





Best Web Hosting Provider In India 2024

AP TG Summer Updates: తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు, పలు జిల్లాల్లో 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
AP TG Summer Updates: ఏపీ తెలంగాణల్లో ఎండలు మండిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలను దాటేశాయి. పగటి ఉష్ణోగ్రతలు క్రమేణా పెరుగుతున్నాయి. ఏపీలోని రెంటచింతలలో గురువారం 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

AP TG Summer Updates: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఉష్ణోగ్రతలు క్రమంగా 40 డిగ్రీలకు చేరువలో ఉన్నాయి.
తెలంగాణలోని ఆదిలాబాద్‌లో గురువారం అత్యధిక ఉష్ణోగ్రత నమోదయింది. సాధారణం కన్నా ఏకంగా 4.4 డిగ్రీలు పెరిగి.. 40.3 డిగ్రీలుగా నమోదయింది. బుధవారం రాత్రి కనిష్ఠ ఉష్ణోగ్రత కూడా సాధారణం కన్నా 2 డిగ్రీలు పెరిగి 22.7 డిగ్రీలుగా నమోదయ్యాయి. నిజామాబాద్‌లో పగటిపూట సాధారణం కన్నా 3.2 డిగ్రీలు పెరిగి 40.1 డిగ్రీలు నమోదయింది.
ఖమ్మంలో సాధారణ ఉష్ణోగ్రతల కంటే అధికంగా 2.9 డిగ్రీలు అధికంగా పెరిగింది. మరో వైపు శుక్ర, శని, ఆదివారాల్లో రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. రెండు నుంచి నాలుగు డిగ్రీల వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయని ప్రకటించింది.
పల్నాడులో మండుతున్న ఎండలు..
ఆంధ్రప్రదేశ్‌లోని రెంటచింతలలో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. పల్నాడు జిల్లా రెంటచింతలలో ఉష్ణోగ్రతలు భగ్గుమంటున్నాయి. గురువారం రెంటచింతలలో గరిష్ఠ ఉష్ణోగ్రత 42.8 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 28.4 డిగ్రీలుగా నమోదు అయ్యాయి. ఏటా రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతాల్లో ఒకటైన రెంట చింతలలో ఎండలకు ప్రజలు హడలిపోతు న్నారు. గతంలో రెంటచింతలలో గరిష్ట ఉష్ణోగ్రత 49 డిగ్రీలకుపైగా నమోదయ్యాయి. ఈ ఏడాది ముందస్తు హెచ్చరికలతో జనం బెంబేలెత్తి పోతున్నారు.
హిందూ మహా సముద్ర పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో వాతావరణంలో వేడిగాలులు పెరిగాయి. ఉపరితల ఆవర్తనం దిశగా ఎడారి నుంచి పొడిగాలులు వాయువ్య, మధ్య, దక్షిణ భారతం మీదుగా వీస్తున్నాయి. దీంతో కోస్తా, రాయలసీమల్లో అనేకచోట్ల వేడి వాతావరణం నెలకొంది. ప్రధానంగా ఉత్తర కోస్తాలోని అనేక ప్రాంతాల్లో గురువారం వడగాడ్పులు వీచాయి.
ఈ ఏడాది వేసవి సీజన్లో తొలిసారిగా రాష్ట్రంలో పలుచోట్ల 40 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమో దయ్యాయి. నంద్యాలలో 40.2, అనంతపురం, నందిగామల్లో 40.1, జంగమహేశ్వరపురంలో 39.9. తునిలో 39.5 డిగ్రీలు నమోద య్యాయి. ఈనెల 16వ తేదీ వరకు కోస్తాలో అనేక ప్రాంతాల్లో వడగా డ్పులు వీస్తాయని, రాయలసీమలో వేడి వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది.
సంబంధిత కథనం
టాపిక్