




Best Web Hosting Provider In India 2024

Thriller OTT: మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ఐశ్వర్య రాజేష్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ – ఊహలకు అందని మలుపులతో!
Thriller OTT: ఐశ్వర్య రాజేష్ హీరోయిన్‌గా నటించిన కోలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ డ్రైవర్ జమున థియేటర్లలో రిలీజైన మూడేళ్ల తర్వాత అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చింది. కమర్షియల్ సక్సెస్‌గా నిలిచిన ఈ సినిమాకు కిన్‌స్లిన్ దర్శకత్వం వహించాడు.

ఐశ్యర్య రాజేష్ హీరోయిన్‌గా నటించిన డ్రైవర్ జమున మూవీ థియేటర్లలో రిలీజైన మూడేళ్ల తర్వాత మరో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటికే ఆహా ఓటీటీలో తెలుగు, తమిళ భాషల్లో ఈ మూవీ అందుబాటులో ఉంది. అమెజాన్ ప్రైమ్‌లో మాత్రం కేవలం తమిళ వెర్షన్ మాత్రమే విడుదలైంది.
కమర్షియల్ హిట్…
క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన డ్రైవర్ జమున మూవీకి కిన్‌స్లిన్ దర్శకత్వం వహించాడు. 2022లో రిలీజైన ఈ మూవీ కమర్షియల్ హిట్‌గా నిలిచింది. ఐశ్వర్య రాజేష్‌తో పాటు కథలోని మలుపులు ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ ట్విస్ట్‌ను డైరెక్టర్ అద్భుతంగా రాసుకున్నాడు. రివేంజ్ థ్రిల్లర్‌గా రోడ్ జర్నీ బ్యాక్‌డ్రాప్‌లో దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించాడు.డ్రైవర్ జమున మూవీలో ఐశ్వర్య రాజేష్‌తో పాటు ఆడుకాలం నరేన్ కీలక పాత్ర పోషించాడు. ఈ మూవీకి గిబ్రాన్ మ్యూజిక్ అందించాడు.
డ్రైవర్ జమున కథ ఇదే…
జమున (ఐశ్వర్యరాజేష్) తండ్రి సుందరం హత్యకు గురవుతాడు. తల్లి అనారోగ్యం పాలవ్వడంతో కుటుంబ బాధ్యతలు జమునపై పడతాయి. తండ్రి క్యాబ్ నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తుంటుంది జమున. ఓ రోజు ఆమె క్యాబ్‌ను ముగ్గురు వ్యక్తులు బుక్ చేసుకుంటారు. తన కారులో ప్రయాణిస్తోన్న ఆ ముగ్గురు కరుడుగట్టిన కిరాయి హంతకులు అనే నిజం జమునకు తెలుస్తుంది.ప్రజల్లో మంచి పేరు ఉన్న మాజీ ఎమ్ఎల్ఏ మద్దెల వెంకట్రావును చంపేందుకు వారు కుట్రలు పన్నిన విషయం బయటపడుతుంది.
ఆ కిల్లర్స్‌ను పోలీసులకు పట్టించాలని అనుకున్న జమున ప్లాన్ బెడిసికొడుతుంది. ఆ హంతకుల చేతిలో ఆమె బంధీగా మారిపోతుంది. ఆ తర్వాత ఏమైంది? ఆ కిల్లర్స్ గ్యాంగ్ బారి నుంచి ప్రాణాలతో ఎలా బయటపడింది? మద్దెల వెంకట్రావును చంపాలని ఆ కిల్లర్స్ ఎందుకు అనుకున్నారు? జమున తండ్రి మరణానికి మద్దెల వెంకట్రావుకు సంభందం ఏమిటి అన్నదే ఈ మూవీ కథ.
బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్…
సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో తెలుగులో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అందుకున్నది ఐశ్వర్య రాజేష్. వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ 300 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది. ఈ మూవీలో వెంకటేష్ భార్యగా భాగ్యం అనే పాత్రలో తన కామెడీ టైమింగ్, యాక్టింగ్‌తో ఐశ్వర్య రాజేష్ ఆకట్టుకున్నది. ప్రస్తుతం తమిళం, మలయాళ భాషల్లో ఆరు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది ఐశ్వర్య రాజేష్.
సంబంధిత కథనం