



Best Web Hosting Provider In India 2024

AP TG MLC Elections 2025 : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం…! ఏపీ, తెలంగాణలో కొత్తగా ఎన్నికైన వాళ్లు వీరే
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసింది. తెలంగాణలో ఐదుగురు, ఏపీలో ఐదుగురు అభ్యర్థులు నామినేషన్లు వేయగా… వీరిపై పోటీకి ఎలాంటి నామినేషన్లు దాఖలు కాలేదు. దీంతో వీరి ఎన్నిక ఏకగ్రీవమైంది.

ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. అయితే ఇవాళ సాయంత్రంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తయింది. అయితే ఇతర అభ్యర్థుల నుంచి పోటీ లేకపోవటంతో… పలువురు అభ్యర్థులు ఏకగ్రీవమైనట్లు ఈసీ ప్రకటించింది. ఈ మేరకు వివరాలను పేర్కొంది.
తెలంగాలో ఐదుగురు ఏకగ్రీవం…
తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నిక ఏకగ్రీవమైంది. ఐదు నామినేషన్లే దాఖలయ్యాయి. వీటిలో కాంగ్రెస్ నుంచి 3, సీపీఐ నుంచి 1, బీఆర్ఎస్ నుంచి మరో నామినేషన్ దాఖలైంది. ఐదు స్థానాలకు ఐదు నామినేషన్లు మాత్రమే దాఖలు కావడంతో ఏకగ్రీవమైనట్టు ఈసీ ప్రకటించింది.
- విజయశాంతి – కాంగ్రెస్
- శంకర్ నాయక్ – కాంగ్రెస్
- అద్దంకి దయాక్ – కాంగ్రెస్
- నెల్లికంటి సత్యం – సీపీఐ
- దాసోజు శ్రవణ్ కుమార్ – బీఆర్ఎస్
ఏపీలో ఐదుగురు ఏకగ్రీవం:
ఏపీలో కూడా ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. అయితే కేవలం ఐదు నామినేషన్లు మాత్రమే దాఖలు కాగా…. నామినేషన్లు వేసిన ఐదుగురు ఏకగీవ్రమయ్యాయి. వీరిలో కొణిదెల నాగేంద్రరావు(నాగబాబు), బీద రవింద్ర, తిరుమల నాయుడు, గ్రీష్మ ప్రసాద్, సోము వీర్రాజు ఉన్నారు. ఎన్నికైన వారికి ఈసీ అధికారులు… ధ్రువపత్రాలను అందజేశారు.
- కొణిదెల నాగేంద్రరావు(నాగబాబు) – జనసేన
- బీద రవింద్ర – టీడీపీ
- తిరుమల నాయుడు – టీడీపీ
- గ్రీష్మ ప్రసాద్ – టీడీపీ
- సోము వీర్రాజు – బీజేపీ
సంబంధిత కథనం
టాపిక్