Brahmamudi March 14th Episode: పిచ్చిదానిలా కావ్య, సీఈఓగా రాహుల్- యామిని సైకో డ్రామా, పెద్ద ట్విస్ట్ ఇచ్చిన తండ్రి!

Best Web Hosting Provider In India 2024

Brahmamudi March 14th Episode: పిచ్చిదానిలా కావ్య, సీఈఓగా రాహుల్- యామిని సైకో డ్రామా, పెద్ద ట్విస్ట్ ఇచ్చిన తండ్రి!

Sanjiv Kumar HT Telugu
Published Mar 14, 2025 07:44 AM IST

Brahmamudi Serial March 14th Episode: బ్రహ్మముడి మార్చి 14 ఎపిసోడ్‌లో కావ్యను చూసి పిచ్చిదైపోయేలా ఉందని స్వప్న అంటుంది. లేదు, కావ్య నమ్మకమే నిజం కావచ్చేమో, ప్రతికోణంలో ఇన్వెస్టిగేట్ చేయాలని అప్పు అంటుంది. రాహుల్‌ను సీఈఓగా రెడీ చేస్తుంది రుద్రాణి. సైకో డ్రామా ఆడిన యామినికి తండ్రి పెద్ద షాక్ ఇస్తాడు.

బ్రహ్మముడి సీరియల్‌ మార్చి 14వ తేది ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్‌ మార్చి 14వ తేది ఎపిసోడ్

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో భోజనం ఎవరు చేయకుండా వెళ్లిపోతారు. దాంతో కృష్ణుడి దగ్గరికి వెళ్లి మొరపెట్టుకుంటుంది కావ్య. ఆయన లేరంటున్నారు, రాడని అంటున్నారు. నా మాట ఎవరు నమ్మట్లేదు. కానీ, నా మనసాక్షి చెబుతోంది. ఆయన బతికే ఉన్నారు అని కావ్య అంటుంది.

వీళ్ల ముందు నిలబెట్టాలి

ఆ మాటలు స్వప్న, అప్పు వింటారు. నువ్ చెరువులో పడినప్పుడు తల్లి యశోదమ్మ కూడా నువ్ రావని అనుకుంది. కానీ, నువ్ పాము పడగపై నాట్యం ఆడుతూ తేలుతూ వచ్చావ్. అలాగే ఆయన కూడా తిరిగి వస్తారు. కానీ, వీళ్లను ఎలా నమ్మించాలో, వీళ్ల బాధను ఎలా తగ్గించాలో నాకు తెలియదు. ఆయనను త్వరగా తీసుకొచ్చి వీళ్ల ముందు నిలబెట్టాలి. నాకు బాధ ఉంది. అంతకంటే ఎక్కువ బాధ్యత ఉంది. ఆయన్ని ఇంటికి తీసుకొచ్చెవరకు కొనసాగించే సంకల్పం నాకు ఇవ్వు అని కావ్య వేడుకుంటుంది.

మరోవైపు రాజ్‌కు పొలమారుతుంది. యామిని నీళ్లు ఇస్తుంది. ఎవరో బాగా తల్చుకుంటున్నట్లు ఉన్నారు అని యామిని తండ్రి అంటాడు. ఇంకెవరు ఆయన భార్య అయి ఉంటుంది అని వైధేహి అంటుంది. దాంతో అంతా షాక్ అవుతారు. భార్య.. అని నాకు పెళ్లి అయిందా అని రాజ్ అంటాడు. అదే బాబు యామిని నీకు కాబోయే భార్య కదా. నీ పక్కనే ఉన్నా నీ గురించే ఆలోచిస్తుంటుంది అని వైధేహి కవర్ చేస్తుంది. ఈ ప్రపంచంలో నేను, మేము తప్పా నీకు ఎవరు లేరు. ఉన్నారని ఆలోచించకు అని యామిని అంటుంది.

మెంటల్‌గా డిస్టర్బ్ అయిందా

తల్లిని కోపంగా చూస్తుంది యామిని. రాజ్ గురించి ఆలోచిస్తూనే, జ్ఞాపకాల్లో ఉంటుంది కావ్య. మరోవైపు ఏం అర్థంకాని అయోమయంలో ఉంటాడు రాజ్. యామిని చెప్పిన మాటలను రాజ్ గుర్తుకు తెచ్చుకుంటాడు. అప్పు, స్వప్న కావ్య గురించి మాట్లాడుకుంటారు. అందరు బాధలో ఉంటే ఏం పట్టనట్లు, బావ బతికే ఉన్నాడని అక్క నమ్ముతుంది. అసలు అక్క ఏం చేస్తుందో నాకు అర్థం కావట్లేదు. అక్కను చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. అక్క నిజంగా ధైర్యంగా ఉందా లేకపోతే నటిస్తుందా. లేక మెంటల్‌గా డిస్టర్బ్ అయి అలా ప్రవర్తిస్తుందా అని అప్పు అంటుంది.

నిజంగానే కావ్య పిచ్చిదైపోతుందని భయమేస్తుంది అని స్వప్న అంటుంది. ఎందుకు పిచ్చిది అవుతుంది. నిజంగా కావ్య నమ్మకమే నిజమైపోతుందేమో. బావ తిరిగి వస్తాడేమో అని అప్పు అంటుంది. ఎలా అనుకోమంటావే. నీ చేతులతో రాజ్ బట్టలు, వస్తువులు చూపించావ్ కదా. నువ్ ఒక పోలీస్ ఆఫీసర్‌వి.. కావ్య చెల్లి, బావ మరదలిగా మాట్లాడకు అని స్వప్న అంటుంది. నేను ఒక పోలీస్‌గానే చెబుతున్నాను. వస్తువులు తెచ్చాను కానీ, బావ బాడీ చూడలేదు కదా అని అప్పు అంటుంది.

ప్రతికోణంలో ఇన్వెస్టిగేట్

అంటే, ఈ విషయంలో ఇంకొంచెం డీప్‌గా ఆలోచించాలి. ప్రతికోణంలో ఇన్వెస్టిగేట్ చేయాలి. ఎక్కడో ఏదో తప్పు జరిగింది. చిన్న క్లూ దొరికినా దాని చైన్ లాగుతాను. అటోమేటిక్‌గా డొంకంత కదులుతుంది అని అప్పు అంటుంది. మరోవైపు రాజ్‌ను చూస్తూ కాలేజీలో నీ వెంట తిరిగెటప్పుడు ఇలా నీతో ఏకాంతంగా గడపాలని చాలాసార్లు అనుకున్నా. ఎప్పుడు ఆ అవకాశం నువ్ నాకివ్వలేదు. కానీ ఆ దేవుడు నిన్ను నా ఇంట్లోనే పడేశాడు. నా ప్రేమ నిజం కాకపోతే ఇదంతా ఎందుకు జరుగుతుంది. ఇప్పుడు నేను చేయాల్సింది నిన్ను నావైపు తిప్పుకోవడమే అని యామిని అంటుంది.

వెనుక నుంచి వెళ్లి రాజ్‌ను ప్రేమగా హగ్ చేసుకుంటుంది యామిని. దాంతో ఉలిక్కిపడిన రాజ్ వదిలించుకుంటాడు. వెనక్కి తిరిగి చూసి హో మీరా.. సారీ నువ్వా.. నేనింకా ఎవరో అనుకున్నా అని రాజ్ అంటాడు. ఈ ఇంట్లో ఇలా పట్టుకునేది ఇంకెవరు బావ. ఇలా నాకు తప్ప నువ్ ఎవరికీ ఇవ్వలేదు అని యామిని అంటుంది. ఎందుకు డల్‌గా ఉంటున్నావ్. నీ గతంలో ఏం జరిగిందో నీకు గుర్తుకు రావట్లేదు అంతేగా. నీ చుట్టు ఉన్నవాళ్లను చూస్తే నమ్మకం రావట్లేదా. నా మాటలు నమ్మాలని అనిపించట్లేదా అని యామిని అంటుంది.

ఫ్రీగా ఉండలేకపోతున్నా

అదేం లేదు. నీ కళ్లల్లో నాపై ఇష్టం కనిపిస్తుంది. అంకుల్ ఆంటీ కేరింగ్ కనిపిస్తుంది. ఫొటోల్లో మన గతం తెలుస్తుంది అని రాజ్ అంటాడు. మరి ఎందుకు నన్ను దూరం పెడుతున్నావ్ అని యామిని అంటే.. అదే నాకు అర్థం కావట్లేదు. మీరు ఎంత ప్రేమ చూపిస్తున్నా ఫ్రీగా ఉండలేకపోతున్నాను అని రాజ్ అంటాడు. దాంతో యామిని ఫీల్ అవుతుంది. సారీ నా మాటలతో నిన్ను హర్ట్ చేస్తున్నాను అని రాజ్ అంటాడు. ప్రేమ, అఫెక్షన్ మనసుకు సంబంధించినవి. ఇవన్ని నీ మనసుకు ఎందుకు తెలియడం లేదు అని యామిని అంటుంది.

దాంతో రాజ్ అదోలా ఫీల్ అవుతాడు. మరి ఇబ్బంది పెట్టేస్తున్నట్లున్నాను. ఆపుదాం అనుకున్న యామిని.. సారీ బావ నిన్ను ఇబ్బంది పెడుతున్నాను. నేను ఒక ఫూల్‌ని. నీకు గుర్తుకు వచ్చేంత వరకు నేను వెయిట్ చేస్తాను. నేనెప్పుడు ఇలా ప్రెజర్ పెట్టను. నువ్వెళ్లి రెస్ట్ తీసుకో బావ అని అంటుంది. దాంతో రాజ్ వెళ్లిపోతాడు. నువ్ దారిలోకి రావాలంటే ఈ డోస్ సరిపోదు రాజ్. రేపటి నుంచి ఇంకా ఇంకా నీపై ప్రెజర్ తీసుకొస్తా.. నేనే నీ గతాన్నీ, జ్ఞాపకాన్ని అనేలా చేస్తాను అని యామిని అనుకుంటుంది.

మరోవైపు సీఈఓలా రాహుల్‌ను రుద్రాణి రెడీ చేస్తుంది. ఇదంతా అవసరమా అని రాహుల్ అడిగితే.. ఆ రాజ్ గాడు చచ్చి నీకు నేరుగా అవకాశం ఇచ్చాడు. ఇంతకుముందు సమస్యలు ఉంటే రాజ్‌తోపాటు కావ్య కూడా వెళ్లి చూసుకునేది. ఇప్పుడు దానికి అంత సీన్ లేదు. పోయినా మొగుడు ఎప్పుడు తిరిగి వస్తాడా అంటూ పిచ్చిదైపోతుంది. ఇక ఇల్లంత శోకసంద్రంలో మునిగిపోయింది. మనం కూడా ఏడుస్తున్నట్లు నటిస్తూ సంతోషంగా చాపకింద నీరులా కంపెనీ బాధ్యతలు తీసుకుంటాం. ఇదే రైట్ టైమ్. కనీసం ఇప్పటినుంచి అయినా నీ బుర్రకు పదును పెట్టు అని రుద్రాణి అంటుంది.

సీఈఓ సీటును

బొమ్మరిల్లు ఫాదర్‌లా నేను చేసే పనులు నువ్ చేయడం వల్ల ఇలా ఉన్నాను కానీ, నన్ను ఇండివిజువల్‌గా వదిలేస్తే నా టాలెంట్ ఏంటో చూపిస్తా అని రాహుల్ అంటాడు. లాస్ట్ టైమ్ ఇలాగే చేసి అవకాశం చెడగొట్టావ్. నేను చెప్పినట్లు చేస్తే చాలా సక్సెస్ అవుతావురా. లేదంటే బొక్క బోర్లా పడతావ్ అని రుద్రాణి అంటుంది. ఈసారి సీఈఓ సీట్ గట్టిగా పట్టుకోవాలని అర్థమైంది అని రాహుల్ అంటాడు. దుగ్గిరాల బ్యాచ్ బాధనుంచి తేరుకునేలోగా నువ్ తప్ప ఇంకో ఆప్షన్ లేదనేలా చేయాలి అని రుద్రాణి అంటుంది.

ఈసారి మిస్ ఫైర్ అయితే నిన్ను ఫైర్ చేసేస్తాను. నిన్ను నమ్మడానికి లేదు. కొడుకును రాజును చేసి నేను శివగామిలా రాజ్యాన్ని ఏలుదామనుకుంటే నేనే రాజు నేనే మంత్రి అన్నట్లు అయిపోయింది నా పరిస్థితి. నిన్ను కుర్చీలో కూర్చొబెట్టిన తర్వాత నేను రిస్క్‌లు పడాలి. పడతాను. కానీ మధ్య మధ్యలో ఏడుస్తున్నట్లు నటించు. లేకుంటే వాళ్లకు డౌట్ వస్తుంది అని రుద్రాణి ఏడ్చినట్లు మొహం పెడుతుంది. తర్వాత ఇద్దరు నవ్వుకుంటారు.

మరోవైపు ఉదయం యామిని, తన తల్లిదండ్రులు రామ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. నువ్వెవరో గుర్తుకు వస్తే నువ్వే జీవితాంతం బాధపడాలి. మంచో చెడో అతనికి గతం గుర్తుకు రాకముందే నువ్ తాళి కట్టించుకుంటే నీ దగ్గర రుజువులు ఉంటాయే అని వైధేహి అంటుంది. నువ్ అసలు తల్లివేనా. కూతురుకు నేర్పించాల్సినవి ఇవేనా అని తండ్రి అంటాడు. నాకు ఒకరు నేర్పించడం ఏంటీ డాడ్. ఇదంతా నా ప్లానే కదా అని యామిని అంటుంది.

ప్లేట్ తిప్పేసిన యామిని

ఇంతలో కిటికి వైపుకు రాజ్ వస్తాడు. అది చూసిన తల్లి వైధేహి యామినికి చెబుతుంది. దాంతో వెంటనే ప్లేట్ తిప్పేస్తుంది యామిని. బావ మాములు మనిషి అవుతాడని నాకు నమ్మకం లేదు. గతాన్ని గుర్తుకు చేయడానికి ట్రై చేస్తే బావ బ్రెయిన్ స్ట్రెయిన్ అవుతుందని డాక్టర్ చెబుతాడు కదా. అందుకే ఆగిపోతున్నాను. అది తెలియక బావ నన్ను పరాయి వాడిలా చూస్తుంటే తట్టుకోలేకపోతున్నాను. నాకు నరకంగా ఉంది మామ్ అని యామిని అంటుంది.

దాంతో రాజ్ ఆలోచనలో పడిపోతాడు. ఏంటో అమ్మ నాకే ఇలా జరుగుతుంది. అన్నీ బాగుంటే ఈరోజు హనీమూన్‌లో ఉండేవాళ్లం. సడెన్‌గా అంతా బ్లాంక్‌గా అయిపోయింది అని యామిని అంటుంది. దానికి వత్తాసు పలుకుతుంది తల్లి. నువ్వే ప్రపంచం అన్నట్లు తిరిగేవాడు అని వైధేహి అంటుంది. రాజ్ ప్రవర్తన బాధపెడుతుందన్నట్లుగా డ్రామా చేస్తుంది యామిని. అందుకే ఓ పని చేద్దాం. మంచి సైకియార్టిస్ట్‌కు చూపిద్దాం. కొన్ని సెషన్స్ చేపిస్తే గతం గుర్తుకు వస్తుందని పెద్ద ట్విస్ట్ ఇస్తాడు యామిని తండ్రి.

దాంతో యామిని, వైధేహి షాక్ అవుతారు. గతం గుర్తుకు వస్తే నువ్వు ఎవరో తెలిసిపోతుంది కదా అని యామిని తండ్రి అంటాడు. డాడ్ గతం గుర్తుకు వచ్చే ప్రయత్నం చేస్తే మెదడు నరాలు చితికిపోయే ప్రమాదం ఉందని డాక్టర్ చెప్పాడు కదా. అలా చేస్తే బావ ప్రాణాలకు ప్రమాదం కదా. ఇంతకష్టపడి కాపాడుకున్న తర్వాత బావకు మళ్లీ ఏమైనా అయితే నేను బతుకుతాను అనుకుంటున్నావా. నేను బతకను చచ్చిపోతాను. గుర్తుపెట్టుకో డాడ్ నేను ప్రాణాలతో ఉండను అని యామిని అంటుంది.

సైకోలా యామిని

అంత దూరం ఎందుకు ఆలోచిస్తున్నావ్. మీ డాడీ సలహా ఇచ్చారు అంతే. గతం గుర్తుకు వచ్చిన రాకున్న నువ్ రామ్‌కు మరదలు కాకుండా పోవు అని తల్లి అంటుంది. దాంతో రాజ్ ఆలోచనలో పడుతుంది. అది చూసి యామిని సైకోలా నవ్వుతుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

Sanjiv Kumar

TwittereMail
సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌ కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024