Guppedantha Manasu Jagathi: గుప్పెడంత మ‌న‌సు జ‌గ‌తి క‌న్న‌డ మూవీకి స్టేట్ బెస్ట్ ఫిల్మ్ అవార్డు – ఏ ఓటీటీలో చూడాలంటే?

Best Web Hosting Provider In India 2024

Guppedantha Manasu Jagathi: గుప్పెడంత మ‌న‌సు జ‌గ‌తి క‌న్న‌డ మూవీకి స్టేట్ బెస్ట్ ఫిల్మ్ అవార్డు – ఏ ఓటీటీలో చూడాలంటే?

Jyothi Rai: గుప్పెడంత మ‌న‌సు ఫేమ్ జ్యోతిరాయ్ హీరోయిన్‌గా న‌టించిన క‌న్న‌డ మూవీ వ‌ర్ణ‌ప‌ట‌ల క‌ర్ణాట‌క స్టేట్ ఫిల్మ్స్ అవార్డుల్లో స‌త్తా చాటింది. సెకండ్ బెస్ట్ ఫిల్మ్‌గా అవార్డును గెలుచుకుంది. తాను లీడ్ రోల్‌లో న‌టించిన మూవీకి అవార్డు రావ‌డం ప‌ట్ల జ్యోతిరాయ్ ఆనందాన్ని వ్య‌క్తం చేసింది.

 

గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ ఫేమ్ జ్యోతిరాయ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన క‌న్న‌డ మూవీ వ‌ర్ణ ప‌టల క‌ర్ణాట‌క స్టేట్‌ బెస్ట్ ఫిల్మ్ అవార్డు గెలుచుకుంది. 2020 ఏడాదికిగాను క‌ర్ణాట‌క స్టేట్ ఫిల్మ్ అవార్డుల‌ను బుధ‌వారం ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఈ అవార్డుల్లో బెస్ట్ సెకండ్ ఫిల్మ్‌గా వ‌ర్ణ‌ప‌ట‌ల సినిమా పుర‌స్కారం గెల‌చుకుంది.

 

జ్యోతిరాయ్ హీరోయిన్‌…

మెడిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీలో జ్యోతిరాయ్ హీరోయిన్‌గా న‌టించింది. సుహాసిని మ‌ణిర‌త్నం, అనూప్ సాగ‌ర్ కీల‌క పాత్ర‌లు పోషించారు. 2020లో థియేట‌ర్ల‌లో రిలీజైన వ‌ర్ణ‌ప‌టల మంచి సినిమాగా క్రిటిక్స్‌తో పాటు ఆడియెన్స్‌ను మెప్పించింది.

గ‌ర్వంగా ఉంది….

వ‌ర్ణ‌ప‌ట‌ల మూవీకి బెస్ట్ మూవీగా అవార్డు రావ‌డం ప‌ట్ల జ్యోతిరాయ్ ఆనందాన్ని వ్య‌క్తం చేసింది. తాను మెయిన్ లీడ్‌లో న‌టించిన మూవీకి అవార్డు రావ‌డం గ‌ర్వంగా, గౌర‌వంగా ఉంద‌ని జ్యోతిరాయ్ అన్న‌ది. వ‌ర్ణ‌ప‌ట‌ల అర్థ‌వంత‌మైన‌, ఆలోచ‌న‌ను రేకెత్తించే మంచి సినిమా అని పేర్కొన్న‌ది. ఈ సినిమాలో అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది. ద‌ర్శ‌కుడు ఏపీ అర్జున్ వ‌ల్లే వ‌ర్ణ ప‌ట‌ల మూవీలో న‌టించే ఛాన్స్ వ‌చ్చింద‌ని ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో జ్యోతిరాయ్ పేర్కొన్న‌ది. ఇది ఆరంభం మాత్ర‌మేన‌ని, ఇంకా చేయాల్సిన పాత్ర‌లు, సాధించాల్సిన అవార్డులు చాలానే ఉన్నాయంటూ తెలిపింది.

ఆటిజం స‌మ‌స్య‌తో…

ఆటిజం స‌మ‌స్య‌పై సందేశాత్మ‌కంగా ద‌ర్శ‌కుడు చేత‌న్ ఈ మూవీని తెర‌కెక్కించాడు. ఆటిజం వ్యాధితో బాధ‌ప‌డుతున్న త‌న కూతురిని కాపాడుకోవ‌డానికి ఓ త‌ల్లి ఎలాంటి పోరాటం చేసింది? ఒంట‌రిగా సాగించిన ఈ జ‌ర్నీలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర‌య్యాయి అన్న‌దే ఈ మూవీ క‌థ‌. వ‌ర్ణ‌ప‌ట‌ల మూవీ జీ5 ఓటీటీలో క‌న్న‌డ వెర్ష‌న్ అందుబాటులో ఉంది.

 

కిల్ల‌ర్‌…థ్రిల్ల‌ర్‌…

ప్ర‌స్తుతం జ్యోతిరాయ్ తెలుగులో ఏ మాస్ట‌ర్ పీస్‌తో పాటు కిల్ల‌ర్ సినిమాలు చేస్తోంది. కిల్ల‌ర్ మూవీలో హీరోయిన్‌గా న‌టిస్తోంది. థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు జ్యోతిరాయ్ భ‌ర్త సుకుపూర్వ‌జ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. అత‌డే హీరోగా న‌టిస్తున్నాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్యాక్‌డ్రాప్‌లో రొమాంటిక్ రివేంజ్ థ్రిల్ల‌ర్‌గా కిల్ల‌ర్ మూవీ రూపుదిద్దుకుంటున్న‌ట్లు మేక‌ర్స్ వెల్ల‌డించారు. ఇందులో జ్యోతిరాయ్ కిల్ల‌ర్‌గా, మోడ్ర‌న్ గ‌ర్ల్‌గా డిఫ‌రెంట్ షేడ్స్‌తో కూడిన క్యారెక్ట‌ర్‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. తెలుగులో హీరోయిన్‌గా జ్యోతిరాయ్ ఫ‌స్ట్ మూవీగా కిల్ల‌ర్ రిలీజ్ కానుంది.

క‌న్న‌డంలో…

క‌న్న‌డంలో దియా, స‌ప్ల‌య‌ర్ శంక‌ర్‌, వ‌ర్ణ ప‌ట‌ల‌, దియా, నైట్ రోడ్‌తో పాటు మ‌రికొన్ని సినిమాలు చేసింది జ్యోతిరాయ్‌. క‌న్న‌డ‌, తెలుగు భాష‌ల్లో 15కుపైగా సీరియ‌ల్స్‌లో న‌టించింది. తెలుగులో గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ జ్యోతిరాయ్‌కి మంచి పేరు తెచ్చిపెట్టింది. కొన్నాళ్లుగా సినిమాలు, వెబ్‌సిరీస్‌ల‌పై ఫోక‌స్ పెట్టిన జ్యోతిరాయ్ సీరియ‌ల్స్‌కు దూర‌మైంది.

 

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024