Leaked Online: రిలీజ్‌కు ముందే ఆన్‌లైన్‌లో లీక్ అయిన స్టార్ హీరో సినిమాలు.. మరి అవి హిట్టా? ఫట్టా?

Best Web Hosting Provider In India 2024

Leaked Online: రిలీజ్‌కు ముందే ఆన్‌లైన్‌లో లీక్ అయిన స్టార్ హీరో సినిమాలు.. మరి అవి హిట్టా? ఫట్టా?

Sanjiv Kumar HT Telugu
Published Mar 13, 2025 08:54 AM IST

Online Leaked Movies Before Theatrical Release: ఎన్నో ఏళ్ల తరబడి తెరకెక్కిన సినిమాలు అనూహ్యంగా థియేట్రికల్ రిలీజ్‌కు ముందే ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. వాటిలో ఎక్కువగా టాలీవుడ్ స్టార్ హీరో సినిమాలే ఉన్నాయి. మరి అలా విడుదలకు ముందు ఆన్‌లైన్‌లో లీక్ అయిన సినిమాలు హిట్ లేదా ఫ్లాప్ అయ్యాయో తెలుసుకుందాం.

రిలీజ్‌కు ముందే ఆన్‌లైన్‌లో లీక్ అయిన స్టార్ హీరో సినిమాలు.. మరి అవి హిట్టా? ఫట్టా?
రిలీజ్‌కు ముందే ఆన్‌లైన్‌లో లీక్ అయిన స్టార్ హీరో సినిమాలు.. మరి అవి హిట్టా? ఫట్టా?

Online Leaked Movies Before Theatrical Release: ఏళ్లకు ఏళ్లు వెచ్చించి ఎంతో కష్టపడి సినిమాలను తెరకెక్కిస్తుంటారు దర్శకనిర్మాతలు. వాటికోసం హీరో, హీరోయిన్స్ నుంచి కొన్ని వేల మంది కష్టపడుతుంటారు. అలాంటి సినిమాలు థియేట్రికల్ రిలీజ్ కాకుండేనే లీక్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి.

బాక్సాఫీస్ రిజల్ట్

వాటిలో ఎక్కువగా తెలుగులో చాలా పాపులర్ అయిన స్టార్ హీరోలే సినిమాలు ఉండటం గమనార్హం. అలా రిలీజ్‌కు ముందే లీక్ కావడంతో ఎన్నో సినిమాల ఫలితాలు మారిపోయాయి. వాటిలో కొన్ని హిట్ అయితే మరికొన్ని ప్లాప్‌గా నిలిచాయి. మరి అలా థియేట్రికల్ రిలీజ్‌కు ముందు ఆన్‌లైన్ లీక్ అయిన స్టార్ హీరో సినిమాలు ఏంటీ, వాటి బాక్సాఫీస్ రిజల్ట్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

అత్తారింటికి దారేది

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో జల్సా తర్వాత వచ్చిన సినిమా అత్తారింటికి దారేది. సమంత, ప్రణీత సుభాష్ హీరోయిన్స్‌గా నటించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అదించారు. 2013 సెప్టెంబర్ 27న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా భారీ ఘన విజయం సొంతం చేసుకుంది.

అయితే, అత్తారింటికి దారేది సినిమా విడుదలకు ముందే దాదాపుగా 45 నిమిషాల ఫుటేజ్ ఆన్‌లైన్‌లో లీక్ అయింది. అత్తారింటికి దారేది సినిమాకు పనిచేసిన టెక్నిషీయనే మూవీని లీక్ చేశారు. సినిమా ప్రారంభంలో వచ్చే ఆ 45 నిమిషాల వీడియో నెట్టింట్లో తెగ చక్కర్లు కొట్టింది. అయితే, లీక్ అయినప్పటికీ అత్తారింటికి దారేది సినిమా భారీ హిట్ అందుకుంది.

ఎవడు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ ఇద్దరు కనిపించిన సినిమా ఎవడు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, శ్రుతి హాసన్, అమీ జాక్సన్ హీరోయిన్స్‌గా అలరించారు. దీనికి కూడా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. 2014 జనవరి 12 సంక్రాంతికి కానుకగా ఎవడు థియేట్రికల్ రిలీజ్ అయింది.

అయితే, ఆ విడుదలకు ఒక్కరోజు ముందు రాత్రి ఆన్‌లైన్‌లో ఎవడు లీక్ అయింది. దాంతో సినిమాను వాయిదా కూడా వేద్దామనుకున్నారు. కానీ, రిలీజ్ చేయడమే మంచిదనుకుని థియేటర్లలో విడుదల చేశారు. రూ. 35 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఎవడు బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచింది.

బాహుబలి ది బిగినింగ్

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన అతి గొప్ప చిత్రాల్లో ముందుండే సినిమా బాహుబలి ది బిగినింగ్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దగ్గుబాటి రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్ వంటి ప్రముఖ నటులు యాక్ట్ చేసిన బాహుబలి ఏ రేంజ్‌లో హిట్ అందుకుందో తెలిసిందే. ప్రభాస్‌ను పాన్ ఇండియా స్టార్‌గా చేయడానికి అడుగు పడింది ఈ సినిమాతోనే.

బాహుబలి సినిమాలో నటించినవారందరికి ఎనలేని గుర్తింపును తీసుకొచ్చింది. అంతటి ఘన విజయం సాధించిన బాహుబలి సినిమా కూడా థియేటర్ రిలీజ్‌కు ముందు ఆన్‌లైన్ లీక్ అయింది. బాహుబలి క్లైమాక్స్‌ను తన ఫ్రెండ్స్‌కు చూపిద్దామన్న ఉత్సాహంలో సినిమాకు పని చేసిన టెక్నిషియన్ ఒకరు లీక్ చేశారు.

కానీ, కట్ చేస్తే.. 2015 జూలై 10న విడుదలైన బాహుబలి ప్రపంచస్థాయిలో హిట్ అయింది. అయితే, రిలీజ్‌కు ముందు ఆన్‌లైన్‌లో లీక్ అయిన ఈ మూడు సినిమాలు హిట్ కొట్టాయి.

Sanjiv Kumar

TwittereMail
సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌ కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024