






Best Web Hosting Provider In India 2024

Karthika Deepam 2 March 14th Episode: బెడిసికొట్టిన జ్యోత్స్న ప్లాన్ – చెంప పగలగొట్టిన దీప – పుట్టింటిపై కాంచన కోపం
Karthika Deepam 2: కార్తీక దీపం 2 మార్చి 14 ఎపిసోడ్‌లో వంటలో విషం కలిపి కార్తీక్, దీపలను ఇరికించాలనే జ్యోత్స్న ప్లాన్ బెడిసికొడుతుంది. జ్యోత్స్న కుట్రలు కనిపెట్టిన దీప ఆమె చెంపలు వాయిస్తుంది. మరోసారి తప్పు చేస్తే మీ తాత ముందు పంచాయితీ పెడతానని జ్యోత్స్నకు కార్తీక్ వార్నింగ్ ఇస్తాడు.

జ్యోత్స్న కంపెనీకి చెందిన పెద్ద క్యాటరింగ్ కాంట్రాక్ట్‌ను కార్తీక్ సొంతం చేసుకుంటాడు. జ్యోత్స్న వల్లే కాంట్రాక్ట్ చేజారిందని భావించిన శివన్నారాయణ ఆమెను సీఈవో పదవి నుంచి తొలగిస్తాడు. ఈ ఓటమిని జ్యోత్స్న సహించలేకపోతుంది. ఆ కంపెనీకి దీప, కార్తీక్ సప్లై చేసే ఫుడ్‌లో విషం కలిపిస్తుంది. కార్తీక్, దీప ఓడిపోవడం ప్రత్యక్షంగా చూడాలని అక్కడికి వస్తుంది జ్యోత్స్న.
పోలీస్ స్టేషన్‌కు దీప, కార్తీక్…
విషం కలిపిన భోజనం తిన్న కంపెనీ ఎంప్లాయిస్ ఫుడ్ పాయిజన్‌తో హాస్పిటల్ పాలవుతారని, దీప, కార్తీక్ పోలీస్ స్టేషన్‌లో పడతారని జ్యోత్స్న అనుకుంటుంది. సత్యరాజ్ రెస్టారెంట్ క్లోజ్ అవుతుందని కలలు కంటుంది. దీపను దరిద్రదేవతగా నమ్మించి కార్తీక్ లైఫ్ నుంచి ఆమెను దూరం చేసి…తాను బావకు దగ్గర కావాలని అనుకుంటుంది.
వంట అదిరిపోయింది…
ఫుడ్ తింటున్న ఓ ఎంప్లాయ్ సీరియస్‌గా లేచి ఈ వంట ఎవరు చేశారని కోపంగా అడుగుతాడు. వంట అతడికి నచ్చలేదేమోనని దీప, కార్తీక్ కంగారు పడతారు. వంటలు అదిరిపోయాయని సమాధానమిస్తాడు. అతడి ఆన్సర్ విని దీప, కార్తీక్ ఆనందపడతారు. మీరు చేసిన వంట తింటుంటే మా అమ్మ గుర్తొచ్చిందని దీపను మెచ్చుకుంటాడు ఆ ఉద్యోగి. ఇంతకుముందు జ్యోత్స్న రెస్టారెంట్ క్యాటరింగ్ చేసేదని, వాళ్ల రెస్టారెంట్ వంటలు ఛండాలంగా ఉండేవని అంటాడు. అతడి మాటలు విన్న జ్యోత్స్న కోపం పట్టలేకపోతుంది.
చిన్న గ్యాప్‌లో…
తన ప్లాన్ బెడిసికొట్టడంతో కోపంగా వంటల్లో విషం కలిపిన వ్యక్తికి కాల్ చేస్తుంది. అతడు జ్యోత్స్న దగ్గరకు వస్తాడు. మందు సరిగ్గా కలిపావా లేదా అని అతడి కాలర్ పట్టుకుంటుంది. సరిగ్గానే కలిపాడని అక్కడి ఎంట్రీ ఇచ్చిన దీప బదులిస్తుంది. నువ్వు ఎంత కలపమన్నావో అంత కలిపాడు. మధ్యలో చిన్న గ్యాప్ వచ్చిందని, ఆ గ్యాప్‌లో ఏం జరిగిందో చెబుతుంది. మందు కలిపిన వినోద్‌ను దీప చెంప పగలగొడుతుంది. నీ డబ్బుకు అమ్ముడుపోయిన వినోద్ నా దెబ్బకు మారిపోయాడని జ్యోత్స్నతో అంటుంది దీప.
నిన్ను కొట్టాలి…
నిజానికి కొట్టాల్సింది వాడిని కాదు నిన్ను అని జ్యోత్స్నతో అంటుంది దీప. తినే భోజనంలో మందు కలుపుతావా అంటూ చెంపపై లాగిపెట్టి ఒక్కడి కొడుతుంది దీప. నా పేరు చెప్పు ఇంకోటి పీకు అని కార్తీక్ అంటాడు. నీ చుట్టూ మంచి మనుషులు ఉండటం వల్ల నువ్వు తప్పించుకుంటున్నావని కార్తీక్ అంటాడు.
ఏం బతుకు ఇది అని జ్యోత్స్నకు క్లాస్ ఇస్తుంది దీప. కార్తీక్ బాబు నా మెడలో తాళికట్టాడనే ఇవన్నీ చేస్తున్నావా అని నిలదీస్తుంది. ఇలాంటి వెధవ పనులు చేసి ఏం సాధిస్తావని జ్యోత్స్నను అడుగుతాడు కార్తీక్. మీ రెస్టారెంట్ కాంట్రాక్ట్ మాకు దక్కింది. అది తట్టుకోలేక ఏదో ఒకటి చేసి మా ఫుడ్ బాగాలేదని వాళ్లతో అనిపించి కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయలనే కదా నీ ప్లాన్ అని ఆమె కుట్రలను బయటపెడతాడు కార్తీక్. క్యాటరికంగ్ కాంట్రాక్ట్ కోసం మేము ఏ మాయలు చేయలేదని దీప అంటుంది.
తప్పుల మీద తప్పులు…
తప్పులు మీద తప్పులు చేస్తున్నావు. సహనానికి, క్షమించడానికి ఓ హద్దు ఉంటుందని జ్యోత్స్నతో అంటాడు కార్తీక్. నువ్వు మాకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయావు. నిన్ను ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు. కానీ నేను ఆ ఛాన్స్ తీసుకోనని అంటాడు. సుమిత్ర అత్తను చూసే నిన్ను వదిలేస్తున్నానని జ్యోత్స్నకు వార్నింగ్ ఇస్తాడు కార్తీక్. అన్ని ఇంతటితో ఆపేయమని, నా వెంట పడటం మానేయమని చెబుతాడు. పెళ్లిచేసుకోమని జ్యోత్స్నకు సలహా ఇస్తాడు. మరోసారి ఇలాంటి తలతిక్క పనులు చేస్తే ఈ సారి పంచాయితీ మీ తాత ముందు ఉంటుందని హెచ్చరిస్తాడు.
ఇంటి పరువు తీయకు…
మీ రెస్టారెంట్ ఫుడ్‌ను అందరూ తిడుతున్నారని, అమ్మమ్మ పేరుమీద తాత పెట్టిన రెస్టారెంట్ అదని జ్యోత్స్నతో కార్తీక్ అంటాడు. రెస్టారెంట్ పేరు చెడగొట్టి మన ఇంటి పరువు తీయద్దని జ్యోత్స్నకు సలహా ఇస్తాడు. వేస్ట్ గాడిని నమ్ముకొని ఇరుక్కుపోయానని జ్యోత్స్న కోపంతో చిందులు తొక్కుతుంది.
దశరథ్ ఆవేదన…
జ్యోత్ప్నను పెళ్లిచూపులు చూసుకోవడానికి గౌతమ్ వస్తున్నాడని సుమిత్రతో చెబుతాడు దశరథ్. ఆ శుభకార్యానికి కాంచన వస్తే బాగుంటుందని సుమిత్రతతో అంటాడు. నా చెల్లికి అన్నిరకాలుగా అన్యాయమే జరిగిందని దశరథ్ బాధపడతాడు. మూడుముళ్లు వేసి ఎగతాళి చేసి భర్త అన్యాయం చేశాడు. ఆస్తిలో వాటా ఇవ్వకుండా తండ్రి అన్యాయం చేశాడు. తల్లి ఇష్టంతో సంబంధం లేకుండా దీప మెడలో కార్తీక్ తాళి కట్టి అన్యాయం చేశాడని అంటాడు. అన్ని కళ్ల ముందే జరుగుతున్నా ఏం చేయలేక నేను అన్యాయం చేశానని అంటాడు.
కాంచనకు సుమిత్ర ఫోన్…
జ్యోత్స్న పెళ్లిచూపుల్లో కాంచన, కార్తీక్ లేకపోతేనే మంచిదని సుమిత్ర అంటుంది. మన కూతురి మీద దీప నిందలు వేస్తే మా చెల్లిని దూరం పెట్టాలని నువ్వు అనుకుంటున్నావా అని సుమిత్రపై ఫైర్ అవుతాడు దశరథ్. కార్తీక్‌కు, జ్యోత్స్నకు పెళ్లి చేయాలని అనుకున్నామని, అలాంటిది ఇప్పుడు కార్తీక్ ముందే గౌతమ్‌తో జ్యోత్స్న మాట్లాడటానికి ఇబ్బంది పడుతుందని భర్తతో అంటుంది సుమిత్ర. నువ్వు అన్నది నిజమే. కానీ పుట్టింటి విషయాలు ఎవరో చెబితే తెలుసుకునే స్థితిలో కాంచన ఉండకూడదని దశరథ్ అంటాడు. కాంచనకు ఫోన్ చేసి ఒక్కసారి మాట్లాడమని సుమిత్రను బతిమిలాడుతాడు.
వదిలిపెట్టేది లేదు…
జ్యోత్స్న చేసిన పని విని కాంచన కోపం పట్టలేకపోతుంది. ఇప్పుడే పుట్టింటికి వెళ్లి జ్యోత్స్నను నిలదీద్దామని అంటుంది. నిజంగానే విషం కలిపిన భోజనం ఎవరైన తింటే మీరు ఈ పాటికి పోలీస్ స్టేషన్‌లో ఉండేవాళ్లని కార్తీక్, దీపలతో కాంచన అంటుంది. రెస్టారెంట్‌ను మూయడానికే జ్యోత్స్న కంకణం కట్టుకుంటుందని, వదిలిపెట్టేది లేదని అంటాడు. జ్యోత్స్న తప్పులను మనం ఎందుకు భరించాలని అంటుంది. దీప వదిలేయమన్నదని వదిలేశానని కార్తీక్ అంటాడు. మరి అంత మంచితనం పనికిరాదని కాంచన అంటుంది.
తండ్రిని కడిగేస్తా….
ఎంత కాదనుకున్న జ్యోత్స్న మీ మేనకోడలు కదా అని అనసూయ అంటుంది. ఇంటి వారసురాలు ఏం చేస్తుందో ఇంట్లోవాళ్లు పట్టించుకోరా అని కాంచన కోపంగా అంటుంది. జ్యోత్స్నకు పెళ్లి చేసి పంపిస్తారా? లేదంటే మనల్ని ఎక్కడికైనా వెళ్లిపోమ్మంటారా అని తండ్రిని కడిగేస్తానని కాంచన కోపంగా అంటుంది.అప్పుడే కాంచనకు సుమిత్ర కాల్ చేస్తుంది.
కాంచన కోపం…
వదిన అని సుమిత్ర పిలుస్తుంది. చెప్పండి అని కోపంగా కాంచన బదులిస్తుంది. దీపను కొట్టినందుకే కాంచన కోపంగా మాట్లాడుతుందని సుమిత్ర అపోహపడుతుంది. మరోవైపు నీ కూతురు నా కొడుకును ఇంతలా ఏడిపిస్తుంటే ఇంకా వదిన అని ఎలా పిలవమని అంటావని కాంచన మనసులో అనుకుంటుంది.
జ్యోత్స్న పెళ్లి గురించి కాంచనతో చెబుతుంది సుమిత్ర. తాము బలవంతం చేయకుండానే గౌతమ్‌ను పెళ్లి చేసుకోవడానికి జ్యోత్స్న ఒప్పుకుందని కాంచనతో చెబుతుంది సుమిత్ర. సంతోషం అని కాల్ కట్ చేస్తుంది కాంచన.
దీప స్వీట్స్…
సుమిత్ర మీద చాలా గౌరవం ఉండేదని, కానీ జ్యోత్స్నను ఇలా యుద్ధానికి పంపించి సుమిత్ర ఏం చేస్తుందని కాంచన కోప్పడుతుంది. దీప అక్కడి నుంచి వెళ్లిపోవడంతో తన మాటలు దీపకు నచ్చలేదని కాంచన అనుకుంటుంది. కానీ కిచెన్ లోపలికి వెళ్లిన దీప…స్వీట్స్ తీసుకొచ్చి కాంచనకు ఇస్తుంది.
జ్యోత్స్న పెళ్లి కుదిరినందుకు, పెద్ద కంపెనీ కాంట్రాక్ట్ మనకు దక్కినందుకు అని అంటుంది. జ్యోత్స్పై పెళ్లయిపోతే తను ఇక మన జోలికి రాదని కాంచన సంబరపడుతుంది.
ఎక్కువ సంతోషపడాల్సింది మీరే…
కార్తీక్‌కు స్వీట్ ఇస్తుంది దీప. కానీ కార్తీక్ డల్‌గా కనిపిస్తాడు. అందరికంటే ఎక్కువ సంతోషంగా ఉండాల్సింది మీరే అని కార్తీక్‌తో అంటుంది దీప. ఇలాంటి తప్పులు మానేసి ఇంట్లోవాళ్లు చూసిన సంబంధం చేసుకోమని మీరు చెప్పిన మాట జ్యోత్స్న పాటిస్తుందని కార్తీక్‌తో అంటుంది దీప. అయినా కార్తీక్ సీరియస్‌గానే కనిపిస్తాడు. కార్తీక్‌పై ప్రేమతోనే జ్యోత్స్న తప్పుల మీద తప్పులు చేస్తుందని అనసూయ అంటుంది. కార్తీక్‌కు పెళ్లైపోయిది, వాడికి బిడ్డ కూడా ఉందని, అయినా కార్తీక్‌ను జ్యోత్స్న నీడలా వెంటాడుతుందని కాంచన బాధపడుతుంది.
జ్యోత్ప్నను నమ్మని కార్తీక్…
జ్యోత్స్న పెళ్లికి ఒప్పుకుందంటే కార్తీక్ నమ్మడు. నీకు పెళ్లైపోయిన పర్వాలేదు…దీపను వదిలేయ్ మనం మళ్లీ పెళ్లి చేసుకుందా అని బేరాలు పెట్టింది. నేను తిట్టితే నీతో బేరాలు పెట్టింది. ఆ తర్వాత నిన్ను, శౌర్యను అడ్డు తొలిగించుకొని నా జీవితంలోకి రావాలని చూసిందని కార్తీక్ అంటాడు. జ్యోత్స్న చేస్తున్న అరాచకాలు చూస్తూ కూడా ఆమెను ఎలా నమ్మేదని దీపతో కార్తీక్ అంటాడు. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ముగిసింది.
సంబంధిత కథనం