Holi Songs: హోలీ రోజు రంగులు చల్లుకుంటూ ఈ హోలీ సాంగ్స్‌కు డాన్సులు వేస్తే అదిరిపోతుంది, హుషారైన హోలీ పాటలు ఇవిగో

Best Web Hosting Provider In India 2024

Holi Songs: హోలీ రోజు రంగులు చల్లుకుంటూ ఈ హోలీ సాంగ్స్‌కు డాన్సులు వేస్తే అదిరిపోతుంది, హుషారైన హోలీ పాటలు ఇవిగో

Haritha Chappa HT Telugu
Published Mar 13, 2025 03:30 PM IST

Holi Songs: హోలీ వచ్చిందంటే రంగులు చల్లుకొని తర్వాత నీళ్లలో తడుస్తూ డాన్స్ లో వేస్తారు. అప్పుడు కచ్చితంగా హుషారైన హోలీ పాటలు ఉండాల్సిందే .ఇక్కడ మేము కొన్ని హోలీ సాంగ్స్ ఇచ్చాము. వీటిని ముందుగానే రెడీ చేసి పెట్టుకోండి.

హోలీ సాంగ్స్
హోలీ సాంగ్స్ (Pixabay)

హోలీకి చిన్నా పెద్దా అనే తేడా లేకుండా రంగులు చల్లుకుంటారు. ఆనందంగా గెంతులు వేస్తారు నీళ్లల్లో తడుస్తూ రంగుల నీళ్లు చల్లుకుంటూ డాన్సులు వేస్తారు. డాన్సులు వేయాలంటే కచ్చితంగా హుషారైన పాటలు ఉండాల్సిందే. హోలీ నాడు కొన్ని హోలీ సాంగ్స్‌ను ముందుగానే ప్లే లిస్టుగా పెట్టుకుంటే ఉత్సాహంగా డాన్సులు వేయొచ్చు. ఇక్కడ మేము టాలీవుడ్ కు చెందిన కొన్ని హోలీ సాంగ్స్‌ను ఇచ్చాము. వీటిని మీరు ముందుగానే డౌన్లోడ్ చేసుకొని మీ ఫోన్లో లేదా ప్లేయర్లలో ప్లేలిస్టుగా పెట్టుకుంటే ఒక దాని ఒకటి పాటలు వస్తూనే ఉంటాయి. హోలీ ఉత్సాహాన్ని డాన్సులతో అదరగొట్టేయొచ్చు. ఇక ఆ పాటలేవో తెలుసుకోండి.

ఖుషిలో హోలీ సాంగ్

ఖుషీలో పవన్ కళ్యాణ్, ముంతాజ్ కలిసి చిందులు వేశారు. ఆ పాట ఇప్పటికీ ఎవరు గ్రీన్ పవన్ స్టెప్పులు ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేరు. ‘హోలీల రంగు హోలీ హోలీల రంగు హోలీ’ అని మొదలయ్యే ఈ పాటకు చక్కగా స్టెప్పులు వేయవచ్చు.

గోపాల గోపాల సినిమాలో పాట

పవన్ కళ్యాణ్ విక్టరీ వెంకటేష్ నటించిన గోపాల గోపాల సినిమాలో భాజే రంగ్ భాజే పాట ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కచ్చితంగా హోలీకి ఈ పాటకు డాన్స్ వేయాల్సిందే. ఈ పాట కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది .కాబట్టి అందరికీ నచ్చుతుంది.

సీతారామరాజు సినిమా

నాగార్జున, హరికృష్ణ అన్నదమ్ములుగా నటించిన సీతారామరాజు సినిమాలో హోలీ సాంగ్ అద్భుతంగా ఉంటుంది. చికి చికి తాత చికి చికి తాత… రంగోలి అనే సాంగ్ హోలీ సందర్భంగా అని చిత్రీకరించారు. కానీ పాట అద్భుతంగా ఉంటుంది. బాగా డాన్స్ చేయడానికి కూడా అనువుగా ఉంటుంది. ఈ పాట కచ్చితంగా హోలీ డాన్సుల్లో ఉండాల్సిందే.

రంగు రబ్బారబ్బా

రాఖీ సినిమాలో దేవి శ్రీ ప్రసాద్ పాడిన రంగు రబ్బా రబ్బా పాట కూడా హోలీకి అద్భుతమైనదని చెప్పుకోవాలి. దీనికి మంచిగా మాస్ స్టెప్పులు కూడా వేయొచ్చు. కాబట్టి ఖచ్చితంగా హోలీ పాటల్లో ఇది ఉండేటలా చూసుకోండి.

బాస్ పార్టీ

వాల్తేరు వీరయ్య సినిమాలో బాస్ పార్టీ సాంగ్ కూడా ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు. ఈ పాటను పెడితే చాలు ఎంతోమంది డ్యాన్సులో వేస్తూనే ఉంటారు. బాస్ పార్టీ సాంగ్ హోలీ లాంటి పార్టీలలో కచ్చితంగా ఉండాలి.

రాములు రాములు

మరొక అందమైన పార్టీ సాంగ్ ‘రాములో రాములా’. అల వైకుంఠపురం సినిమాలో ఈ రాములో రాముల పాట ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే. హోలీలాంటి పార్టీలలో ఈ రాములో రాములా పాట ఉంటే ఎవరికైనా స్టెప్పులు పడిపోతాయి.

వాల్తేరు వీరయ్య సినిమాలో మరొక పాట పూనకాలు లోడింగ్. ఈ పాటకి కూడా అభిమానులు ఎక్కువే. ఈ పాట పెడితే డాన్సులు వేయకుండా ఎవరూ ఉండలేరు. కాబట్టి హోలీ రోజు పూనకాల లోడింగ్ పాట కూడా ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి.

ఇక పార్టీలో టిల్లు డీజే పెడితే పాట గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ పాట పెడితే చాలు డాన్స్ రాని వాళ్ళు కూడా ఊగిపోతూ ఉంటారు. హోలీ రోజు రంగులు చల్లుకున్నాక ఈ డీజే పాట పెడితే అద్భుతంగా ఉంటుంది.

హోలీ రోజు కేవలం హోలీ సందర్భంగా సినిమాల్లో ఉన్న పాటలే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. డ్యాన్స్ చేయడానికి ఊపు వచ్చేలా ఉన్నా పాటలు పెట్టినా అందరూ కలిసి చిందులు వేయవచ్చు.

Haritha Chappa

TwittereMail
హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.
Whats_app_banner

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024