




Best Web Hosting Provider In India 2024

OTT: ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో నయా హిస్టారికల్ రొమాంటిక్ డ్రామా- 80 కోట్ల బడ్జెట్- స్టార్ కిడ్స్ ఎంట్రీ మూవీ ఎక్కడంటే?
Azaad OTT Streaming Date Official Announcement: ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో ఆజాద్ స్ట్రీమింగ్ కానుంది. పీరియాడిక్ రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఆజాద్ మూవీతో స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ కూతురు రాషా తడానీ, స్టార్ హీరో అజయ్ దేవగన్ మేనల్లుడు అమన్ దేవగన్ డెబ్యూ ఎంట్రీ ఇచ్చారు.

Azaad OTT Release Date Official Announcement: ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో ఆజాద్ సినిమా స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించి సదరు ఓటీటీ ప్లాట్‌ఫామ్ అధికారిక ప్రకటన తాజాగా ఇచ్చింది. ఆజాద్ సినిమాలో అమన్ దేవగన్, రాషా తడానీ హీరో హీరోయిన్స్‌గా నటించారు. అయితే, వీరిద్దరికి ఈ సినిమానే తొలి చిత్రం.
ఉయ్ అమ్మ పాటతో
బాలీవుడ్‌లో ఆజాద్ సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు రాషా తడానీ, అమన్ దేవగన్. ఒకప్పటి స్టార్ హీరోయిన్, నటి రవీనా టాండన్ కుమార్తెనే రాషా తడానీ. అలాగే, బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ మేనల్లుడు అమన్ దేవగన్. వీరిద్దరి జంటగా వచ్చిన ఆజాద్ మంచి బజ్ క్రియేట్ చేసింది. అంతేకాకుండా సినిమాలో ఉయ్ అమ్మ పాట సోషల్ మీడియాలో దేశవ్యాప్తంగా సెన్సేషన్ అయింది.
బడ్జెట్ అండ్ కలెక్షన్స్
ఆజాద్‌లోని ఉయ్ అమ్మ సాంగ్‌లో రాషా తడానీ డ్యాన్స్ మూమెంట్స్, ఎక్స్‌ప్రెషన్స్, హాట్‌నెస్‌కు బాలీవుడ్ ఫిదా అయింది. అలాగే, అమన్ దేవగన్ స్క్రీన్ ప్రజెన్స్ ఆకట్టుకుంది. ఒక్క పాటతో ట్రెండింగ్‌లోకి దూసుకెళ్లిన ఆజాద్ సినిమా బాక్సాఫీస్ వద్ద మాత్రం చేతులెత్తేసింది. సుమారు రూ. 80 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఆజాద్ సినిమాకు కేవలం రూ. 9 నుంచి 10 కోట్ల మధ్యే వరల్డ్ వైడ్ కలెక్షన్స్ నమోదు అయ్యాయి.
ఆజాద్ ఓటీటీ స్ట్రీమింగ్
దాంతో బాక్సాఫీస్ వద్ద ఆజాద్ మూవీ భారీ డిజాస్టర్‌గా నిలిచింది. జనవరి 17న థియేటర్లలో విడుదలైన ఆజాద్ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేయనుంది. అది కూడా మరికొన్ని గంటల్లోనే. మార్చి 14 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఆజాద్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించి ఆజాద్ ఓటీటీ రిలీజ్ డేట్‌ను నెట్‌ఫ్లిక్స్ తాజాగా అధికారికంగా ప్రకటించింది.
పీరియాడిక్ రొమాంటిక్ డ్రామా
ప్రస్తుతం అయితే కేవలం హిందీ భాషలోనే ఆజాద్ ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. కాగా, బ్రిటీష్ కాలం నాటి పాలనలో సాగే పీరియాడిక్ రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా ఆజాద్ తెరకెక్కింది. చరిత్రాత్మకమైన హల్దీఘాట్ వార్‌ను బేస్ చేసుకుని ఆజాద్ మూవీని రూపొందించారు.
ఆజాద్ నటీనటులు
ఆజాద్ సినిమాకు అభిషేక్ కపూర్ దర్శకత్వం వహించారు. ప్రగ్యా యాదవ్, రోనీ స్క్రూవాలా నిర్మాతలుగా ఉన్నారు. అమిత్ త్రివేది, హితేష్ సోనిక్ సంగీతం అందించారు. ఆజాద్ సినిమాలో రాషా తడానీ, అమన్‌తోపాటు అజయ్ దేవగన్, డయానా పెంటీ, పియూష్ మిశ్రా, మోహిత్ మాలిక్, అక్షయ్ ఆనంద్ ఇతర కీలక పాత్రలు పోషించారు.
నటనకు మంచి మార్కులు
ఆజాద్ సినిమాలో రాషా తడానీ, అమన్ దేవగన్ నటనకు మంచి మార్కులు పడినప్పటికీ బాక్సాఫీస్ ఫెయిల్యూర్‌గా నిలించింది. అయితే, రాషా తడానీ తెలుగులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబినేషన్ మూవీ ఆర్‌సీ16తో డెబ్యూ ఎంట్రీ ఇవ్వనుందని టాక్ నడిచింది. కానీ, అది నిజం కాదని సమాచారం.
ఆజాద్ ఐఎమ్‌డీబీ రేటింగ్
ఇదిలా ఉంటే, ఆజాద్ సినిమాకు ఐఎమ్‌డీబీ నుంచి 4.6 రేటింగ్ మాత్రమే వచ్చింది. మరి నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ రిలీజ్ అయిన తర్వాత ఆజాద్ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో వేచి చూడాలి.
సంబంధిత కథనం