Brahmamudi March 13th Episode: రాజ్‌ను చూసేసిన కావ్య.. కళావతిని హాస్పిటల్‌లో చేర్పించిన రామ్.. ఇంటివారసుడిగా రాహుల్!

Best Web Hosting Provider In India 2024

Brahmamudi March 13th Episode: రాజ్‌ను చూసేసిన కావ్య.. కళావతిని హాస్పిటల్‌లో చేర్పించిన రామ్.. ఇంటివారసుడిగా రాహుల్!

 

Brahmamudi Serial March 13th Episode: బ్రహ్మముడి మార్చి 13 ఎపిసోడ్‌లో రాజ్‌ను దూరం చేసి దేవుడు రాహుల్‌కు ఉన్న అడ్డు తొలగించాడని, ఇంటి వారసుడిగా రాహుల్‌ను చేస్తానని రుద్రాణి చెబుతుంది. ఇంట్లో అందరికి కావ్య భోజనం పెడుతుంది. కానీ, ఎవరు తినకుండా అంతా లేచి వెళ్లిపోతారు. రోడ్డుపై రాజ్‌ను కావ్య చూస్తుంది.

 

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో రాజ్ ఇక మనకు లేడు.. లేడు. కావ్యల కాకుండా నిజాన్ని చూడండి అని రుద్రాణి అంటుంది. దాంతో ఏడుస్తూ అపర్ణ వెళ్లిపోతుంది. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా. కొడుకును పోగొట్టుకుని ఆ తల్లి ఏడుస్తుంటే నీ మాటలతో రాబందులా పీక్కుతింటున్నావ్. ఇంతకంటే మనుషులను చంపేయడమే మంచిదే ఛీ ఛీ. మనిషి పుట్టుక పుట్టావ్. ఎందుకే ఛీ.. అని వెళ్లిపోతుంది ఇందిరాదేవి.

 

నేను మంచి తల్లిని

నువ్వింకా మారవు అని ప్రకాశం అనేసి వెళ్లిపోతాడు. అందరూ వెళ్లిపోతారు. నువ్ పనికిరాని పనులు చేస్తున్నా. నీలో ఎక్కడోచోట మానవత్వం ఉందనుకున్నా. ప్రతిసారీ రాంగ్ అని ప్రూవ్ అని చేస్తున్నావ్. ఇలా బతకడం కన్నా చావడం మేలు అని స్వప్న వెళ్లిపోతుంది. అనవసరంగా వాగి అమ్మమ్మతో చెంపదెబ్బ తిన్నావ్. సైలెంట్‌గా ఉండొచ్చు కదా అని రాహుల్ అంటాడు. చెంపదెబ్బ కొట్టిందని ఫీల్ అవుతున్నావా. అవన్నీ మన డిక్షన్‌లో లేవు అని రుద్రాణి అంటుంది.

వాళ్లకు నేను చెడ్డదానిలా కనిపించొచ్చు. కానీ, నేను ఒక మంచి తల్లిని. నా కొడుకు బంగారు బాటకోసం శ్రమించే శ్రామికురాలిని. ఆ దేవుడు రాజ్‌ను దూరం చేసి నీకున్న అడ్డును తొలగించాడు. ఇక నిన్ను ఇంటి వారసుడిగా చేయడానికి గొప్ప అవకాశం దొరికింది. దీన్ని మాత్రం వదిలిపెట్టను అని రుద్రాణి అంటుంది. మరోవైపు రాజ్‌కు గుర్తుకు రావడం గురించి యామిని, తల్లిదండ్రులు మాట్లాడుకుంటున్నారు. ఇది గతం అయితే కదా గుర్తుకురావడానికి అభూత కల్పన, ఒక మాయాలోకంలోకి అడుగుపెడితే ఎలా ఉంటుందో అలా ఫీల్ అవుతున్నాడు అని యామిని తండ్రి అంటాడు.

మీకు చాలా కోపంగా ఉన్నట్లుందని యామిని అంటే.. జాలిగా ఉందని తండ్రి అంటాడు. నిజంగా రాజ్‌కు గతం గుర్తుకు వస్తే జీవితంలో నన్ను రానివ్వడు. కేవలం గతం గుర్తుకు తెప్పిస్తున్నట్లు నటిస్తున్నాను అంతే. రాజ్‌ను రామ్‌గా నటించడానికి ఎక్కువ సమయం పట్టదు అని యామిని అంటుంది. నువ్ ఏదైనా చేయగలవు కానీ, మనుషులతో ఆడుకోలేవు. వాళ్ల ఎమోషన్స్‌తో ఆడుకోలేవు. నీలా నమ్మించలేను. నన్ను ఇన్వాల్వ్ చేయకు అని తండ్రి అంటాడు.

 

మత్తుకు బానిస

కాలేజీ రోజుల్లో ఇలాగే చేసింది. అది నిప్పు అమ్మా కాలుతుంది అంటే వినలేదు. మత్తుకు బానిస అయింది. ఇప్పుడు ఇంతపెద్ద సమస్యను తీసుకొచ్చి ఇంట్లో పెట్టింది. ఇంకొకరి సౌభాగ్యం, సుఖం పక్కన పెట్టాలా. అక్కడ రాజ్ కనపడక తన భార్య, తల్లిదండ్రులు, కుటుంబం రాజ్ చనిపోయాడనుకుని గుండెపగిలేలా దుఖం అనుభవిస్తున్నారు అని తండ్రి అంటాడు. నాకు రాజ్ కావాలి. అందుకోసం ఎంత దూరమైన వెళ్తాను. ఎన్ని సమస్యలైన ఎదుర్కొంటాను. మీరు చెప్పే నీతి మాటలు అనవసరం. నాకు రాజ్ తప్ప ఎవ్వరు ఏమైపోయినా ఐ డోంట్ కేర్ అని యామిని వెళ్లిపోతుంది.

మరోవైపు అందరికి వంట వండుతుంటుంది కావ్య. అది చూసి కావ్యకు చీమ కుట్టినట్లు కూడా లేదు అని రుద్రాణి అంటుంది. ఒకవేళ కావ్య నమ్మకమే నిజమైతే అని రాహుల్ డౌట్ పడతాడు. రేయ్ రాజ్ తిరిగి రాడు. రాకూడదు. అలా అయితేనే నువ్ ఇంటికి వారసుడువి అవుతావ్ అని రుద్రాణి అంటుంది. నాకు కూడా ఆశగానే ఉంది. కానీ, కొంచెం బాధగా ఉంది. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం. ఇంట్లో అంతా తిట్టిన రాజ్ మాత్రం ఏమనలేదు అని రాహుల్ అంటాడు.

 

వంట రెడీ అందరూ రండి అని కావ్య పిలుస్తుంది. కావ్యకు వీళ్ల ఎమోషన్స్‌తో సంబంధం లేదా లేదా అని రుద్రాణి అంటే.. ఇప్పుడేం అనకు మమ్మీ. కొట్టి తరిమేస్తారు. మళ్లీ ఆ సన్మానం ఎందుకు లైట్ తీసుకో అని రాహుల్ అంటాడు. మళ్లీ కావ్య అందరిని పిలుస్తుంది. మాకు ఆకలిగా లేదు. నువ్వు తిను అని ఇందిరాదేవి అంటుంది. ఎందుకమ్మా అబద్ధం చెబుతావ్. రాజ్ తిరిగి రాడు, అందుకే తినబుద్ధి కావట్లేదని చెప్పు అని రుద్రాణి అంటుంది.

ఎందుకు తలదూరుస్తావ్

అమ్మమ్మకు ఏం చెప్పాలో తెలియదు. ఎందుకు అన్నింట్లో తలదూరుస్తావ్ అని రాహుల్ అంటాడు. రుద్రాణి గారు చెప్పింది నమ్ముతున్నారా. కానీ, నాకు తెలుస్తుంది. ఆయన ఎక్కడో బతికే ఉన్నారు. రేపో మాపో స్పృహలోకి రాగానే మనగురించి చెబుతారు. హాస్పిటల్ నుంచి తీసుకొస్తారు. అసలు ఆయన లేరు అనేది మీ మనసులో నుంచి చెరిపేయండి. ఆయనొచ్చాక మీకే తెలుస్తుంది. అప్పుడు మీరే బాధపడుతారు. బతికి ఉన్న మనిషిని లేడని చెప్పామా అని బాధపడుతారు అని కావ్య అంటుంది.

ఏంటీ అందరూ నన్ను అదోలా చూస్తున్నారు. నేను బాగానే ఉన్నాను. బాగుండాలి కదా. ఆయన తిరిగి వస్తే బాధపడకూడదు కదా. సంతోషంగా ఉండాలి. నీ నమ్మకమే నిజమైందని అనాలి. నాకోసం కాకపోయినా ఆయన కోసం అయినా మీరు వచ్చి భోజనం చేయాలి అని మళ్లీ పిలుస్తుంది కావ్య. దాంతో అపర్ణ లేవండి. అందరం భోజనం చేద్దామని సుభాష్ అంటే.. గొంతుకు ఏదో అడ్డుపడ్డట్టుందని ప్రకాశం అంటాడు. అది దుఖంరా పదా అని సుభాష్ అంటాడు.

 

అపర్ణ రానని చెబుతుంది. నేను ఏదైనా నమ్మితో కచ్చితంగా జరుగుతుంది. రండి అని చేయి పట్టుకుని తీసుకొస్తుంది కావ్య. మరోవైపు రాజ్‌ యామిని వాళ్లతో భోజనం చేస్తుంటాడు. ఏంటీ రామ్ కొత్త ప్లేస్ కదా ఈవెనింగ్ నిద్ర పట్టిందా అని యామిని తండ్రి అంటాడు. దాంతో యామిని కవర్ చేయాలని చూస్తుంది. గతం మర్చిపోయాడు కదా. కొత్తగా ఉంటుందని ఉద్దేశం అని వైధేహి అంటుంది. బావ నీకోసం ఇష్టమని ఫిష్ కర్రీ, సాంబార్, చికెన్ చేశాను. నేను చేసిన ఫుడ్ టేస్ట్ చేయగానే నీకు గతం మొత్తం గుర్తుకు రావాలి అని యామిని అంటుంది.

వైధేహి అబద్ధాలు

ఇవన్నీ నాకిష్టమని నాక్కూడా గుర్తు లేదు. నాకోసం గుర్తుపెట్టుకుని నాకోసం చేశావ్. చాలా థ్యాంక్స్ అని రాజ్ అంటాడు. గతం మర్చిపోయినందుకు నువ్ బాధపడాల్సిన అవసరం లేదు. నేనున్నాను కదా. మనం అన్ని కోల్పోయిన మన ప్రేమించిన మనిషి మాత్రం మన పక్కనే ఉంటే చాలు. కోల్పోయినవన్నీ ఆ ప్రేమ రూపంలో దక్కుతాయ్ అని యామిని అంటుంది. దాంతో తల్లి కూడా నాటకం ఆడుతు అబద్ధాలు చెబుతుంది.

యామిని చుట్టు రాజే తిరిగినట్లుగా మాట్లాడుతారు. నీ గురించి కంప్లైంట్ చేసేవాడు అని తండ్రి అంటాడు. కానీ, అవన్ని బావకు గుర్తులేవు కదా. నా ప్రేమను కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు అని యామిని అంటుంది. అలా ఏం లేదు. నాకు అప్పుడే పుట్టిన పిల్లాడిలా ఉంది. అంతా బ్లాంక్‌లా ఉంది. నిజం చెప్పాలంటే చీకట్లో ఉన్నట్లుంది అని రాజ్ అంటాడు. అవునా బావా అని చెప్పిన యామిని లైట్స్ ఆఫ్ చేస్తుంది. చిన్న క్యాండిల్ వెలిగిస్తుంది.

 

చీకట్లో ఒంటరిగా ఉన్నట్లు నువ్ ఫీల్ అవుతున్నావ్‌గా. నీకు వెలుగులా ఎప్పుడు తోడుగా ఉంటాను. నా చేయి పట్టుకుని నడువు ఇద్దరం కలిసి వెలుగులోకి నడవచ్చు అని చేయి ఇస్తుంది యామిని. కాసేపటికి యామిని చేతిలో రాజ్ అయోమయంగానే చేయి వేస్తాడు. థ్యాంక్యూ యామిని అని రాజ్ చెబుతాడు. ఇప్పటికీ చాలా చెప్పావ్ బావా. కానీ, నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్న త్రీ మ్యాజికల్ వర్డ్స్ రావట్లేదు అని యామిని అంటుంది. తర్వాత నీకు గుర్తుకు వచ్చినప్పుడే చెప్పు. నేను వెయిట్ చేస్తాను అని యామిని అంటుంది.

అపర్ణ కన్నీళ్లు

తర్వాత లైట్స్ ఆన్ చేస్తుంది యామిని. మరోవైపు దుగ్గిరాల ఇంట్లో అందరు భోజనానికి కూర్చుంటారు. రాజ్‌కు కూడా కావ్య వడ్డిస్తే.. బావ ఇంకా రాలేదని అప్పు చెబుతుంది. అలవాటులో పొరపాటు అయింది. సరే ఇందులో నేనే వేసుకుంటాను అని కావ్య చెబుతుంది. అందరికి కావ్య భోజనం వడ్డిస్తుంది. అంతా కావ్యను బాధగా చూస్తారు. సుభాష్ తినమని చెబుతాడు. అపర్ణ ఏడుస్తూ ఉంటుంది. నీకున్న ఆత్మస్థ్మైర్యం లేదు. నాకు నమ్మకం లేదు అని తినకుండానే అపర్ణ ఏడుస్తూ వెళ్లిపోతుంది.

నన్ను క్షమించు కావ్య అని ఇందిరాదేవి, ప్రకాశం వెళ్లిపోతారు. తర్వాత అంతా లేచి వెళ్లిపోతారు. ఏంటిది మావయ్య అని కావ్య అంటే.. నన్ను క్షమించమ్మా అని సుభాష్ కూడా వెళ్లిపోతాడు. కల్యాణ్ కూడా వెళ్లిపోతాడు. తర్వాత రోడ్డు మీద కారులో వెళ్తూ రాజ్‌ను చూస్తుంది కావ్య. కారు ఆపమని రాజ్ కారు వెంటపడుతుంది. రాజ్ దగ్గరికి చేరుకోగానే స్పృహ తప్పి పడిపోతుంది కావ్య. అది చూసి కావ్యను రామ్‌గా హాస్పిటల్‌లో జాయిన్ చేస్తాడు రాజ్. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
 

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024