





Best Web Hosting Provider In India 2024

Holi Cleaning Hacks: ఖరీదైన మీ బట్టల మీద హోలీ రంగు పడిందా..? బాధకపడకండి అ టిప్స్‌తో ఈజీగా శుభ్రం చేసుకోండి!
Holi Cleaning Hacks: మీ ఖరీదైన బట్టల మీద హోలీ రంగులు పడ్డాయా? వాటిని ఎలా శుభ్రం చేయాలా అని బాధపడుతున్నారా? అయితే ఈ టిప్స్ మీ కోసమే. ఈ చిన్న చిన్న చిట్కాలు పాటించారంటే మీ బట్టల మీదున్న హెలీ రంగులను ఈజీగా తొలగించుకోవచ్చు.

రంగుల పండుగ హోలీ ఆనందం, ఉత్సాహంతో పాటు చాలా పనిని కూడా తీసుకువస్తుంది. అదే నండీ శుభ్రం చేసే పని. హోలీ ఆడిన తర్వాత ఇంటి టైల్స్ నుండి గోడలు వరకూ శరీరం నుంచి బట్టల వరకూ అన్నింటి మీద పడిన రంగులను శుభ్రం చేస్తూ చాలా మంది మహిళలు అలసిపోతారు. ముఖ్యంగా ఖరీదైన బట్టల మీద పడిన హోలీ రంగులు వాటిని పాడుచేసినప్పుడు వారి మనసు మరింత బాధపడుతుంది. బట్టల మీద పడిన ఈ మరకలు సులభంగా తొలగిపోవు.
చాలా సమయాల్లో వాటిని పారేయడం లేదా ఇంట్లో తుడవడానికి ఉపయోగించడమో జరుగుతుంది. ప్రతి సంవత్సరం హోలీలో మీకు కూడా ఇలాంటిదే జరుగుతున్నట్లయితే మీకోసం మేం కొన్ని చిట్కాలను తీసుకొచ్చాం. ఈ హోలీ సందర్భంగా మీ ఫేవరెట్ లేదా ఖరీదైన బట్టల నుండి హోలీ రంగులను తొలగించడంలో సహాయపడే కొన్ని క్లీనింగ్ టిప్స్‌ను తెలుసుకోండి.
బట్టల నుండి హోలీ రంగులను తొలగించే సింపుల్ చిట్కాలు:
1. వెనిగర్:
బట్టల నుండి హోలీ రంగులను శుభ్రం చేయడానికి వెనిగర్ చాలా బాగా ఉపయోగపడుతుంది.
- దీని కోసం మీరు ముందుగా ఒక బకెట్ తీసుకుని దాంట్లో గోరువెచ్చని నీటిని నింపండి.
- తరువాత దీంట్లో అరకప్పు తెల్లని వెనిగర్, రెండు చెంచాల బేకింగ్ సోడా వేసి బాగా కలపండి.
- ఇప్పుడు హెలీ మరకలతో నిండిన మీ బట్టలను ఒక గంట పాటు దాంట్లో నానబెట్టండి.
- ఆ తర్వాత నీటిలో డిటర్జెంట్ పౌడర్ వేసి బట్టలను తేలికగా రుద్దుతూ శుభ్రం చేయండి. అంతే ఇలా చేశారంటే మీ కొత్త లేదా ఇష్టమైన బట్టల మీదున్న మరకలు తొలగిపోయి, తిరిగి అందంగా మెరిసిపోతాయి.
పెరుగు:
చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. బట్టల మీద పడిన మొండి మరకలను తొలగించడానికి పెరుగు చాలా బాగా సహాయపడుతుంది.
- ఇందుకోసం మీరు బాగా పులిసిపోయిన పెరుగును తీసుకోండి. ఈ పెరుగును బకెట్టో వేసి బట్టలు మునిగేంత వరకూ సరిపడే నీరు పోయండి.
- నీటిలో పెరుగు అంతా బాగా కలపిపోయిన తర్వాత దాంట్లో మరకలు పడిన మీ బట్టలను పెట్టి నానబెట్టండి.
- ఇలా అరగంట నుంచి గంట పాటు నానబెట్టిన తర్వాత సర్ఫ్ లేదా డిటర్జెంట్ సబ్బుతో మీ బట్టలను శుభ్రం చేయండి.
- ఇలా రెండు మూడు సార్లు ఉతికారంటే మీ బట్టల మీద ఉన్న హోలీ రంగులన్నీ మాయం అయిపోతాయి. ఓకే రోజు ఉతకడం కాకుండా వేరు వేరు రోజుల్లో వీటిని ఉతకడం మంచిది.
3. ఆల్కహాల్
బట్టల మీద పడిన మొండి, ముదురు హోలీ రంగులను తొలగించడానికి ఆల్కహాల్ కూడా చాలా బాగా ఉపయోగించవచ్చు.
ఈ చిట్కాను అనుసరించడానికి ముందుగా మరకలు పడిన మీ డ్రెస్ ను నీటిలో ముంచి శుభ్రం చేయండి.
తర్వాత ఒక గిన్నెలో ఆల్కాహాల్, కొద్దిగా నీరు తీసుకుని రెండింటినీ బాగా కలపండి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మీ డ్రెస్ మీద రంగు పడిన చోట తేలికగా రుద్దుతూ అప్లై చేయండి.
ఇలా కాసేపు ఉంచిన తర్వాత సర్ఫ్ లేదా డిటర్జెంట్ సబ్బుతో మీ బట్టలను శుభ్రం చేయండి.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల అభిప్రాలయను క్రోడీకరించి మాత్రమే ఈ సూచనలు అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం