OTT Horror: ఓటీటీలో ట్విస్టులతో మతి పోగొట్టే మలయాళం హారర్ మిస్టరీ థ్రిల్లర్.. తెలుగులో స్ట్రీమింగ్.. 7 రేటింగ్!

Best Web Hosting Provider In India 2024

OTT Horror: ఓటీటీలో ట్విస్టులతో మతి పోగొట్టే మలయాళం హారర్ మిస్టరీ థ్రిల్లర్.. తెలుగులో స్ట్రీమింగ్.. 7 రేటింగ్!

Sanjiv Kumar HT Telugu
Published Mar 14, 2025 05:30 AM IST

Churuli OTT Streaming In Telugu: ఓటీటీలో ట్విస్టులతో మతి పోగొట్టే మలయాళ సైన్స్ ఫిక్షన్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ చురులి స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళ ప్రముఖ నటులు జోజు జార్జ్, సౌబిన్ షాహిర్, చెంబన్ వినోద్ జోస్, వినయ్ ఫోర్ట్ నటించిన తెలుగు ఓటీటీ స్ట్రీమింగ్ మూవీ చురులి ప్లాట్‌ఫామ్ ఏంటో తెలుసుకుందాం.

ఓటీటీలో ట్విస్టులతో మతి పోగొట్టే మలయాళం హారర్ మిస్టరీ థ్రిల్లర్.. తెలుగులో స్ట్రీమింగ్.. 7 రేటింగ్!
ఓటీటీలో ట్విస్టులతో మతి పోగొట్టే మలయాళం హారర్ మిస్టరీ థ్రిల్లర్.. తెలుగులో స్ట్రీమింగ్.. 7 రేటింగ్!

Churuli OTT Release Telugu: ఓటీటీలో వచ్చే మలయాళం సినిమాలకు ఎంత పెద్ద క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల కాలంలో కూడా రేఖాచిత్రం, ఐడెంటిటీ వంటి ఎన్నో సినిమాలు అటు థియేటర్లలో ఇటు ఓటీటీలో సత్తా చాటాయి. అందుకే ఎప్పుడు మాలీవుడ్ చిత్రాలకు స్పెషల్ క్రేజ్ ఉంటుంది.

ఓటీటీలో ఎక్కువగా

అందుకే మలయాళం సినిమాలను చూసేందుకు అన్ని ఇండస్ట్రీల ఆడియెన్స్ ఆసక్తి చూపిస్తుంటారు. వారికి అభిరుచికి తగినట్లుగానే ఆ సినిమాలు కూడా ఉంటున్నాయి. ఇక ఓటీటీలో ఎక్కువగా అలరించే జోనర్స్‌లలో హారర్ థ్రిల్లర్స్ ఒకటి. ఇలాంటి జోనర్‌లో ట్విస్టులతో మతి పోగొట్టే ఓ మలయాళ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అదే చురులి.

జోజు జార్జ్-సౌబిన్ షాహిర్

చెంబన్ వినోద్, వినయ్ ఫోర్ట్ ప్రధాన పాత్రల్లో నటించిన చురులిలో మలయాళ పాపులర్ యాక్టర్స్ జోజు జార్జ్, సౌబిన్ షాహిర్ క్లైమాక్స్ చివర్లో కీలక పాత్రలు పోషించారు. వీరితోపాటు జాఫర్ ఇడుక్కి, గీతి సంగీత తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. వినయ్ థామస్ కథ అందించిన చురులి సినిమాకు లిజో జోస్ పెళ్లిస్సేరీ దర్శకత్వం వహించారు.

మైండ్ గేమ్ ఆడేలా

సైన్స్ ఫిక్షన్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన చురులి 2021 ఫిబ్రవరి 11న థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అయితే, చురులి మూవీ ఒక పర్ఫెక్ట్ మిస్టరీ థ్రిల్లర్. ఏమాత్రం అర్థం కానీ పజిల్స్‌తో మైండ్ గేమ్ ఆడుతుంటుంది. ఆ పజిల్స్ కానీ, ట్విస్టులను మాత్రం ఊహించలేం. అర్థం కావడానికి కూడా చాలా టైమ్ పడుతుంది.

ఐఎమ్‌డీబీ రేటింగ్ 7

అయితే, బుర్రపాడు సీన్స్‌తో ఇదేం సినిమారా అనే భావన కలుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా చూసే ఆడియెన్స్‌కు చురులి ఒక మెదడుకు మేత అనుకోవచ్చు. అందుకే ఈ సినిమాకు ఐఎమ్‌డీబీ నుంచి 7 రేటింగ్ వచ్చింది. ఇప్పుడు ఈ మలయాళ సినిమాను తెలుగులో కూడా వీక్షించవచ్చు.

సైన్స్ ఫిక్షన్, హారర్ ఎలిమెంట్స్

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనీ లివ్‌లో చురులి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. సైన్స్ ఫిక్షన్, హారర్ వంటి అంశాలతో సాగే చురులి ఓటీటీలో కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక సినిమాలో అక్కడక్కడ వచ్చే బీజీఎమ్ పిచ్చెక్కిస్తుంది. మనుషులు ప్రవర్తించే తీరు ఊహించని విధంగా ఉంటుంది. నిజానికి చురులి ఒక లూప్ కాన్సెప్ట్‌ మీద ఆధారపడి తెరకెక్కింది.

క్రిమినల్ కోసం అడవిలోకి

సినిమాలో ఏ సీన్ ఎందుకు వచ్చింది, ఏ పాత్ర ఎందుకు అలా బిహేవ్ చేస్తుందో చూసే ఆడియెన్స్ ఇమాజిన్ చేయలేరు. చురులి కథ విషయానికొస్తే.. ఒక క్రిమినల్‌ను పట్టుకునేందుకు ఓ ఎస్సై, ఒక కానిస్టేబుల్ దట్టమైన అడవిలో ఉండే చురులి గ్రామానికి వెళ్తారు. అక్కడ మారు పేర్లతో ఓ హోటల్‌లో పనికి చేరుతారు. ఆ తర్వాత చురులి గ్రామంలో ఇద్దరు పోలీసులు ఎదుర్కొన్న అనుభవాలే మిగతా కథ.

డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్

దాదాపుగా సినిమా కాన్సెప్ట్ అంతా చురులి ప్రారంభంలోనే తెలిసిపోతుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ట్విస్ట్ చాలా బాగుంటాయి. కానీ, అర్థం చేసుకోవడం చాలా కష్టం. చాలా వరకు ఆడియెన్స్‌కు చురులి నచ్చకపోవచ్చు. కానీ, ఒక డిఫరెంట్ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను చురులి ద్వారా చేయొచ్చు. కాబట్టి, డిఫరెంట్ సినిమాలు చూడాలనుకునేవారు సోనీ లివ్‌ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న చురులిపై ఓ లుక్కేసుకోవచ్చు.

Sanjiv Kumar

TwittereMail
సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌ కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024