Agent OTT Streaming: నిరీక్షణ ముగిసింది.. ఒక రోజు ముందే ఓటీటీలోకి వచ్చేసిన అఖిల్ సూపర్ డిజాస్టర్ మూవీ

Best Web Hosting Provider In India 2024

Agent OTT Streaming: నిరీక్షణ ముగిసింది.. ఒక రోజు ముందే ఓటీటీలోకి వచ్చేసిన అఖిల్ సూపర్ డిజాస్టర్ మూవీ

Hari Prasad S HT Telugu
Published Mar 13, 2025 08:03 PM IST

Agent OTT Streaming: అఖిల్ అక్కినేని నటించిన సూపర్ డిజాస్టర్ మూవీ ఏజెంట్ ఓటీటీలోకి వచ్చేసింది. చెప్పినదాని కంటే ఒక రోజు ముందే డిజిటల్ ప్రీమియర్ అయింది. మొత్తానికి రెండేళ్ల తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి అడుగుపెట్టడం విశేషం.

నిరీక్షణ ముగిసింది.. ఒక రోజు ముందే ఓటీటీలోకి వచ్చేసిన అఖిల్ సూపర్ డిజాస్టర్ మూవీ
నిరీక్షణ ముగిసింది.. ఒక రోజు ముందే ఓటీటీలోకి వచ్చేసిన అఖిల్ సూపర్ డిజాస్టర్ మూవీ

Agent OTT Streaming: ఏజెంట్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కోసం రెండేళ్లుగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు సర్‌ప్రైజ్ ఇస్తూ.. అనౌన్స్ చేసినదానికి ఒక రోజు ముందే స్ట్రీమింగ్ మొదలు కావడం విశేషం. వివిధ కారణాల వల్ల డిజిటల్ ప్రీమియర్ వాయిదా పడుతూ రాగా.. మొత్తానికి గురువారం (మార్చి 13) సాయంత్రం ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది.

సోనీ లివ్ ఓటీటీలోకి ఏజెంట్

అఖిల్ అక్కినేని నటించిన ఏజెంట్ మూవీ ప్రస్తుతం సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమా అఖిల్ కెరీర్లోనే అతిపెద్ద డిజాస్టర్ గా మిగిలిపోయిన విషయం తెలిసిందే. ఎప్పుడో రెండేళ్ల కిందటే థియేటర్లలోకి వచ్చినా.. ఇప్పుడు అప్పుడూ అంటూ డిజిటల్ ప్రీమియర్ వాయిదా పడుతూ వచ్చింది.

ఇప్పుడు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. మూవీ స్ట్రీమింగ్ విషయాన్ని చెబుతూ.. “సీక్రెట్స్, షూటౌట్స్, రూల్స్ ను తిరగరాసే ఓ మిషన్. ఏజెంట్ ఇప్పుడు సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతోంది” అని సోనీ లివ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పేర్కొంది. గత వారమే ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ అప్డేట్ ఇచ్చిన ఆ ఓటీటీ.. శుక్రవారం (మార్చి 14) సినిమాను తీసుకొస్తున్నట్లు చెప్పినా.. ఒక రోజు ముందే అందుబాటులోకి తెచ్చింది.

ఏజెంట్ మూవీ గురించి..

ఏజెంట్ మూవీ ఏప్రిల్ 28, 2023లో రిలీజైంది. స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ మూవీకి సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. దాదాపు ఎన‌భై కోట్ల బ‌డ్జెట్‌తో ప్రొడ్యూస‌ర్ అనిల్ సుంక‌ర ఏజెంట్ మూవీని నిర్మించాడు. ఈ సినిమా నిర్మాణంలో సురేంద‌ర్ రెడ్డి ఓ భాగ‌స్వామిగా వ్య‌వ‌హ‌రించాడు.

భారీ అంచ‌నాల న‌డుమ రిలీజైన ఈ మూవీ నిర్మాత‌ల‌తో పాటు అఖిల్‌ను కోలుకోలేని దెబ్బ‌కొట్టింది. కేవ‌లం ఎనిమిది కోట్ల లోపు వ‌సూళ్ల‌ను రాబ‌ట్టి ఆ ఏడాది అతి పెద్ద డిజాస్ట‌ర్‌గా నిలిచింది. నిర్మాత‌ల‌కు డెబ్బై కోట్ల‌కుపైనే న‌ష్టాల‌ను మిగిల్చింది.

ఏజెంట్ క‌థ ఇదే..

రిక్కీ అలియాస్ రామ‌కృష్ణ (అఖిల్‌) చిన్న‌త‌నం నుంచి రా ఏజెంట్ కావాల‌ని క‌ల‌లు కంటుంటాడు. ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసిన ఫెయిల‌వుతాడు. రా చీఫ్ మ‌హ‌దేవ్ (మ‌మ్ముట్టి) సిస్ట‌మ్‌ను రిక్కీ హ్యాక్ చేసి అత‌డి మెప్పును పొందుతాడు.ఆప‌రేష‌న్ రాబిట్ పేరుతో ఇండియాలో ప‌లు చోట్ల బాంబు దాడుల‌కు పాల్ప‌డేందుకు గాడ్ అలియా ధ‌ర్మ (డినో మారియా) కుట్ర‌లు ప‌న్నుతాడు.

ఈ బాంబు దాడుల‌ను అడ్డుకోనే బాధ్య‌త‌ను రిక్కీకి అప్ప‌గిస్తాడు మ‌హ‌దేవ్‌.ఈ ప్ర‌య‌త్నంలో రిక్కీ స‌క్సెస్ అయ్యాడా? ఈ సీక్రెట్ ఆప‌రేష‌న్ కోసం రిక్కీని మ‌హ‌దేవ్ ఎందుకు సెలెక్ట్ చేశాడు? ధ‌ర్మ‌తో మ‌హ‌దేవ్‌కు సంబంధం ఉందా? తాను గురువుగా భావించే మ‌హ‌దేవ్‌ను రిక్కీ ఎందుకు చంపాడు? రిక్కీ జ‌ర్నీలో వైద్య పాత్ర ఏమిట‌న్న‌దే ఏజెంట్ మూవీ క‌థ‌.

Hari Prasad S

TwittereMail
హరి ప్రసాద్ ఎస్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.
Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024