



Best Web Hosting Provider In India 2024
All England- PV Sindhu: ప్రైవేట్ జెట్ లో టోర్నీకి.. కట్ చేస్తే ఫస్ట్ రౌండ్లోనే షాక్.. ఆల్ ఇంగ్లండ్ నుంచి పీవీ సింధు ఔట్
All England- PV Sindhu: ప్రతిష్ఠాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో భారత స్టార్ పీవీ సింధు పోరాటం ముగిసింది. తొలి రౌండ్లోనే ఆమె తక్కువ ర్యాంకు ప్లేయర్ చేతిలో షాకింగ్ ఓటమి చవిచూసింది.

భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు షాక్. ఎన్నో అంచనాలతో ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ బరిలో దిగిన సింధు తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. తక్కువ ర్యాంకు క్రీడాకారిణి చేతిలో పరాజయం పాలైంది. బుధవారం (మార్చి 12) సింధు 21-19, 13-21, 13-21 తేడాతో కిమ్ గా యున్ (కొరియా) చేతిలో ఓటమి పాలైంది.
తొలి గేమ్ గెలిచినా
ప్రపంచ 16వ ర్యాంకర్ పీవీ సింధు ఈ పోరును మెరుగ్గానే మొదలెట్టింది. కండరాల గాయం నుంచి కోలుకుని ఈ టోర్నీలో అడుగుపెట్టిన ఆమె ఫస్ట్ దూకుడు ప్రదర్శించింది. తొలి గేమ్ ను 21-19తో గెలుచుకుంది. కిమ్ పై సింధు ఆధిపత్యం ప్రదర్శించింది. తనదైన శైలిలో స్మాష్ లతో సత్తాచాటింది. ఈ గేమ్ టఫ్ గానే సాగినా కీలక సమయంలో సింధు అప్పర్ హ్యాండ్ సాధించింది.
రిథమ్ కోల్పోయి
తొలి గేమ్ ను గెలిచి మ్యాచ్ ను గొప్పగా మొదలెట్టిన సింధు విజయం సాధించేలా కనిపించింది. కానీ రెండో గేమ్ నుంచి సింధు రిథమ్ మిస్సయింది. ప్రపంచ 21వ ర్యాంకర్ కిమ్ ముందు సింధు తేలిపోయింది. కనీసం టఫ్ కాంపిటిషన్ ఇవ్వలేకపోయింది. అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. 13-21తో గేమ్ చేజార్చుకుంది.
మూడో గేమ్ కూడా
నిర్ణయాత్మక మూడో గేమ్ లోనూ సింధు ఆటతీరు ఏ మాత్రం మారలేదు. కిమ్ ముందు సింధు ఆటలు సాగలేదు. సేమ్ రెండో గేమ్ లో లాగే మూడో గేమ్ లోనూ సింధు పనైపోయింది. నెట్ కు షటిల్ ను కొట్టడం, కోర్టు బయటకు పంపడంతో పాయింట్లు సమర్పించుకుంది. 13-21తో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీంతో సింధు ఆల్ ఇంగ్లండ్ టైటిల్ ఆశలు మరోసారి ఆవిరయ్యాయి.
రాయల్ గా ఎంట్రీ
ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ కోసం సింధు ప్రైవేట్ జెట్ లో వెళ్లడం వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. సొంతంగా ప్రైవేట్ జెట్ లో సింధు ఇంగ్లండ్ కు వెళ్లింది. అందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అయ్యాయి. కానీ టోర్నీలో తొలి రౌండ్లోనే ఓడి సింధు ఇంటిముఖం పట్టింది.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link