






Best Web Hosting Provider In India 2024

Court: ఏపీ, తెలంగాణలో వందల పోక్సో కేసులు ఉన్నాయి.. 8 నెలలు ఎదురుచూశాను.. నాని కోర్ట్ డైరెక్టర్ రామ్ జగదీష్ కామెంట్స్
Court Movie Director Ram Jagadeesh About Nani And Pocso Act Cases: నేచురల్ స్టార్ నాని సమర్పించిన లేటెస్ట్ తెలుగు మూవీ కోర్ట్ స్టేట్ వర్సెస్ ఏ నోబడీ. మార్చి 14న ఈ మూవీ విడుదల కానున్న సందర్భంగా మీడియా విలేకరులతో ఇంట్రెస్టింగ్ విశేషాలు పంచుకున్నారు కోర్ట్ డైరెక్టర్ రామ్ జగదీష్.

Court Director Ram Jagadeesh About Nani And Pocso Act Cases: నేచురల్ స్టార్ నాని సమర్పిస్తున్న లేటెస్ట్ తెలుగు చిత్రం ‘కోర్ట్: స్టేట్ వర్సెస్ ఏ నోబడీ’. కోర్ట్ రూమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాను వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించగా.. దీప్తి గంటా సహా నిర్మాతగా ఉన్నారు.
ఇంట్రెస్టింగ్ విశేషాలు
ప్రియదర్శి, రోషన్, శ్రీదేవి, బిగ్ బాస్ శివాజీ, హర్షవర్ధన్, సాయి కుమార్, సురభి తదితురులు నటించిన కోర్ట్ మూవీకి రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. కోర్ట్ స్టేట్ వర్సెస్ ఏ నోబడీ సినిమా మార్చి 14న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మీడియా విలేకరుల సమావేశంలో కోర్ట్ డైరెక్టర్ రామ్ జగదీష్ ఇంట్రెస్టింగ్ విశేషాలు పంచుకున్నారు.
జగదీష్ గారు ఈ కథ చేయడానికి మీకు స్ఫూర్తి?
-ఈ కథ పోక్సో యాక్ట్ నేపథ్యంలో ఉంటుంది. నిజ జీవితంలో ఇలాంటి ఒక కేసుని నేను పరిశీలించాను. ఆ కేసు గురించి తెలుసుకున్నప్పుడు నిజంగా ఇలా కూడా ఉంటుందా అని సందేహంగా అనిపించింది. ఇలాంటి కేసులు ఇంకా చాలా ఉన్నాయని తెలిసింది. ఆ కేసులు అన్నిటి మీద కూడా రీసెర్చ్ చేశాను.
-ఏపీ తెలంగాణలో వందల కేసులు (పోక్సో యాక్ట్) ఉన్నాయి. ఇవన్నీ స్క్రీన్ మీద అడ్రస్ చేస్తే బాగుంటుంది కదా అనిపించింది. ఈ కథ కోసం చాలా కేసు ఫైల్స్ చదివాను. అన్ని కేస్ ఫైల్స్‌లో ఉన్న మెటీరియల్‌తో ఒక మంచి కథ చెప్పొచ్చు కదా అనిపించింది. అవన్నీ ఒక కథగా చేసి స్క్రీన్‌పై చూపించడం జరిగింది.
-ఇది పర్టికులర్ ఒక పర్సన్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్‌కి సంబంధించిన కథ కాదు. చాలా సంఘటనల స్ఫూర్తి ఉంది. ఇది కంప్లీట్‌గా ఫిక్షనల్ కథ. చదివిన కేసుల ఎసెన్స్‌తో ఒక ఫిక్షనల్ స్టోరీ చేయడం జరిగింది. ఈ సినిమా కోసం పోక్సో యాక్ట్ గురించి క్షుణ్ణంగా చదువుకున్నాను. కోర్టు, లా, పోలీస్‌కి సంబధించిన చాలా మందిని కలసి చాలా విషయాలు గ్యాదర్ చేశాను.
నాని గారికి కథ చెప్పడం ఎలా అనిపించింది?
–నాని గారికి కథ చెప్పడం వెరీ హ్యాపీ మూమెంట్. ఆయనకి కథ చెప్పడానికి దాదాపు 8 నెలలు ఎదురుచూశాను. ఫైనల్‌గా ఆయన కథ వినే మూమెంట్ వచ్చింది. ఆయన కథ విన్న విధానం చూసి నాకు చాలా ఆనందంగా అనిపించింది. దాదాపు రెండున్నర గంటల కథని సింగిల్ సిటింగ్‌లో విన్నారు. కథ మొత్తం విని నిల్చుని షేక్ హ్యాండ్ ఇచ్చి ‘వెల్కమ్ టు వాల్ పోస్టర్ సినిమా’ అన్నారు. అది నా జీవితంలో హై మూమెంట్. అది నిజంగా గ్రేట్ ఎక్స్‌పీరియన్స్
చాలా కోర్ట్ రూమ్ డ్రామాలు వచ్చాయి కదా. ఈ సినిమా ఎంత ప్రత్యేకంగా ఉండనుంది?
-చాలా కోర్ట్ రూమ్ డ్రామాలు చూశాం. కానీ, ఒక లవ్ స్టోరీని కోర్ట్ రూమ్ డ్రామాగా ఎప్పుడు చూడలేదని భావిస్తున్నాను. ఇందులో లవ్ స్టోరీ, కోర్ట్ రూమ్ డ్రామా చాలా ప్రత్యేకంగా ఉంటాయి.
సంబంధిత కథనం