Guntur Army Rally: గుంటూరులో అగ్నివీర్‌ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ, తొలిసారి ఆర్మీ నియామక పరీక్ష తెలుగులో..

Best Web Hosting Provider In India 2024

Guntur Army Rally: గుంటూరులో అగ్నివీర్‌ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ, తొలిసారి ఆర్మీ నియామక పరీక్ష తెలుగులో..

Sarath Chandra.B HT Telugu Published Mar 13, 2025 05:00 AM IST
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Twitter
  • Share on Facebook
Sarath Chandra.B HT Telugu
Published Mar 13, 2025 05:00 AM IST

Guntur Army Rally: భారత రక్షణ దళాల్లో అగ్నివీర్‌ నియామకాల కోసం రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్ విడుదలైంది. గుంటూరులోని ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ఆఫీస్ పరిధిలో 13 జిల్లాలకు సంబంధించిన అభ్యర్థుల నమోదు ప్రక్రియను చేపడుతున్నట్టు ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ఆఫీస్ డైరక్టర్ కల్నల్ పునీత్ కుమార్ ప్రకటించారు.

అగ్నివీర్‌ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ నోటిఫికేషన్‌
అగ్నివీర్‌ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ నోటిఫికేషన్‌
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on twitter
  • Share on Facebook

Guntur Army Rally: భారత సాయుధ బలగాల్లో నియామకాల కోసం కేంద్రం ప్రవేశపెట్టిన అగ్నివీర్‌ రిక్రూట్‌మెంట్‌కు నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీలోని 13 జిల్లాలకు చెందిన అభ్యర్థులకు గుంటూరు ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్ పరిధిలో నియామకాలు జరుగనున్నాయి.

అగ్నివీర్‌ ఉద్యోగాలకు ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలకు చెందిన అభ్యర్థుల కోసం అగ్నివీర్ సిబ్బంది నియామకాలలో 2025-26 ఏడాదికి నమోదును ప్రారంభించింది.

వివిధ కేటగిరీల అగ్నివీర్ల నియామకం కోసం https://www.joinindianarmy.nic.in/default.aspx ద్వారా నమోదు చేసుకోవచ్చు. అభ్యర్థులు ర్యాలీలో పాల్గొనడానికి నమోదు చేయడానికి చివరి తేదీ 10 ఏప్రిల్ 2025. ఒక అభ్యర్థి ఇప్పుడు రెండు వేర్వేరు అగ్నివీర్ కేటగిరీలకు దరఖాస్తు చేసుకోవచ్చని రిక్రూట్‌మెంట్ ఆఫీస్ వివరించింది.

తొలిసారి తెలుగులో ప్రవేశ పరీక్ష…

అగ్నివీర్‌ నియామకాలను ఆన్‌లైన్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సీఈఈ) ద్వారా చేపడతారు. మొట్ట మొదటిసారిగా తెలుగుతో సహా 13 వేర్వేరు భాషల్లో నిర్వహిస్తున్నారు. అభ్యర్థులు 1.6 కిలోమీటర్ల పరుగు సమయాన్ని 06 నిమిషాలు 15 సెకన్లకు పెంచారు.

అన్ని కేటగిరీలలోన ఎన్‌సీసీ ‘ఎ’, ‘బి’ ‘సి’ సర్టిఫికెట్ కలిగిన వారికి మరియు ప్రతిభావంతులైన క్రీడాకారులకు, అలాగే అగ్నివీర్ టెక్నికల్ కేటగిరీ కోసం ఐటిఐ/డిప్లొమా అర్హత కలిగిన అభ్యర్థులకు అదనపు మార్కులు కూడా ఇస్తారు.

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, కర్నూలు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, అనంతపురము, వైఎస్‌ఆర్ కడప, ప్రకాశం, చిత్తూరు, బాపట్ల, పలనాడు, నంద్యాల, తిరుపతి, అన్నమయ్య మరియు శ్రీ సత్యసాయి జిల్లాలకు చెందిన ఆసక్తిగల అభ్యర్థులందరూ అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ కార్యాలయ సహాయకులు/స్టోర్ కీపర్ టెక్నికల్ మరియు అగ్నివీర్ వృత్తి నిపుణుల పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

డబ్బులు చెల్లించవద్దు…

నియామక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా ఉంటుంది. కావున, అగ్నివీర్‌గా సైన్యంలో నియామకం కోసం దళారులకు డబ్బులు చెల్లించవద్దని గుంటూరు ఆర్మీ రిక్రూట్‌మెంట్ ఆఫీస్ డైరెక్టర్‌ కల్నల్‌ పునీత్‌ కుమార్ సూచించారు.

Sarath Chandra.B

TwittereMail
శరత్‌ చంద్ర హిందుస్థాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. ఈనాడు, ఎన్టీవి, టీవీ9, హెచ్‌ఎంటీవి, ఎక్స్‌ప్రెస్‌ టీవీ, టీవీ5లలో పని చేశారు. 2010-14 మధ్యకాలంలో హెచ్‌ఎంటీవీ, మహా టీవీలో ఢిల్లీ బ్యూరో చీఫ్‌/అసిస్టెంట్‌ ఎడిటర్‌గా పనిచేశారు. నాగార్జున వర్శిటీ క్యాంపస్ కాలేజీలో జర్నలిజంలో పట్టభద్రులయ్యారు. 2022లో హెచ్‌టీలో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్

GunturIndian ArmyRecruitmentIndian AirforceAndhra Pradesh News
Source / Credits

Best Web Hosting Provider In India 2024