Best Web Hosting Provider In India 2024

Gunde Ninda Gudi Gantalu Serial: సైకోగా మారిన సంజు – పీకపై కత్తి పెట్టుకొని బ్లాక్‌మెయిల్ – ప్రభావతితో మీనా వార్
Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంటలు మార్చి 13 ఎపిసోడ్‌లో తనకు చెప్పకుండా మౌనిక పుట్టింటికి వెళ్లిన సీక్రెట్ బయటపడటంతో సంజు సైకోగా మారిపోతాడు. ఫంక్షన్ రోజు గొడవ చేసి మళ్లీ పుట్టింటి గడప తొక్కకుండాచేస్తానని మౌనికతో అంటాడు.
సంజుకు తెలియకుండా తాను పుట్టింటికి వెళ్లిన సీక్రెట్ బయటపడటంతో మౌనిక కంగారు పడుతుంది. సత్యం, ప్రభావతి వెళ్లిపోగానే మౌనిక దగ్గరకు వస్తాడు సంజు. మొగుడు కళ్లు కప్పి అన్న కళ్లల్లో ఆనందం చూడటానికి పుట్టింటికి వెళ్లిన ఓ గొప్ప చెల్లి హ్యాట్సాఫ్ అని అంటాడు. అత్తా కోడళ్లు కలిసి మమ్మల్ని వెధవలను చేశారని అంటాడు. చెబితే పంపించారని చెప్పకుండా వెళ్లానని బయపడుతూ మౌనిక బదులిస్తుంది. నాకు చెప్పకుండా ఎక్కడెక్కడికి వెళ్లివస్తున్నావని మౌనికను నిలదీస్తాడు సంజు.
చెంప పగలగొట్టిన సువర్ణ…
అప్పుడే అక్కడికి ఎంట్రీ ఇచ్చిన సువర్ణ…సంజు చెంప పగలగొడుతుంది. దేవతలాంటి భార్యను అనుమానిస్తే కళ్లు పోతాయని, ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడమని కొడుకును వార్నింగ్ ఇస్తుంది. అసలు నీ వల్లే మౌనికకు ఇంత ధైర్యం వచ్చిందని, బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండి డైరెక్షన్ నువ్వే చేశావని తల్లిపై ఫైర్ అవుతాడు సంజు. అత్తింట్లో బానిసలా బతుకుతుంటే చూడలేక జాలిపడి నేను పుట్టింటికి పంపించానని తప్పును తనపై వేసుకుంటుంది సువర్ణ. ఇంకోసారి ఇలాంటి పనులు చేస్తే మౌనికను చంపేస్తానని వార్నింగ్ ఇస్తాడు సంజు. జీవితంలో మళ్లీ పుట్టింటి ముఖాన్ని మౌనిక చూడకూడదని సంజు అంటాడు.
మెడపై కత్తి…
సువర్ణ జోక్యం చేసుకోబోతుంటే ఇది మా ఇద్దరి సమస్య అని, మధ్యలో కల్పించుకోవద్దని తల్లితో అంటాడు సంజు. నువ్వు ఒక్క క్షణం ఇక్కడే ఉంటే పీక కోసుకొని చచ్చిపోతానని మెడపై కత్తి పెట్టుకొని తల్లిని బ్లాక్‌మెయిల్ చేస్తాడు. కొడుకు అన్నంత పనిచేస్తాడని భావించిన సువర్ణ భయంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది
ఆనందం కూడా లేకుండా చేస్తా…
పుట్టింట్లో ఫంక్షన్‌కు వెళ్లి సంతోషంగా గడుపుదామని అనుకుంటున్నావా అని మౌనికతో అంటాడు సంజు. ఆ ఒక్క రోజు అయినా సంతోషంగా గడుపుదామని కలలు కంటున్నావేమే…ఆ సంతోషాన్ని నీకు మిగిల్చనని చెబుతాడు. నీ మెడలో తాళి కట్టిన క్షణమే…నా జీవితంలో సంతోషానికి సమాధి కట్టానని అంటాడు. ఫంక్షన్‌లో మీ వాళ్ల పరువు తీసి మళ్లీ నిన్ను పుట్టింటి గడప తొక్కుండా చేస్తానని మౌనికతో ఛాలెంజ్ చేస్తాడు సంజు. సంజు అంటే సన్నాసి అనుకుంటివా…సైకో అని టార్చర్ పెడతాడు. భర్త మాటలతో మౌనిక కన్నీళ్లు పెట్టుకుంటుంది.
బాలు అనుమానం…
సంజు ఇంటి తిరిగొస్తారు సత్యం, ప్రభావతి. ఫంక్షన్‌లో బాలు ఉండొద్దని సంజు పెట్టిన కండీషన్ ఎలా చెప్పాలో తెలియక తలపట్టుకుంటాడు. మౌనిక, మనోజ్ గురించి ఆలోచించినట్లు …బాలు గురించి ఎందుకు ఆలోచించవని ప్రభావతిని ప్రశ్నిస్తాడు సత్యం. బాలు ఎప్పుడు నా మీద పడి ఏడుస్తాడని ప్రభావతి. ఫంక్షన్‌లో బాలు ఉండకుండా చేసే బాధ్యతను తెలివిగా సత్యంపై నెట్టేస్తుంది. సత్యం డల్‌గా కనిపించడంతో బాలు అనుమానపడతాడు. ఏమైందని అడుగుతాడు. కానీ అసలు విషయం ఎలా చెప్పాలో తెలియక సత్యం తడబడిపోతాడు. మౌనిక ఎలా ఉంది? సంజుగాడు ఏమైనా అన్నాడా అని బాలు అంటాడు. బావను గౌరవించకపోవడంతో బాలుపై ఫైర్ అవుతుంది ప్రభావతి.
డబ్బు ఇచ్చిన బాలు…
ఫంక్షన్ గురించి సంజు ఏమన్నాడని తండ్రిని అడుతాడు బాలు. ఫంక్షన్ మనింట్లో చేయడానికి సంజుతో పాటు అతడి తండ్రి ఒప్పుకున్నాడని సత్యం బదులిస్తాడు. ఈ ఫంక్షన్ గురించి ఎక్కువ టెన్షన్ పెట్టుకోవద్దని, మన తాహతుకు తగ్గట్లుగా ఫంక్షన్ జరిపిద్దామని బాలు అంటాడు. సత్యానికి డబ్బు ఇస్తాడు.మౌనిక కోసం బంగారం కొంటున్నానని, చెల్లిలిని ఇంటికి పిలిపించి అవమానించనని బాలు అంటాడు.
అమ్మకు నమ్మకం లేదు…
అమ్మకు నాపై నమ్మకం లేదని, నువ్వైనా నన్ను నమ్మమని తండ్రితో అంటాడు బాలు.నాకు నామీద కంటే నీ మీదే నమ్మకం ఎక్కువని కొడుకుకు బదులిస్తాడు సత్యం. ఫంక్షన్‌కు సంబంధించిన అన్ని ఏర్పాట్లనే తానే దగ్గరుండి చూసుకుంటానని తండ్రికి మాటిస్తాడు బాలు.
బాలు మాటలతో సత్యం ఎమోషనల్ అవుతాడు. అసలు విషయం ఎందుకు చెప్పలేదని భర్తను అడుగుతుంది ప్రభావతి. మౌనిక ఫంక్షన్ ఎంత బాగా చేయాలని ఆలోచిస్తుంటే…నువ్వు ఉండొద్దని ఎలా చెప్పగలనని సత్యం అంటాడు. కానీ బాలుకు అసలు నిజం చెప్పక తప్పదని, బాలు మీద మనం జాలి పడితే మౌనిక అత్తింటివాళ్లు మనపై విరుచుకుపడతారని సత్యం అంటాడు.
డబ్బులు తక్కువ…
ఫంక్షన్ కోసం డబ్బులు తక్కువ పడటంతో ఫ్రెండ్ రాజేష్ దగ్గరకు వెళతాడు బాలు. మౌనిక ఫంక్షన్ కోసం ఓ యాభై వేలు కావాలని అడుగుతాడు. డబ్బుల కోసం ఎంత రిస్క్ అయినా తీసుకుంటానని చెబుతాడు. కాకినాడ దగ్గర ఓ జాతర జరుగుతుందని, రెండు రోజులు ఆపకుండా ట్రిప్ వేస్తే యాభై వేలు రావొచ్చని బాలుకు సలహా ఇస్తాడు రాజేష్. చెల్లెలి కోసం రిస్క్ తీసుకోవాలని బాలు ఫిక్సవుతాడు
ప్రభావతి హడావిడి…
ఫంక్షన్ కోసం తెగ హడావిడి చేస్తుంది ప్రభావతి. అంత తానే చూసుకోవాల్సివస్తుందని అంటుంది. మీనాను పిలిచి మౌనిక ఫంక్షన్ గుర్తుందా అని అంటుంది. మర్చిపోయినట్లు మీకు అనిపించిందా అని అత్తకు బదులిస్తుంది మీనా. ఈ మధ్య ఇంట్లో కంటే బయటే ఎక్కువగా ఉంటున్నావని మీనాతో వెటకారంగా మాట్లాడుతుంది. అగ్గిపెట్టెంత పూలకొట్టు పెట్టుకొని…దానికి పరువు తీసేలా నా పేరు పెట్టారని అంటుంది. వందల్లో వ్యాపారం చేస్తూ లక్షల్లో సంపాదించేలా బిల్డప్‌లు ఇస్తున్నావని మీనాపై సెటైర్లు వేస్తుంది.
లక్షలు ఖర్చుపెట్టాలన్న మీరే…
లక్షల గురించి ఆలోచించాలన్న…లక్షలు ఖర్చు పెట్టాలన్న మీ తర్వాతే ఎవరైనా ప్రభావతి పంచ్ ఇస్తుంది మీనా. ఫంక్షన్‌కు కావాల్సిన లిస్ట్‌ను మీనాకు ఇస్తుంది ప్రభావతి. ఇప్పుడు తాను బిజీగా ఉన్నానని, సాయంత్రం చూస్తానని మీనా ఆన్సర్ ఇస్తుంది. పూల మాలలు కట్టుకునే పనే కదా…ఏదో బ్యాంకు నడుపుతున్నట్లు చెబుతున్నావేంటి అని ప్రభావతి నిలదీస్తుంది. మీరు చులకనగా చూసినంత మాత్రానా నా పని మీద గౌరవం పోదని మీనా ఆన్సర్ ఇస్తుంది. ఇంట్లో ఫంక్షన్ పెట్టుకొని పని అంటావేంటి? ఒక్క రోజు నీ పని మానుకుంటే కొంపలు ఏమైనా మునిగిపోతాయా? నువ్వు నష్టపోయిన చిల్లర ఏదో నేను పడేస్తానని తక్కువ చేసి మాట్లాడుతుంది.
నీ కుటుంబానికి అలవాటే…
కస్టమర్లకు ఇవ్వాల్సిన పూల దండలు టైమ్‌కు ఇవ్వాలని, లేదంటే నాకు మాటొస్తుందని మీనా అంటుంది. అబ్బో మాట…మాట పడటం, సిగ్గు లేకుండా తుడుచుకొని వెళ్లిపోవడం నీకు నీ కుటుంబానికి అలవాటే కదా అని ప్రభావతి అంటుంది. మధ్యలో మా కుటుంబాన్ని ఎందుకు లాగుతున్నారని మీనా అంటుంది. నన్ను కూడా తప్పు కూడా అంటే ఒప్పుకోనని కోపంగా బదులిస్తుంది.
బంగారం లాంటి కోడళ్లు…
నీ గురించి నాకు ఎందుకు? బంగారం లాంటి కోడళ్లు ఇద్దరు కోడలున్నారని, వాళ్లు నన్ను బాగా చూసుకుంటున్నారని ప్రభావతి అంటుంది. సంతోషమే కదా అని మీనా చెబుతుంది. రేపు ఫంక్షన్‌లో ఏది తక్కువైనా నిన్నే అడుగుతానని మీనాకు వార్నింగ్ ఇస్తుంది ప్రభావతి. మీ బంగారం లాంటి కోడళ్లు ఉన్నారు కదా అని మీనా అంటుంది. వాళ్లకు చెప్పాల్సినవి వాళ్లకు చెప్పానని, నువ్వు చేయాల్సినవి నువ్వు ఒళ్లు దగ్గర పెట్టుకొని చేయమని హెచ్చరిస్తుంది. నువ్వు పనులు చేస్తున్నావో లేదో నీపై ఓ కన్నేసి ఉంచుతానని అంటుంది.
సత్యం సపోర్ట్…
మౌనిక విషయంలో మనకు ఎన్ని బాధ్యతలు ఉన్నాయో…మీనాకు అన్నే బాధ్యతలు ఉన్నాయని కోడలికి సత్యం సపోర్ట్ చేస్తాడు. ఫంక్షన్‌కు ఇంకా టైమ్ ఉందని ఇప్పటి నుంచే హడావిడి చేయాల్సిన పనిలేదని అంటాడు. ఫంక్షన్ రోజు అందరిలాగే రెడీ సంతోషంగా ఉండమని, చేయడానికి పనులేమి లేవని మీనాతో సత్యం అంటాడు. మీనా ప్రత్యేకంగా చేయాల్సిన పనులేమి లేవని చెబుతాడు.
జోక్యం చేసుకోవద్దు…
మన పనులు చూడాల్సింది మీనానే అని ప్రభావతి అంటుంది. మా విషయంలో జోక్యం చేసుకోవద్దని భర్తతో అంటుంది. అప్పుడే అక్కడికి రవి శృతి వస్తారు. ఫంక్షన్ జరిగే రోజు తాము శృతికి ఇంటికి వెళ్లాలని అనుకుంటున్నట్లు రవి చెబుతాడు. సంజుతో శృతికి ఉన్న ఈష్యూ వల్ల ఫంక్షన్‌లో గొడవలు జరిగే అవకాశం ఉందని రవి భయపడతాడు. సంజు ఆ గొడవలు ఎప్పుడో మర్చిపోయాడని ప్రభావతి అంటుంది.
మీరు లేకపోతే మౌనిక బాధపడుతుందని రవి, శృతికి మీనా సర్ధిచెబుతుంది. ఎప్పుడో ఏదో అయ్యిందని దూరంగా ఉంటే…ఆ బంధం ఇంకా దూరం అవుతుందని సత్యం కొడుకుకు సర్ధిచెబుతాడు.
సత్యం మాటలతో రవి, శృతి కాంప్రమైజ్ అవుతారు. ఫంక్షన్‌లో ఉండటానికి అంగీకరిస్తారు.
మీనా కంగారు…
రాత్రైనా బాలు ఇంటికి రాకపోవడంతో మీనా కంగారు పడుతుంది. కష్టపడి తాను ట్రిప్‌కు వెళ్లిన డబ్బులు తండ్రికి ఇస్తాడు బాలు. బాలు చేతికి గాయం కావడంతో మీనా కంగారు పడుతుంది. చిన్న దెబ్బేనని రెండు రోజుల్లో మానిపోతుందని బాలు బదులిస్తాడు. ఫంక్షన్ రోజు మౌనిక కళ్లల్లో ఆనందం మాత్రం జీవితాంతం గుర్తుంటుందని బాలు అంటాడు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ముగిసింది.