Rupee symbol : ‘రూపీ’ని డిజైన్​ చేసిన వ్యక్తికి డీఎంకేతో లింక్​- అప్పుడు అలా, కానీ ఇప్పుడు..

Best Web Hosting Provider In India 2024


Rupee symbol : ‘రూపీ’ని డిజైన్​ చేసిన వ్యక్తికి డీఎంకేతో లింక్​- అప్పుడు అలా, కానీ ఇప్పుడు..

Sharath Chitturi HT Telugu
Published Mar 14, 2025 07:15 AM IST

Rupee symbol : తమిళనాడు బడ్జెట్​ లోగో నుంచి రూపీ సింబల్​ని తొలగించి మరో వివాదానికి తెరతీసింది స్టాలిన్​ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం. ఇంతకీ ఈ రూపీ సింబల్​ని డిజైన్​ చేసింది వ్యక్తి ఎవరో మీకు తెలుసా? ఆయనకి- డీఎంకేకి లింక్​ ఉందని మీకు తెలుసా?

రూపీ చిహ్నాన్ని డిజైన్​ చేసింది ఈయనే!
రూపీ చిహ్నాన్ని డిజైన్​ చేసింది ఈయనే! (Facebook)

2025-2026 బడ్జెట్​ లోగోలో.. దేశం ఆమోదించిన ‘రూపీ’ సింబల్​ని మార్చి సంచలనం సృష్టించింది తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం. సాధారణంగా వినియోగించే ‘ ‘ చిహ్నం కాకుండా, దాని స్థానంలో తమిళ అక్షరం ‘రు’ని ప్రవేశపెట్టింది. వినియోగంలో ఉన్న రూపీ సింబల్​ లేకుండానే, మార్చ్​ 14న తమిళనాడు అసెంబ్లీలో బడ్జెట్​ని ప్రవేశపెట్టనుంది సీఎం స్టాలిన్​ నేతృత్వంలో డీఎంకే. తమిళనాడు ప్రభుత్వం- కేంద్రం మధ్య హిందీ భాష, డీలిమిటేషన్​ వంటి అంశాల్లో విభేదాలు కొనసాగుతున్న తరుణంలో రూపీ సింబల్​ని మార్చడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దీనిపై బీజేపీ సహా ఇతర విపక్షాలు మండిపడుతున్నాయి. అయితే.. ఇప్పుడు రూపీ సింబల్​ని డీఎంకే తొలగించింది కానీ, వాస్తవానికి ఈ చిహ్నాన్ని డిజైన్​ చేసింది ఆ పార్టీకి చెందిన ఒక నేత కుమారుడే అని మీకు తెలుసా?

రూపీ సింబల్​ని డిజైన్​ చేసింది ఈయనే..

2010లో యూపీఏ ప్రభుత్వం హయాంలో ఈ రూపీ సింబల్​ని కేంద్రం ప్రవేశపెట్టింది. దీనిని ఉదయ కుమార్​ ధర్మలింగం అనే తమిళనాడు వ్యక్తి డిజైన్​ చేశారు. ఈయన డీఎంకే మాజీ ఎమ్మెల్యే, రిషివండియం నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించిన ఎన్​ ధర్మలింగం కుమారుడు.

భారత రూపాయికి అంతర్జాతీయంగా గుర్తింపు దక్కే విధంగా ఒక సింబల్​ ఉండాలని భావించిన అప్పటి యూపీఏ ప్రభుత్వం.. డిజైన్​ కోసం ఒక ఓపెన్​ కాంపిటీషన్​ నిర్వహించింది. ఇందులో 3,300 మంది పాల్గొన్నారు. వాటన్నింటిలో ఉదయ కుమార్​ ధర్మలింగం డిజైన్​ చేసిన ‘ ‘ ఎంపికైంది. ఈ సింబల్​.. దేవనగరిలోని ‘ర’, రోమన్​ లెటర్​ ‘ఆర్​’ కలయికతో కూడిన డిజైన్​.

ఇప్పుడు దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. భారత కరెన్సీ, ఐడెంటిటీలో ఒక భాగమైపోయింది. దేశంలోనే కాదు అంతర్జాతీయ లావాదేవీల్లోనూ ఈ చిహ్నం ప్రత్యేకంగా నిలుస్తోంది.

ఐఐటీ బాంబేలో ఉదయ కుమార్​ ఒక డిజైన్​ పోస్ట్​గ్రాడ్యుయేట్​. ప్రస్తుతం ఆయన ఐఐటీ గువాహటీలో ప్రొఫెసర్​గా పనిచేస్తున్నారు. రూపీ చిహ్నంపై తాజాగా నెలకొన్న వివాదంపై ఆయన స్పందించారు.

“రూపీ సింబల్​ని తమిళనాడు ప్రభుత్వం ఎందుకు మార్చిందో నాకు పూర్తిగా తెలియదు. కానీ ఏదైనా మార్పు చేసేందుకు ప్రభుత్వానికి వ్యూహాలు, ఆలోచనలు ఉంటాయి. 15ఏళ్ల క్రితం ప్రభుత్వం నిర్వహించిన పోటీల్లో నేను ఈ డిజైన్​ని రూపొందించాను. గెలిచాను. రూపీ సింబల్​ని డిజైన్​ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఇలాంటి ఒక చర్చ (రూపీ సింబల్​ మార్పు) జరుగుతుందని నేను ఊహించలేదు,” అని ఉదయ కుమార్​ ధర్మలింగం అన్నారు.

స్టాలిన్​ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం రూపీ సింబల్​ని మార్చడంపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​ మండిపడ్డారు.

“రూపీ సింబల్​తో సమస్య ఉంటే 2010లోనే డీఎంకే ఎందుకు ప్రతిఘంటించలేదు? ఆ సమయంలో యూపీఏ కూటమిలో డీఎంకే భాగంగానే ఉంది. మరి ఇప్పుడు ఎందుకు సమస్య వస్తోంది,” అని నిర్మలా సీతరామన్​ అన్నారు.

“డీఎంకే ప్రభుత్వం.. రూపీ సింబల్​ని తొలగించడం అంటే జాతీయ చిహ్నాని తొలగించడమే కాదు, తమిళనాడు యువత సృజనాత్మ ఆలోచనలను కొట్టిపారేయడంతో సమానం,” అని ఆరోపించారు.

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.
Whats_app_banner

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link