్కి తెలియకుండా మదన పడుతుంటాడు. జీవితంలో ఎప్పుడైనా గెలుస్తాననే నమ్మకంతో జీవనం సాగిస్తుంటాడు. ఈ క్రమంలో చాలా సవాళ్లను ఎదుర్కొంటాడు. ఈ తండ్రీకొడుకుల జర్నీ ప్రేక్షకుల కళ్లను చెమరుస్తుంది. ఈ చిత్రానికి గాబ్రియెల్ ముసినో దర్శకత్వం వహించారు. ది పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్ చిత్రాన్ని జీ5 ఓటీటీలో చూడొచ్చు.
ది పియానిస్ట్
ఆడ్రియన్ బ్రాడీ ప్రధాన పాత్రలో ది పియానిస్ట్ (2002) మూవీ వచ్చింది. రెండో ప్రపంచ యుద్ధం కారణంగా కుటుంబంతో విడిపోయి చాలా కష్టాలను ఎదుర్కొనే ఓ పాపులర్ మ్యూజిషియన్ చుట్టూ ఈ ఎమోషనల్ బయోగ్రాఫికల్ చిత్రం సాగుతుంది. ఈ చిత్రం కమర్షియల్‍గా బ్లాక్‍బస్టర్ అవటంతో పాటు చాలా అవార్డులను దక్కించుకుంది. ది పియానిస్ట్ మూవీకి రోమాన్ పోలాన్‍స్కి దర్శకత్వం వహించారు. భావోద్వేగపూరితంగా తెరకెక్కించారు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో రెంటల్ విధానంలో అందుబాటులో ఉంది.
ది బీచ్
అడ్వెంచర్ డ్రామా మూవీ ది బీచ్ (2000) కూడా ఎమోషనల్‍గా సాగుతుంది. లినార్డో డికాప్రియో లీడ్ రోల్ చేసిన ఈ చిత్రానికి డానీ బోయ్లే దర్శకత్వం వహించారు. థాయ్‍లాండ్ సమీపంలో సముద్రం మధ్యలో ఉండే ఓ విలాసవంతమైన దీవికి వెళ్లిన వ్యక్తి ఎదుర్కొనే మానసిక సంఘర్షణ, సవాళ్ల చుట్టూ ఈ మూవీ సాగుతుంది. ది బీచ్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో రెంటల్ విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది.
సంబంధిత కథనం