




Best Web Hosting Provider In India 2024

Mohan Babu: ఆరోజు ఏడ్చాను.. నేను ఏ తప్పు చేయలేదు.. ఇవ్వలేకపోయాను.. మంచు మోహన్ బాబు కామెంట్స్
Mohan Babu Comments On His Struggles In Earlier Career: మంచు మోహన్ బాబు ఇటీవల కాలంలో పలు వివాదాలు ఎదుర్కొంటున్నారు. ఇటీవల దివంగత హీరోయిన్ సౌందర్య మరణానికి కారణం మోహన్ బాబు అని ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో గతంలో ఓ ఇంటర్వ్యూలో మోహన్ బాబు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Mohan Babu Comments On His Struggles In Career: విలక్షణ నటుడిగా ఎంతో పేరు తెచ్చుకున్నారు కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు. ఎన్నో వందల చిత్రాల్లో నటించి డైలాగ్ కింగ్‌గా కీర్తి సంపాదించారు. అయితే, ఇటీవల కాలంలో వరుసగా మంచు మోహన్ బాబు వివాదాలు ఎదుర్కొంటున్నారు.
సౌందర్య భర్త క్లారిటీ
మోహన్ బాబు కుమారులు మంచు విష్ణు, మనోజ్ ఇద్దరు గొడవ పడటం, ఈ క్రమంలో జర్నలిస్ట్‌పై మోహన్ బాబు దాడి, కోర్ట్ కేసు వంటివి చాలా జరిగాయి. అంతేకాకుండా రీసెంట్గా దివంగత స్టార్ హీరోయిన్ సౌందర్య మరణానికి కారణం మోహన్ బాబు ఆరోపిస్తూ ఓ కేసు కూడా ఫైల్ అయింది. కానీ, అందులో ఎలాంటి నిజం లేదని సౌందర్య భర్త జీఎస్ రఘు ఓ లేఖ విడుదల చేసి పూర్తి క్లారిటీ ఇచ్చేశారు.
కెరీర్ తొలినాళ్లలో
ఈ నేపథ్యంలో గతంలో ఓ ఇంటర్వ్యూలో మంచు మోహన్ బాబు చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రముఖ జర్నలిస్ట్ రాధాకృష్ణ హోస్ట్‌గా నిర్వహించిన ఓపేన్ హార్ట్ విత్ ఆర్కే ఇంటర్వ్యూలో మోహన్ బాబు తాను సినీ కెరీర్ తొలినాళ్లలో పడిన కష్టాలను ఎమోషనల్‌గా చెప్పారు.
మనసుకు నొచ్చుకున్నది
“ఒక ముఖ్యమైనది. అంటే, మనస్ఫూర్తిగా నిజంగా ఫీల్ అయింది, ఓపెన్‌గా చెప్పాలనుకుంది మూడు విషయాలు అడుగుతా. మీ మనసుకు చాలా బాధ అనిపించింది, వ్యక్తిగతంగా మీరు బాగా నొచ్చుకున్నది కష్టపడినది, మనసు కష్టపడినది ఒక్క సంఘటన చెప్పండి” అని మోహన్ బాబును రాధాకృష్ణ అడిగారు.
నెల అద్దె కట్టలేదు
“ఫస్ట్ టైమ్ చెబుతున్నానండి. అది పిల్లలు వద్దనేవాళ్లు. నేను కారు షెడ్లో ఉన్నాను. ఆ ఇంటి ఓనర్‌కు ఒక మాసం (నెల) రెంట్ కట్టలేదు. 35 రూపాయలు. నా దగ్గర మూడో నాలుగో సత్తు పాత్రలు ఉండేవి. అందులో ఎప్పుడైనా వండుకునేవాన్ని. కొంచెం బియ్యం వండుకుందామని వచ్చాను సాయంత్రం. వస్తే దాంట్లో ఆవిడ (ఇంటి ఓనర్) టాయిలెట్‌కు కూర్చుంది” అని మోహన్ బాబు చెప్పారు.
కళ్లలో నీళ్లు వస్తున్నాయి
దానికి యాంకర్ ఆర్కే షాక్ అయ్యారు. మోహన్ బాబు కొనసాగిస్తూ.. “వచ్చి చూస్తే అర్థమైంది. ఆ ఇంట్లో పనిచేసే అమ్మాయి చెప్పింది. ఇలా అమ్మగారు చేశారని. ఆరోజు ఏడ్చుకున్నాను” అని ఎమోషనల్‌గా తెలిపారు. “ఇప్పుడు కూడా మీ కళ్లలో నీళ్లు వస్తున్నాయి. నిజంగా ఇది భరించలేనిది” అని రాధాకృష్ణ అన్నారు.
నిస్సహాయత
“ఐ క్రైడ్ దట్ డే. ఇటువంటి సంఘటనలు జరిగాయి జీవితంలో. అప్పుడప్పుడు తలుచుకుంటే.. అంటే నేను ఏ తప్పు చేయలేదు. ఇవ్వలేకపోయాను (రెంట్)” అని మోహన్ బాబు చెప్పారు. “ఇవ్వలేకపోయారు. ఉద్దేశపూర్వకంగా కాదు. నిస్సహాయత” అని ఆర్కే అన్నారు. “అవును.. అది మనసును కలిచివేసే ఇది” అని మోహన్ బాబు చెప్పుకొచ్చారు.
బంగారం తినగలమా
“ఈరోజున నేను ఈవిధంగా ఉన్నానంటే అందరికీ చెప్పేది ఒక్కటే కష్టేఫలి. కృషితో నాస్తి దుర్భిక్షం. ఒక వ్యక్తి సక్సెస్ వెనుకాల ఎన్నో ఉంటాయి. కొన్ని కొంతమంది చెప్పుకుంటారు. కొంతమంది చెప్పరు. లేనప్పుడు లేనిపాడు, ఉన్నప్పుడు బేషజాలు అంటారే.. ఇప్పుడు బంగారం తినగలమా మనం. సుఖం వెనుకాల ఎంతో కష్టం ఉంది” అని మోహన్ బాబు వెల్లడించారు.
సంబంధిత కథనం