



Best Web Hosting Provider In India 2024

డెహ్రాడూన్ సమీపంలో ఒక అందమైన ప్రదేశం ఉంది, ఒక్కసారి అక్కడికి వెళ్తే తిరిగి రావాలనిపించదు, వేసవిలో ప్లాన్ చేయండి
చల్లని ప్రాంతాలకు వెకేషన్‌కు వెళ్లాలని ఎంతోమంది అనుకుంటారు. ఉత్తరాఖండ్లోని ప్రసిద్ధ కొండ ప్రాంతం ఒకటి ఉంది. అది డెహ్రాడూన్‌కి సమీపంలోనే అక్కడికి వెళితే జీవితాంతం అక్కడే ఉండాలనిపిస్తుంది.

వేసవిలో చల్ల చల్లని కొండ ప్రదేశాలకు వెళ్లాలని ఎంతోమంది ప్లాన్ చేస్తారు. ఇప్పుడు అందరూ వెళ్లే ప్రాంతాలకే కాదు కొన్నిసార్లు కొత్త హిల్ స్టేషన్లకు కూడా వెళ్లి రావాలి. ఉత్తర భారత దేశంలో ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. అవి అలాంటి ప్రసిద్ధ గమ్యస్థానాలలో డెహ్రాడూన్ ఒకటి. ఎంతో మంది డెహ్రాడూన్ వెళ్లి వస్తూ ఉంటారు. డెహ్రాడూన్ లోనే ఒక హిల్ స్టేషన్ ఉంది. చాలా తక్కువ మందికి మాత్రమే ఇది తెలుసు. దాని పేరు కనాటల్ హిల్ స్టేషన్. పచ్చని లోయల మధ్య ఉండే ఈ కనాటల్ హిల్ స్టేషన్‌కు వెళితే తిరిగి రావాలన్నా కోరిక రాదు. అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. అంత అందంగా ఉంటుంది ఈ హిల్ స్టేషన్.
ఈమధ్య కనాతల్ హిల్ స్టేషన్‌కు పర్యాటకుల తాకిడి పెరిగిపోతోంది. కానీ ఇతర పర్యాటక ప్రదేశాలతో పోలిస్తే ఇక్కడ రద్దీ తక్కువనే చెప్పుకోవాలి. ఎందుకంటే దీని గురించి తక్కువ మందికే తెలుసు. రద్దీగా ఉండే ప్రదేశానికి వెళ్లే బదులు కనాటల్ వెళితే మీరు పూర్తిగా మీ సెలవులను ఆస్వాదించవచ్చు. నైనిటాల్‌ను కూడా మరిపించేలా ఉంటుంది కనాటల్.
కనాటల్ ఎక్కడ ఉంది?
ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్‌కు 78 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ కనాటల్ హిల్ స్టేషన్ చంబా నుండి కేవలం 12 కిలోమీటర్ల దూరమే. ఇది సహజ సౌందర్యంతో నిండిపోయి ఉంటుంది. అడుగడుగునా ప్రకృతి సౌందర్యమే కనిపిస్తుంది. శీతాకాలం, వేసవికాలం ఎప్పుడు వెళ్ళినా మీ సెలవులను ఆనందంగా ఇక్కడ ఆస్వాదించవచ్చు.
కనాటల్‌లో ఏం చేయవచ్చు?
కనాటల్ చుట్టూ అడవులే ఉంటాయి. అప్పుడప్పుడు మంచు కూడా కురుస్తుంది. మంచు కురుస్తున్న సమయంలో ఎన్నో సాహస క్రీడలు కూడా ఉంటాయి. ఈ లోయల్లో క్యాంపింగ్ కూడా చేయవచ్చు. ఫోటోగ్రఫీకి ఇది మంచి ప్రదేశం అని చెప్పుకోవాలి. నదులు, పర్వతాలు, జలపాతాలు, కొండలు, పచ్చని అడవులు… అన్నీ కలిసి ఉన్న ప్రదేశం కనాటల్. ట్రెక్కింగ్ కు కూడా ఇక్కడ వెళ్ళవచ్చు. ఇక్కడకు వెళ్తే మీరు అద్భుతమైన అందమైన ఆపిల్ తోటలను చూడవచ్చు. హిమాలయ లోయలను చూడాలనుకున్నా కూడా కనాటల్ హిల్ స్టేషన్‌కు వెళ్ళండి. అక్కడ సుర్కంద దేవి ఆలయం కూడా ఉంటుంది
కనాటల్ కు ఎలా చేరుకోవాలి?
మీరు కనాటల్ హిల్ స్టేషన్‌కు వెళ్లాలంటే ముందుగా డెహ్రాడూన్ కు చేరుకోవాలి. విమానంలో వచ్చేవారు డెహ్రాడూన్ వరకు రావాలి. అక్కడ జాలి గ్రాంట్ విమానాశ్రయం ఉంటుంది. జాలి గ్రాంట్ విమానాశ్రయం నుంచి డెహ్రాడూన్ నగరానికి వెళ్లడానికి గంట సమయం పడుతుంది. అక్కడ నుంచి కర్ణాటక హిల్ స్టేషన్ కి క్యాబ్ లో వెళ్లవచ్చు.
రైళ్లలో రావాలనుకునే వారు ముందుగా డెహ్రాడూన్ రైల్వే స్టేషన్ కు చేరుకోవాలి. ఈ రైల్వే స్టేషన్ నుంచి అన్ని ప్రధాన నగరాలకు రైళ్లు నడుస్తున్నాయి. డెహ్రాడూన్ చేరుకున్నాక అక్కడ ఉన్న అద్దె కారులలో హిల్ స్టేషన్‌కు చేరుకోవచ్చు.
కనాటల్ లో చక్కగా క్యాంపింగ్ ఏర్పాటు చేసుకోవచ్చు. కాబట్టి మీరు డెహ్రాడూన్‌లోనే గదులు అద్దెకు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. క్యాంపింగ్ ఎంతో అందంగా ఉంటుంది. లేకుంటే మీరు డెహ్రాడూన్ లోనే గదులు అద్దెకి తీసుకోవాలనుకుంటే సిల్వర్ స్ప్రింగ్ కాటేజ్, నార్మండి హౌస్, బాంబూ గార్డెన్ ఇలా అందమైన హోటల్స్ ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ మంచి హోమ్ స్టే ను అందిస్తాయి.
సంబంధిత కథనం