Gunde Ninda Gudi Gantalu Serial: బాలు చేతికి గాయం – భ‌ర్త‌కు ప్రేమ‌తో గోరు ముద్ద‌లు పెట్టిన‌ మీనా – ప్ర‌భావ‌తి కండీష‌న్

Best Web Hosting Provider In India 2024

Gunde Ninda Gudi Gantalu Serial: బాలు చేతికి గాయం – భ‌ర్త‌కు ప్రేమ‌తో గోరు ముద్ద‌లు పెట్టిన‌ మీనా – ప్ర‌భావ‌తి కండీష‌న్

Nelki Naresh HT Telugu
Published Mar 14, 2025 08:56 AM IST

Gunde Ninda Gudi Gantalu Serial: గుండె నిండా గుడి గంట‌లు మార్చి 14 ఎపిసోడ్‌లో మౌనిక ఫంక్ష‌న్ కోసం అవ‌స‌ర‌మైన డ‌బ్బు కోసం నిద్ర‌, తిండి మానేసి క‌ష్ట‌ప‌డ‌తాడు బాలు. భ‌ర్త క‌ష్టం చూసి మీనా ఎమోష‌న‌ల్ అవుతుంది. బాలు చేతికి గాయం కావ‌డంతో తానే స్వ‌యంగా భ‌ర్త‌కు అన్నం తినిపిస్తుంది మీనా.

గుండె నిండా గుడి గంట‌లు మార్చి 14 ఎపిసోడ్‌
గుండె నిండా గుడి గంట‌లు మార్చి 14 ఎపిసోడ్‌

Gunde Ninda Gudi Gantalu Serial: మౌనిక ఫంక్ష‌న్ కోసం అవ‌స‌ర‌మ‌య్యే డ‌బ్బుల కోసం ఆగ‌కుండా రెండు రోజులు కారు ట్రిప్పులు వేస్తాడు బాలు. అర‌టి ప‌ళ్ల‌తో క‌డుపు నింపుకుంటాడు. కారు పంక్చ‌ర్ కావ‌డంతో టైర్ మార్చే క్ర‌మంలో చేతికి దెబ్బ త‌గులుతుంది. అయినా ప‌ట్టించుకోకుండా కారు న‌డుపుతాడు. మీనా ఫోన్ చేసినా త‌ర్వాత కాల్ చేస్తాన‌ని క‌ట్ చేస్తాడు.

క‌ఠువుగా ఉండ‌లేను…

మౌనిక ఫంక్ష‌న్‌లో ఉండొద్ద‌ని బాలుకు ఎలా చెప్పాలో తెలియ‌క ఆలోచ‌న‌లో ప‌డ‌తాడు స‌త్యం. బాలు ఉండ‌టం వ‌ల్ల త‌లెత్తే అనార్థాలేమిటో చెబితే స‌రిపోతుంది అంటూ తేలిగ్గా మాట్లాడుతుంది ప్ర‌భావ‌తి. బాలు విష‌యంలో నువ్వు ఉన్నంత క‌ఠువుగా నేను ఉండ‌లేన‌ని స‌త్య బ‌దులిస్తాడు. బాలుతో నేనే మాట్లాడుతాన‌ని ప్ర‌భావ‌తి అంటుంది. అక్క‌ర‌లేద‌ని స‌త్యం స‌మాధాన‌మిస్తాడు.

రేయి ప‌గ‌లు చూడ‌కుండా…

బాలు కోసం ఎదురుచూస్తుంటాడు స‌త్యం. అర్థ‌రాత్రి అయినా బాలు రాక‌పోవ‌డంతో మీనా టెన్ష‌న్ ప‌డుతుంది. బాలు ఇంకా రాలేదా అని మీనాను అడుగుతాడు స‌త్యం. ఫంక్ష‌న్ కు కావాల్సిన డ‌బ్బుల కోసం రేయిప‌గ‌లు చూడ‌కుండా క‌ష్ట‌ప‌డుతున్నార‌ని మీనా బ‌దులిస్తుంది. ఫంక్ష‌న్‌లో ఉండొద్ద‌ని బాలుతో చెప్ప‌డం అంటే న‌న్ను నేను శిక్షించుకోవ‌డ‌మేన‌ని స‌త్యంబాధ‌ప‌డ‌తాడు.

ఓవ‌ర్ టైమ్ చేశా…

అప్పుడే బాలు అక్క‌డికి వ‌స్తాడు. మీరు రాత్ర‌యిన ఇంటికి రాక‌పోవ‌డంతో తాను టెన్ష‌న్ ప‌డ్డాన‌ని భ‌ర్త‌తో అంటుంది మీనా. రేపు మౌనిక ఫంక్ష‌న్ ఉంద‌ని తెలుసుగా…ఎంత క‌ష్ట‌ప‌డ్డా ఈ రోజుకేన‌ని బాలు అంటాడు. డ‌బ్బుల కోసం ఓవ‌ర్‌టైమ్ చేశాన‌ని, మౌనిక ముఖంలో సంతోషం చూడ‌టం కోస‌మే ఈ క‌ష్టం అంతా అని అంటాడు. ఇంటి ఆడ‌పిల్ల‌కు నాన్న త‌ర్వాత అన్న‌య్యే క‌దా అన్ని అని అంటాడు. ఫంక్ష‌న్ కోసం అవ‌స‌ర‌మైన డ‌బ్బును స‌త్యానికి ఇస్తాడు బాలు. ఫంక్ష‌న్ కోసం తాను చేసిన ఏర్పాట్లు మొత్తం తండ్రికి చెబుతాడు బాలు.

చేతికి గాయం…

బాలు చేతికి అయిన గాయం చూసి మీనా కంగారు ప‌డుతుంది. కారు టైర్ మారుస్తుంటే దెబ్బ త‌గిలింద‌ని, చిన్న‌దే దెబ్బ అని బాలు అంటాడు. ఈ దెబ్బ రెండు రోజుల్లో త‌గ్గిపోతుంది. కానీ మౌనిక క‌ళ్ల‌ల్లో సంతోషం మాత్రం జీవితాంతం ఉంటుంద‌ని బాలు అంటాడు. బాలు మాట‌ల‌తో ఫంక్ష‌న్‌లో ఉండొద్ద‌ని బాలుకు చెప్ప‌లేక‌పోతాడు స‌త్యం. రేపు మాట్లాడుకుందామ‌ని బాలుతో అంటాడు.

బాలు డ‌బ్బు…

బాలు, మీనా వెళ్లిపోగానే భ‌ర్త‌పై ఫైర్ అవుతుంది ప్ర‌భావ‌తి. నేను ఏం చెప్ప‌మ‌న్నాను. మీరు ఏం చేశారు. బాలుపై ప్రేమ పొంగిపోయిందా అంటూ భ‌ర్త‌పై కోప్ప‌డుతుంది. బాలు ఇచ్చిన డ‌బ్బులు ప్ర‌భావ‌తికి చూపిస్తాడు స‌త్యం. చెల్లి ఫంక్ష‌న్ కోసం రేయింబ‌వ‌ళ్లు క‌ష్ట‌ప‌డి డ‌బ్బులు ఇచ్చాడ‌ని, వాడినే ఫంక్ష‌న్‌లో ఉండొద్ద‌ని ఎలా చెప్పాల‌ని స‌త్యం బ‌దులిస్తాడు.

అస‌లు బాలు ఉంటే ఫంక్ష‌న్ జ‌ర‌గ‌దొని మీనా అంటుంది. బాలు ఉంటే గుమ్మంలో అడుగుపెట్ట‌మ‌ని సంజు ఫ్యామిలీ అన్న సంగ‌తి గుర్తు చేస్తుంది. మీ తండ్రీకొడుకుల ప్రేమ వ‌ల్ల నా కూతురు ఫంక్ష‌న్ చెడిపోతే ఊరుకోన‌ని అంటుంది. ఏ స‌మ‌స్య వ‌చ్చినా తాను చూసుకుంటాన‌ని ప్ర‌భావ‌తికి స‌ర్ధిచెప్ప‌బోతాడు స‌త్యం. కొడుకుకే చిన్న విష‌యం చెప్ప‌లేక‌పోయారు..ఇక స‌మ‌స్య రాకుండా ఎలా చూసుకుంటార‌ని ప్ర‌భావ‌తి కోపంగా అంటుంది. క‌న్న కొడుకును స‌మ‌స్య‌గా భావించే త‌ల్లిని నిన్నే చూస్తున్నాన‌ని స‌త్యం కోపంగా అంటాడు. ఈ విష‌యం గురించి బాతుతో తానే మాట్లాడుతాన‌ని ప్ర‌భావ‌తి అంటుంది.

భ‌ర్త‌కు అన్నం తినిపించిన మీనా…

రెండు రోజులు రెస్ట్ లేకుండా క‌ష్ట‌ప‌డ‌టంతో ఒళ్లు నొప్పుల‌తో ష‌ర్ట్ కూడా విప్ప‌లేక‌పోతాడు బాలు. మీనా సాయం చేస్తుంది. క‌ష్టాల్లో ఉన్న‌ప్పుడే భార్య విలువ ఏమిటో అర్థ‌మ‌వుతుంద‌ని మీనాతో అంటాడు. బాలు చేతికి అయిన గాయానికి మందు రాస్తుంది. బాలు అన్నం తిన‌డానికి ఇబ్బంది ప‌డ‌టంతో తానే స్వ‌యంగా భ‌ర్త‌కు తినిపిస్తుంది. మీనా ప్రేమ‌కు ఫిదా అవుతాడు బాలు.

మీనా ఎమోష‌న‌ల్‌…

చిన్న‌ప్పుడు అమ్మ చేతితో గోరుముద్ద‌లు తిన‌లేక‌పోయాన‌ని, కానీ ఇప్పుడు పెళ్లాం చేతితో ముద్ద‌లు తిన‌డం సంతోషంగా ఉంద‌ని అంటాడు. క‌డుపు నిండిపోయింద‌ని చెప్పిన విన‌కుండా మీనా తినిపిస్తూనే ఉంటుంది. నిద్ర‌పోకుండా ప‌నిచేస్తే మీకు ఏద‌న్నా అయితే ఎలా అని మీనా ఎమోష‌న‌ల్ అవుతుంది. నాకు ఏం కాద‌ని మీనాను బుజ్జ‌గిస్తాడు బాలు. మ‌నం బాగుండ‌టం కోస‌మే క‌ష్ట‌ప‌డుతున్నాన‌ని బ‌దులిస్తాడు.

మ‌న‌సు ఎంతో మృదువు…

మీరు పైకి ఎంత మొండిగా క‌నిపించినా మీ మ‌న‌సు ఎంత మృదువుగా ఉంటుందో నాకు మాత్ర‌మే తెలుసు. అది ఇంట్లో వాళ్ల‌కు అర్థం కావ‌డం లేద‌న్న‌దే నా బాధ అని మీనా అంటుంది. ఎవ‌రికి అర్థం అయినా కాపోయినా నువ్వు నా అర్ధాంగివి నీకు అర్థ‌మ‌యితే చాల‌ని స‌మాధాన‌మిస్తాడు. రేపు ఫంక్ష‌న్‌లో ఎవ‌రితో గొడ‌వ‌లు ప‌డొద్ద‌ని బాలుతో అంటుంది మీనా. స‌రేన‌ని భార్య‌కు మాటిస్తాడు బాలు.

న‌ల‌భీమ‌…

ఫంక్ష‌న్ కోసం టిప్‌టాప్‌గా రెడీ అవుతాడు బాలు, ర‌వి ఎదురుప‌డ‌గానే లేచిపోయినోడా అని పిలుస్తాడు. ఇంత‌కుముందు న‌ల‌భీమ అని ప్రేమ‌గా పిలిచేవాడికి క‌దా అని పిల‌వ‌మ‌ని అన్న‌తో అంటాడు ర‌వి. నాన్న‌ను మోసం చేసినందుకు నీకు ఇదే ప‌నిష్‌మెంట్ అని అంటాడు.

రోహిణి రెడీ అయ్యి క‌నిపిస్తుంది. ఏ ప‌నిలేనోళ్లు అందంగా ముస్తాబై తిరుగుతున్నార‌ని, నువ్వు మాత్రం కిచెన్‌లో క‌ష్ట‌ప‌డ‌టం ఎందుకు అని రోహిణిపై సెటైర్లు వేస్తాడు.ఏమైంద‌ని మ‌నోజ్ అడుగుతాడు. ప‌ల్లీలు కావాలంటా పార్కుకు వెళ‌తావా అని మ‌నోజ్‌పై పంచ్‌లు వేస్తాడు.

నిజం బ‌య‌ట‌పెట్టిన ప్ర‌భావ‌తి…

అప్పుడే అక్క‌డికి వ‌చ్చిన ప్ర‌భావ‌తి…బాలు, మీనాల‌ను గుడికి వెళ్లి పూజ చేయాల‌ని అంటుంది. బాలు వెళ్ల‌న‌ని మొండి ప‌ట్టుప‌ట్ట‌డంతో అస‌లు నిజం బ‌య‌ట‌పెడుతుంది. అస‌లు నిన్ను ఫంక్ష‌న్‌లోనే ఉండొద్ద‌ని వాళ్లు కండీష‌న్ పెట్టార‌ని అంటాడు.ఆ విష‌యం మీ నాన్న‌కు కూడా తెలుసున‌ని ప్ర‌భావ‌తి అంటుంది. నువ్వు ఉండొద్ద‌ని ఒక్క మాట చెబితే నేను ఈ పాటికే వెళ్లిపోయేవాడిని అని తండ్రితో బాలు అంటాడు. నేను వెళ్లిపోతాన‌ని స‌త్యంతో చెబుతాడు బాలు. కొడుకు మాట‌లు విన‌గానే స‌త్యం ఎమోష‌న‌ల్ అయ్యి క‌న్నీళ్లు పెట్టుకుంటాడు. అక్క‌డితో నేటి గుండె నిండా గుడి గంట‌లు సీరియ‌ల్ ముగిసింది.

Nelki Naresh

TwittereMail
నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024