






Best Web Hosting Provider In India 2024

Kannada OTT: ఒకే రోజు ఓటీటీలోకి వచ్చిన రెండు కన్నడ సినిమాలు – ఒకటి అడ్వెంచర్ – మరోటి యాక్షన్ థ్రిల్లర్
Kannada OTT: శుక్రవారం ఒక్కరోజే రెండు కన్నడ సినిమాలో ఓటీటీలోకి వచ్చాయి. యాక్షన్ థ్రిల్లర్ మూవీ హిరణ్య సన్ నెక్సట్ ద్వారా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రాగా…అడ్వెంచర్ థ్రిల్లర్‌గా రూపొందిన ఫారెస్ట్ సన్ నెక్స్ట్ ఓటీటీలో రిలీజైంది.

Kannada OTT: శుక్రవారం ఒక్కరోజే రెండు కన్నడ సినిమాలు ఓటీటీలోకి వచ్చాయి. హిరణ్య మూవీ సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోండగా…ఫారెస్ట్ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజైంది.
అడ్వెంచర్ థ్రిల్లర్….
అడ్వెంచరస్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఫారెస్ట్ మూవీ శుక్రవారం సడెన్‌గా ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఫారెస్ట్ మూవీలో చిక్కన్న, అనీష్ తేజేశ్వర్, రంగాయన రఘు, శరణ్య శెట్టి కీలక పాత్రలు పోషించారు. జనవరి నెలాఖరున థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఐఎమ్‌డీబీలో 9.1 రేటింగ్‌ను సొంతం చేసుకున్నది.
తెలుగు డైరెక్టర్…
ఫారెస్ట్ మూవీకి చంద్రమోహన్ చింతాడ దర్శకత్వం వహించాడు.చంద్రమోహన్ తెలుగు డైరెక్టర్ కావడం గమనార్హం. గతంలో శర్వానంద్‌తో రాధ అనే సినిమా చేశాడు. అడవిలో ఓ స్మగ్లర్ దాచిపెట్టిన కోట్ల రూపాయల నిధిని తమ సొంతం చేసుకోవడానికి ఐదుగురు స్నేహితుల బృందం ప్రయత్నిస్తారు. ఆ నిధికి దయ్యాలు కాపాలా ఉన్నాయనే నిజం అడవిలో అడుగుపెట్టిన తర్వాతే వారికి తెలుస్తుంది. దయ్యాల ను బోల్తా కొట్టించి ఆ నిధి హీరో అండ్ గ్యాంగ్ ఎలా సొంతం చేసుకున్నారు? అడవిలో ఎలాంటి ఇబ్బందులు పడ్డారు అన్నదే ఫారెస్ట్ మూవీ కథ. స్మగ్లర్ వీరప్పన్ స్ఫూర్తితో దర్శకుడు ఈ కథను రాసుకున్నాడు.
హిరణ్య….
కన్నడ మూవీ హిరణ్య సన్ నెక్స్ట్ ద్వారా ఓటీటీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీలో రాజవర్ధన్, రిహానా, దియా సురేష్ హీరోహీరోయిన్లుగా నటించారు. ప్రవీణ్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీకి జుడా సాండీ మ్యూజిక్ అందించాడు.
గత ఏడాది జూలైలో హిరణ్య మూవీ థియేటర్లలో రిలీజైంది. దాదాపు ఎనిమిది నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చింది.
కాంట్రాక్ట్ కిల్లర్ కథ…
రానా ఓ కాంట్రాక్ట్ కిల్లర్. ఓ చిన్నారిని చంపే డీల్ కుదర్చుకుంటాడు. ఆమెను కిడ్నాప్ చేస్తాడు. కానీ అనుకోని పరిస్థితుల్లో తాను చంపాలనుకున్న చిన్నారికే రక్షకుడిగా రానా మారిపోతాడు. ఆ చిన్నారిని కాపాడటానికి ప్రాణాలకు తెగించి పోరాడుతాడు. అసలు రానాకు ఆ చిన్నారికి ఉన్న సంబంధం ఏమిటి? అన్నదే హిరణ్య మూవీ కథ. ఈ సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్స్, ట్విస్ట్‌లు అభిమానులను ఆకట్టుకున్నాయి.
సంబంధిత కథనం