



Best Web Hosting Provider In India 2024

Holi in Madhura: హోలీ రోజు కచ్చితంగా దెబ్బలు మగవాళ్ళు ఉన్నారు, అలా దెబ్బలు తింటనే వారికి మంచిదట
Holi in Madhura: హోలీ ఒక్కోచోట ఒక్కోలా ఆడుతారు. ముఖ్యంగా మధుర, బృందావనం, బర్సానా వంటి ప్రాంతాల్లోని హోలీని ప్రత్యేకంగా చూడాల్సిందే. ముఖ్యంగా మధురలో మగవారు హోలీ రోజు దెబ్బలు తినాల్సిందే.

హోలీ మనదేశంలోని ప్రతి ప్రాంతంలో అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటారు. అయితే మన దేశంలో అద్భుతంగా హోలీని నిర్వహించేది మాత్రం మధురలోనే. విదేశీయులు కూడా మధురలోని హోలీని చూసేందుకు వస్తారు. మధుర ఆ శ్రీకృష్ణుడి నగరంగా పేరు పొందింది. మధుర నుండి బృందావనం వరకు ఎక్కడికి వెళ్లినా హోలీ అతిపెద్ద పండుగ నిర్వహించుకుంటారు. వీధులన్నీ పూలతో అలంకరిస్తారు. మధురలోని హోలీని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
మధురలోని బర్సానాలో లాతమార్ హోలీ నిర్వహించుకుంటారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ గోపికలు తమ గోపాలురతో హోలీ ఆడతారు. మగవారు ఆడవాళ్ళని ప్రేమ పాటలతో ఆటపట్టిస్తారు. అప్పుడు ఆడవారు గోపికలుగా మారి కర్రలతో వారి వెంటపడి కొడతారు. మగవారు దెబ్బలు తినకుండా ఇక్కడ హోలీ పూర్తి కాదు. ఆ దెబ్బలనుండి రక్షించుకోవడానికి మగవారు ఆడవారిపై రంగులు జల్లుతారు. ఈ అందమైన దృశ్యాన్ని చూడాలంటే రెండు కళ్ళు చాలవు. హోలీ రోజు మధురలోని ఆడవారు గోపికలుగా మగవారు గోపాలుడుగా మారిపోతారు.
పూల హోలీ
బృందావనంలో పూల హోలీ కూడా చేస్తారు. అక్కడ బాంక్ బిహారీ అనే ఆలయం ఉంది. ఆ ఆలయ ప్రాంగణంలో భక్తులు పూల హోలీని నిర్వహించుకుంటారు. అక్కడ రంగులు చల్లుకోరు. రంగురంగుల్లో ఉన్న పూలను తెచ్చి హోలీ ఆడతారు. ఇది చూసేందుకు కూడా ఎంతోమంది పర్యాటకులు అక్కడికి వస్తారు.
లడ్డూల హోలీ
మధురలోని బర్సానాలో ప్రతి ఒక్కరూ లడ్డూలు, రంగులు, గులాబీ రేకులు పట్టుకొని ప్రతి ఇంటికి వెళ్లి హోలీకి ప్రజలను ఆహ్వానిస్తారు. నందగావ్ అనే గ్రామానికి వెళ్లి అక్కడ ఉన్న పూజారిని లడ్డూలు, గులాబీ రేకులు, రంగులతో ఆహ్వానిస్తారు. అతను బర్సానాకు వస్తాడు. అలా వచ్చిన వ్యక్తికి అందరూ లడ్డూలను ఇచ్చి స్వాగతం పలుకుతారు. లడ్డూల సంఖ్య అధికంగా ఉంటుంది. కాబట్టి అతను వాటిని తినలేడు. ఆ లడ్డూలను తనకు ఇచ్చిన వారిపైన విసిరేస్తాడు. అందుకే దీని లడ్డు హోలీ అని పిలుచుకుంటారు. కొన్ని వేల కిలోల లడ్డూలను దీనికోసం తయారు చేస్తారు.
బలదేవుని ఆలయంలో
శ్రీకృష్ణుడి అన్నయ్య అయినా బలదేవుడికి మధురలో బలదేవ ఆలయం ఉంది. ఇక్కడ అద్భుతంగా హోలీని ఆడుతారు. దీన్ని డౌజీ హోలీ అంటారు. దీన్ని చూసేందుకు భక్తులు గుంపులుగా వస్తారు. ఇక్కడ గోపికల్లా తయారైన మహిళలు తమ భర్తలను కొరడాలతో కొట్టడం మొదలుపెడతారు. అక్కడ ఖచ్చితంగా ఈ సాంప్రదాయం ప్రతి ఏడాది జరుగుతూనే ఉంటుంది. భక్తులు కూడా భార్యల చేతిలో సంతోషంగానే దెబ్బలు తింటారు.
సంబంధిత కథనం