పనీర్ ఆరోగ్యానికి మంచిదే కానీ ఈ 5 మంది మాత్రం ఎక్కువ తినకూడదట

Best Web Hosting Provider In India 2024

పనీర్ ఆరోగ్యానికి మంచిదే కానీ ఈ 5 మంది మాత్రం ఎక్కువ తినకూడదట

Haritha Chappa HT Telugu
Published Mar 13, 2025 07:00 PM IST

పనీర్‌‌లో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయితే ఒక 5 మంది మాత్రం తినకూడదని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.

పనీర్
పనీర్ (pixabay)

శాకాహారులు ప్రోటీన్ అధికంగా పొందేందుకు పనీర్ తరచూ తింటారు. ఇది ఆరోగ్యానికి మంచిదే. పనీర్‌తో ఎన్నో భారతీయ వంటకాలు తయారు చేయవచ్చు. ఇంటికి అతిధులు వచ్చినప్పుడు పనీర్ వంటకాలు అక్కడ ఉండాల్సిందే. శాఖాహార అతిధులకు పనీర్ బటర్ మసాలా, పనీర్ ఫ్రై, పనీర్ బిర్యానీ వంటివి చేసేవారు. మన దేశంలో ఎక్కువమంది ఉన్నారు. అయితే పనీర్ కూడా ఎక్కువ పోషకాల్ని కలిగి ఉంటుంది.

పనీర్‌లో ప్రోటీన్లు, విటమిన్లు, క్యాల్షియం అధికంగా ఉంటాయి. దీన్ని అప్పుడప్పుడు మితంగా తినడం ఆరోగ్యానికి మంచిదే. అయితే పనీర్‌ను అమితంగా తింటే మాత్రం కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి. పనీర్ అధికంగా తినేవారు త్వరగా అనారోగ్యానికి గురవుతారు. ముఖ్యంగా కొన్ని రకాల వ్యక్తులు వీలైనంత తక్కువగా పనీరు తినాలి. ఎవరు పనీర్ తక్కువగా తినాలో తెలుసుకోండి.

అలెర్జీ

కొంతమందికి చిన్న చిన్న విషయాలకి అలెర్జీలు వచ్చేస్తాయి. కొన్ని రకాల దుమ్ము, ధూళి కూడా వారికి అలెర్జీలను కలిగిస్తుంది లాక్టోజ్ అసహనంతో బాధపడే వారు కూడా ఎక్కువ మందే ఉంటారు. పాలలో ఉండే లాక్టోస్ ను వీరు అరిగించుకోలేరు. పనీర్లో కూడా లాక్టోస్ అధికంగానే ఉంటుంది. అలాంటివారు పనీరు తక్కువగా తినాలి. పనీర్ తినడం వల్ల అలెర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగానే తక్కువగా తింటే ఆరోగ్యానికి మంచిది.

గుండె రోగులు

గుండె సమస్యలతో బాధపడేవారు. పనీర్‌ను ఎంత తక్కువగా తింటే అంత మంచిది. ఎందుకంటే దీనిలో కొవ్వు అధికంగా ఉంటుంది. పనీర్ అధికంగా తినడం వల్ల కొలెస్ట్రాల్ పరిమాణం పెరిగిపోతుంది. గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తక్కువ కొవ్వు ఉన్న ఆహారాలనే వీరు తినాలి. ఎక్కువ కొవ్వు ఉండే చీజ్ పనీర్ ను తినకపోతేనే ఆరోగ్యం.

అధిక రక్తపోటు

అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారు కూడా పనీర్‌కు దూరంగా ఉంటే మంచిది. ఇది చూడగానే నోరూరించేలా ఉంటుంది. అందుకే ఎక్కువమంది దీన్ని తినేందుకు ఇష్టపడతారు. పనీర్ లో అధిక మొత్తం సోడియం ఉంటుంది. ఇది దీని అధిక వినియోగం అధిక రక్తపోటుకు కారణం అవుతుంది. కాబట్టి హైబీపీ ఉన్నవాళ్లు పనీర్ ను తక్కువగా తింటే మంచిది.

జీర్ణవ్యవస్థ

కొంతమందికి సున్నితమైన జీర్ణవ్యవస్థ ఉంటుంది. అలాంటివారు పనీర్ ఎక్కువగా తింటే ఆ రోజంతా వారికి అరగక పొట్టనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే గ్యాస్ట్రిక్, అసౌకర్యం కూడా కలుగుతుంది. మరికొందరిలో విపరీతమైన విరేచనాలు కూడా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి పనీర్ ను ఎంపిక చేసుకునేటప్పుడు అది మీకు అరుగుతుందో లేదో తెలుసుకొని తినడం మంచిది.

ఫుడ్ పాయిజనింగ్

పనీర్ లో అధిక మొత్తంలో ప్రోటీన్ ఉంటుంది. కొంత మందికి అధిక మొత్తంలో ప్రోటీన్ ను శరీరం శోషించుకోలేదు. పైగా ఎంతో అసౌకర్యంగా అనిపిస్తుంది. మీకు కూడా తరచూ ఫుడ్ పాయిజనింగ్ అయ్యే సూచనలు ఉంటే అధిక ప్రోటీన్ ఉన్న పనీర్ ను ఎంత తక్కువగా తింటే అంత మంచిది. అప్పుడు ఫుడ్ పాయిజనింగ్ సమస్య ఏర్పడే అవకాశం తగ్గుతుంది.

(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)

Haritha Chappa

TwittereMail
హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.
Whats_app_banner

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024