



Best Web Hosting Provider In India 2024
SWAYAM Portal For English : ఇంగ్లిష్ నేర్చుకోవడానికి స్వయం పోర్టల్‌లో ఈ కోర్సులు ఉచితం
SWAYAM Portal For English : ఇటీవలి కాలంలో ఇంగ్లీష్ అనేది అనివార్యమైంది. కెరీర్ కోసం ఎక్కడికి వెళ్లినా ఇంగ్లీష్‌లోనే కమ్యునికేట్ చేయాల్సి వస్తుంది. మీరు కూడా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే SWAYAM పోర్టల్ ఉపయోగపడుతుంది.

జాబ్ మార్కెట్‌లో కెరీర్ ఎదుగుదలకు ఇంగ్లిష్‌లో ప్రావీణ్యం ఉండటం చాలా ముఖ్యం. ఇంగ్లిష్‌ను మెరుగుపరిచే అనేక యాప్స్, వెబ్‌సైట్స్ ఉన్నాయి. SWAYAM పోర్టల్‌లో అందుబాటులో ఉన్న ఇంగ్లీష్ లెర్నింగ్ కోర్సులు చాలా ప్రాచుర్యం పొందాయి, ప్రభావవంతంగా ఉన్నాయి. ఈ కోర్సులు పూర్తిగా ఉచితం. అలాగే వివిధ అవసరాలు, స్థాయిలను బట్టి.. మీరు బేసిక్ నుండి ఇంగ్లిష్ నేర్చుకోవడం ప్రారంభిస్తే కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. అడ్వాన్స్డ్ స్థాయి ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే.. అన్ని కోర్సులు పోర్టల్లో దొరుకుతాయి. డైలీ లైఫ్, వర్క్ ప్లేస్, ఎంప్లాయిమెంట్, కమ్యూనికేషన్, కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కొరకు విభిన్న కోర్సులను మీరు ఇక్కడ చూడవచ్చు. swayam.gov.in పోర్టల్ ను సందర్శించడం ద్వారా మీరు ఈ కోర్సులను చేయవచ్చు.
ఉపాధి కోసం ఆంగ్ల వ్యాకరణం
ఈ కోర్సు ఆంగ్ల వ్యాకరణానికి ఒక ఆచరణాత్మక విధానం. ఇది ఆంగ్ల వ్యాకరణం, మౌఖిక సామర్థ్యం ముఖ్యమైన విషయాలను కవర్ చేస్తుంది. ఇందులో ఫండమెంటల్స్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్, ఫంక్షనల్ ఇంగ్లీష్ గ్రామర్, వర్డ్ ఫార్మేషన్ మొదలైన అంశాలు ఉంటాయి. కోర్సు వ్యవధి మీరు నేర్చుకనేదాని ఆధారంగా ఉంటుంది.
సెకండరీ ఇంగ్లీష్
ఈ కోర్సు అభ్యాసకులలో కమ్యూనికేషన్ నైపుణ్యాలు, అధ్యయన నైపుణ్యాలు, సాహిత్య నైపుణ్యాలతోపాటుగా వివిధ అంశాలను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది భాష, వ్యాకరణం, వాడుక, పదజాలం వంటి అంశాలపై కూడా దృష్టి పెడుతుంది. నమోదుకు చివరి తేదీ మార్చి 31, 2025 వరకు ఉంది.
సీనియర్ సెకండరీ ఇంగ్లీష్
ఈ కోర్సు వైద్యం, ఇంజనీరింగ్, విద్యతో సహా అనేక రంగాలలో వివిధ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునేలా చేస్తుంది. పదజాలాన్ని పెంచుకోవడానికి ప్రత్యేక ప్రయత్నాలు చేయడం దీని లక్ష్యం. నమోదుకు చివరి తేదీ మార్చి 31, 2025గా ఉంది.
వివిధ విషయాలలో ఉచిత కోర్సులను అందించడానికి భారత ప్రభుత్వం SWAYAMను ప్రారంభించింది. కోర్సు వ్యవధి కూడా ఉంటుంది. ఈ కోర్సులు చేయడం ద్వారా మీ దైనందిన జీవితంలో ఇంగ్లిష్ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ స్కిల్స్‌ను మెరుగుపరుచుకోవచ్చు. రోజువారీ జీవితంలో ఇంగ్లిష్ ఉపయోగించడంలో మీ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి సహాయపడుతుంది. ఆఫీసులోని ప్రొఫెషనల్ వాతావరణానికి అవసరమైన ఇంగ్లిష్ నేర్చుకుంటారు. ఇంగ్లిష్‌లో వెర్బల్, నాన్ వెర్బల్, రాతపూర్వక, ప్రొఫెషనల్ కమ్యూనికేషన్ స్కిల్స్‌ను మెరుగుపరుచుకోవచ్చు.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link