Makhana Laddu: శరీరాన్ని ఉక్కులా మార్చే మఖానా లడ్డు ఇలా చేయండి, పిల్లలకు పెడితే మంచిది

Best Web Hosting Provider In India 2024

Makhana Laddu: శరీరాన్ని ఉక్కులా మార్చే మఖానా లడ్డు ఇలా చేయండి, పిల్లలకు పెడితే మంచిది

Haritha Chappa HT Telugu
Published Mar 14, 2025 11:30 AM IST

Makhana Laddu: ఫూల్ మఖానా ఆరోగ్యానికి ఎంతో మంచిది. దాంతో లడ్డూ చేసి పెట్టండి. పిల్లలు ఇష్టంగా తింటారు. పైగా వారికి ఎంతో ఆరోగ్యం.

మఖానా లడ్డు రెసిపీ
మఖానా లడ్డు రెసిపీ

ఫూల్ మఖానాను ఇప్పుడు సూపర్ ఫుడ్ గా చెప్పుకుంటున్నారు. దానితో చేసే లడ్డూలు రుచిగా ఉంటాయి. పైగా అది ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. శరీరాన్ని ఉక్కులా మార్చే శక్తి మఖానా లడ్డుకి ఉంది. దీని రెసిపీ ఎలాగో తెలుసుకోండి. దీనిలో అనేక డ్రై ఫ్రూట్స్, నట్స్ కూడా వేస్తాం. కాబట్టి రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మఖానా లడ్డు రెసిపీ ఎలాగంటే…

మఖానా లడ్డూ రెసిపీకి కావాల్సిన పదార్థాలు

ఫూల్ మఖానా – మూడు కప్పులు

నెయ్యి – నాలుగు స్పూన్లు

బాదం పప్పులు – అరకప్పు

జీడిపప్పులు – అర కప్పు

కొబ్బరి పొడి – ఒక కప్పు

బెల్లం – ఒకటిన్నర కప్పు

నీళ్లు – అరకప్పు

ఫుల్ మఖానా లడ్డు రెసిపీ

1. స్టవ్ మీద కళాయి పెట్టి పూల్ మఖానాను వేసి క్రిస్పీగా అయ్యేలా వేయించుకోవాలి.

2. అలా వేగిన మఖానాను తీసి పక్కన పెట్టుకోవాలి.

3. ఇప్పుడు అదే కళాయిలో రెండు స్పూన్ల నెయ్యి వేసి జీడిపప్పులు, బాదం పప్పులు వేసి బాగా వేయించుకోవాలి.

4. అవి వేగాక కొబ్బరి పొడి వేసి వేయించుకోవాలి. వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి.

5. ఇప్పుడు మరొక కళాయి స్టవ్ మీద పెట్టి బెల్లం తురుము, అరకప్పు వాటర్ వేసి అది తీగపాకం వచ్చేవరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి.

6. మిక్సీలో ఫూల్ మఖానాను వేసి పొడి చేయాలి. ఆ పొడిని ఒక గిన్నెలో వేయాలి.

7. ఆ తర్వాత అదే మిక్సీలో వేయించి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పులు, కొబ్బరిపొడి, యాలకులు వేసి పొడి చేసి.. మఖానా పొడిలోనే వేయాలి.

8. ఇప్పుడు ఈ మిశ్రమంలో రెండు స్పూన్ల నెయ్యి, బెల్లం తీగ పాకం వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత వాటిని లడ్డూల్లాగా చుట్టుకోవాలి.

9. అంతే మఖానా లడ్డు రెడీ అయినట్టే. ఇది ఎంతో రుచిగా ఉంటుంది.

ఫూల్ మఖానా లడ్డూ శరీరానికి ఎన్నో పోషకాలను అందిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచి ఎన్నో సమస్యలు రాకుండా చూస్తుంది. ముఖ్యంగా పిల్లలకు మఖానా లడ్డు పెడితే ఆరోగ్యానికి ఎంతో మంచిది.

మఖానాలో పోషకాలు అధికంగా ఉంటాయి. కాబట్టే దీన్ని సూపర్ ఫుడ్ అని పిలుస్తారు. దీన్ని వేయించి సలాడ్లు, కూరల్లో కూడా భాగం చేసుకుంటారు. మఖానాలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్ నుంచి గుండెను కాపాడతాయి. అలాగే మఖానాలలో ఐరన్ కూడా ఎక్కువే కాబట్టి రక్తహీనత సమస్యతో బాధపడుతున్న వారికి మఖానా మేలు చేస్తుంది. మఖానాలో క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్ కూడా అధికంగా ఉంటుంది. కాబట్టి మఖానా తినడం వల్ల గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిది.

Haritha Chappa

TwittereMail
హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.
Whats_app_banner

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024